![Anshuman Gaekwad Picks Kedar Jadhav to Bat at Number Four - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/27/Anshuman_Gaekwad.jpg.webp?itok=XBZvfksX)
మాంచెస్టర్: టీమిండియాలో నాలుగు స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న చర్చ గత కొంత కాలంగా జరుగుతోంది. ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన కష్టపడి నెగ్గడంతో నాలుగో స్థానంపై చర్చ మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. రిషబ్ పంత్ లేదా విజయ్ శంకర్ సరిపోతారా అని మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్‌ను అడిగితే ఊహించని విధంగా ఆయన మరోపేరు చెప్పారు. కేదార్ జాదవ్ కరెక్టుగా సరిపోతాడని సమాధానమిచ్చారు.
‘జాదవ్ బాగా ఆడగలడు. స్టైక్ రొటేట్ చేస్తూ పరుగులు పిండుకోవడంలో సిద్ధహస్తుడు. తనదైన షాట్లతోనూ అలరిస్తాడు. నా అభిప్రాయం ప్రకారం అతడిని నాలుగో స్థానంలో ఆడించాల’ని గైక్వాడ్ పేర్కొన్నారు. రెండో ఆప్షన్‌గా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వైపు మొగ్గు చూపారు. ‘దినేశ్ కార్తీక్ అనుభవజ్ఞుడు. ఫినిషనర్‌గా నిరూపించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లో కుదురుకుని ఆడగల సామర్థ్యం అతడికి ఉంద’ని తెలిపారు. యువ ఆటగాడు రిషబ్ పంత్ బ్యాటింగ్ బాగున్నా నాలుగో స్థానంలో ఎలా ఆడతాడో తాను చెప్పలేనని అన్నారు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్ల షాట్ సెలెక్షన్‌ను గైక్వాడ్ తప్పుబట్టారు. కేఎల్ రాహుల్, విజయ్ శంకర్ అవుటైన తీరును విమర్శించారు. (చదవండి: భారత్ అజేయభేరి)
Comments
Please login to add a commentAdd a comment