మాంచెస్టర్ : ప్రపంచకప్‌లో ఆరంభపు మ్యాచ్‌లోనే టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వేసిన తొలి బంతికే వికెట్ దక్కించుకొని సరికొత్త రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(7)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని బోల్తా కొట్టించాడు. పాక్ ఇన్నింగ్స్ సందర్భంగా ఐదో ఓవర్‌లో నాలుగు బంతులు వేసిన అనంతరం పలు కారణాలతో భువనేశ్వర్ మైదానం వీడాడు. దీంతో చివరి రెండు బంతులు వేయడానికి విజయ్ శంకర్ బంతిని అందుకున్నాడు. వేసిన తొలి బంతికే వికెట్ దక్కడంతో శంకర్‌తో సహా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు గాయం కావడంతో అతడి స్థానంలో పాక్‌తో మ్యాచ్‌కు విజయ్ శంకర్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించింది. ప్రపంచకప్‌కు పలువురు సీనియర్లను కాదని సెలక్టర్లు అతడిని ఎంపిక చేయడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లో అంతగా ఆకట్టుకోని శంకర్, బౌలింగ్‌లో పర్వాలేదనిపించాడు. అయితే తొలి బంతికే వికెట్ దక్కించుకోవడంపై విజయ్ శంకర్‌పై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ‘ఆరంభం అదిరిందయ్యా శంకర్’అంటూ కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment