ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో డెత్‌ఓవర్ స్పెషలిస్ట్, టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి అదరగొట్టాడు. పదునైన బంతులతో ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. బుధవారం నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే 250 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొని భారత్ ఈ మ్యాచ్ నెగ్గిందంటే దానికి కారణం ముమ్మాటికి జస్ప్రిత్ బుమ్రానే. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. కేవలం 29 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.
బుమ్రా మరోసారి అదరగొట్టాడు
Published Wed, Mar 6 2019 12:54 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement