
గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు(PC: GT Twitter)
IPL 2022- GT Teammates Video Viral: ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లోనే అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది గుజరాత్ టైటాన్స్. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు.. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌లలో 10 గెలిచి 20 పాయింట్లు సాధించింది. తద్వారా పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. క్యాష్ రిచ్ లీగ్ 2022 సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా సత్తా చాటింది.
దీంతో గుజరాత్ ఆటగాళ్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అంతా ఒక్కచోట చేరి తమ విజయాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా గడుపుతున్నారు. తమకంటూ ఓ ‘మ్యూజిక్ బ్యాండ్’ ఏర్పాటు చేసుకుని పాటలు పాడుతూ సరదాగా ఒకరినొకరు ఆటపట్టించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను గుజరాత్ టైటాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇందులో కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్ తదితర ఆటగాళ్లు ప్రముఖ తమిళ పాట.. ‘‘వై దిస్ కొలవెరి డి’’ని ఆలపిస్తూ కనిపించారు. ఈ వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి!
చదవండి👉🏾Kane Williamson: ఇంకెంత కాలం విలియమ్సన్‌ను భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి!
Comments
Please login to add a commentAdd a comment