నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 156 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయింది. భారత ఆల్ రౌండర్ విజయ్ శంకర్(46; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) నాల్గో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే మంచి జోరు మీదున్న విజయ్ శంకర్‌ను దురదృష్టం వెంటాడిందనే చెప్పాలి. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కోహ్లి స్ట్రైట్ డ్రైవ్ ఆడగా, విజయ్ శంకర్ రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఆడమ్ జంపా వేసిన 29 ఓవర్ ఐదో బంతిని కోహ్లి స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడు. అది కాస్తా జంపా చేతి వేళ్లకు తాకుతూ వికెట్లను పడేసింది. ఆ సమయంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న విజయ్ శంకర్ క్రీజ్‌కు కొద్ది దూరంలో ఉన్నాడు. బ్యాట్‌ను క్రీజ్‌లో పెట్టే యత్నం చేసినప్పటికీ బంతి వికెట్లను గిరటేసేటప్పటికీ లైన్‌కు అంగుళందూరంలో నిలిచిపోవడంతో విజయ్ భారంగా పెవిలియన్ చేరాడు. దాంతో వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని విజయ్ తృటిలో కోల్పోయాడు. కాగా, భారత్ జట్టు 171 పరుగుల వద్ద కేదర్ జాదవ్(11) ఐదో వికెట్‌గా ఔటయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment