Anshuman Gaekwad
-
IND vs SL: శ్రీలంకతో తొలి వన్డే.. నల్ల బ్యాండ్లతో భారత జట్టు! ఎందుకంటే?
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు నలుపు రంగు బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు. భారత మాజీ క్రికెటర్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ బుధవారం(జూలై 31) తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు నివాళిగా భారత ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించారు. క్యాన్సర్‌తో పోరాడుతూ గైక్వాడ్ కన్నుమూశారు. గైక్వాడ్ భారత్ తరఫున మొత్తం 55 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. దేశవాళీ క్రికెట్లో బరోడా తరఫున 250కి పైగా మ్యాచ్‌లు ఆడారు. ఆయన మృతి పట్ల బీసీసీఐతో పాటు పలువురు ఆటగాళ్లు ఇప్పటికే సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యువ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌తో శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత జట్టుతో చేరారు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), సధీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్ సిరాజ్ -
పోరాడి ఓడిన భారత మాజీ క్రికెటర్: ఈ కేన్సర్‌ని ఎలా గుర్తించాలి..?
భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ చాలా కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ 71 ఏళ్ల వయసులో మరణించాడు. గైక్వాడ్ 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. వాటిలో 2 సెంచరీలతో కలిపి మొత్తం 2,254 పరుగులు చేశాడు. అతను 1983లో పాకిస్తాన్‌పై 201 పరుగులు చేశాడు. అయితే గైక్వాడ్ గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. అసలు ఈ ప్రాణాంతకమైన వ్యాధి అంటే ఏంటీ..? ఎందువల్ల వస్తుంది..? అంటే..ఇది ప్రాణాంతక క్యాన్సర్లలో ఒకటి. ఇక్కడ మాజీ గైక్వాడ్ తన అనారోగ్యంతో ఒక సంవత్సరం పాటు ధైర్యంగా పోరాడుతూ లండన్‌లో చికిత్స తీసుకున్నారు అయినప్పటికీ ప్రాణాలు కోల్పోయారు. బ్లడ్ కేన్సర్ అంటే..కేన్సర్ అంటే కణాల నియంత్రణ లేని పెరుగుదల. అదే విధంగా, బ్లడ్ కేన్సర్ అంటే రక్త కణాల అనియంత్రిత పెరుగుదల. రక్త కేన్సర్ హెమటోలాజిక్ కేన్సర్ అని కూడా పిలుస్తారు. ఎముక మజ్జ, శోషరస వ్యవస్థ, రక్త కణాల వంటి రక్తం-ఏర్పడే కణజాలాలలో (ప్రాధమిక, ద్వితీయ లింఫోయిడ్ అవయవాలు) ప్రారంభమవుతుంది.ఎలా ప్రభావితం చేస్తుందంటే..రక్త కణాల విధులు,ఉత్పత్తిలు బ్లడ్ కేన్సర్ ద్వారా ప్రభావితమవుతాయి. చాలా వరకు కేన్సర్లు రక్తం ఉత్పత్తి అయ్యే ప్రదేశం నుంచి అంటే ఎముక మజ్జ నుంచి ప్రారంభమవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సాధారణ రక్త కణాల అభివృద్ధి ప్రక్రియ అసాధారణ రకం కణాల పెరుగుదల ద్వారా చెదిరిపోతుంది. ఈ కేన్సర్ రక్త కణాలు రక్త నష్టాన్ని నివారించడం, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడడం మొదలైన ప్రాథమిక విధులను నిర్వహించకుండా రక్తాన్ని ఆపుతాయి.లుకేమియా సాధారణంగా చిన్న పిల్లలలో కనిపిస్తుంది.లింఫోమా సాధారణంగా 16 నుంచి 24 ఏళ్ల వయసు గల వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆడవారితో పోలిస్తే 31% మంది పురుషులు లుకేమియాతో బాధపడుతున్నారు.ఈ కేన్సర్‌లో రకాలు..మైలోమా: ఎముక మజ్జలో మొదలై ప్లాస్మా కణాలను ప్రభావితం చేసే కేన్సర్లింఫోమా: ఇది ఎముక మజ్జను కలిగి ఉన్న శోషరస వ్యవస్థకు సంబంధించిన కేన్సర్లుకేమియా:ఇది పిల్లలు,యుక్తవయస్కులలో వచ్చే అత్యంత సాధారణ రక్త కేన్సర్ఎందువల్ల అంటే..దీనికి డీఎన్ఏ కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. డీఎన్ఏ రక్తకణాలు ఎప్పుడూ విభజించాలి, లేదా గుణించాలి లేదా ఎప్పుడు చనిపోవాలనేది చెబుతుంది. ఇక్కడ డీఎన్ఏ సూచనలు ఆధారంగా శరీరం అసాధారణమైన రక్త కణాలను అబివృద్ధి చేస్తుంది. ఇవి సాధారణం కంటే వేగంగా పెరుగుతాయి,గుణించబడతాయి. అలాగే ఒక్కోసారి సాధారణం కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. దీంతో సాధారణ కణాలు గుమిగూడి ఎముక మజ్జలో స్థలాన్ని గుత్తాధిపత్యం చేసే అసాధారణ కణాల సముహంలోకి సాధారణ రక్త కణాలు పోతాయి. అందువల్ల ఎముక మజ్జ సాధారణ కణాలను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల జన్యుమార్పిడి మూడు రకాలు కేన్సర్లకు కారణమవుతుంది. సంకేతాలు, లక్షణాలుబ్లడ్ కేన్సర్‌ని బట్టి లక్షణాలు మారతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మూడు రకాల బ్లడ్ కేన్సర్‌లో కామన్‌గా కనిపించే సంకేతాలు ఏంటంటే..అలసట తక్కువ రోగనిరోధక శక్తి కారణంగా నిరంతర అధిక జ్వరంరాత్రి చెమటలతో తడిచిపోవడంఅసాధారణ రక్తస్రావం లేదా గాయాలుఊహించని విధంగా బరువు తగ్గడంరోగనిరోధక వ్యవస్థపై ప్రభావం కారణంగా తరచుగా ఇన్ఫెక్షన్లువాపు శోషరస కణుపులు లేదా విస్తరించిన కాలేయం లేదా ప్లీహముఎముక నొప్పిఈ లక్షణాలన్నీ కొన్ని వారాలకు మించి శరీరంలో ఉంటే తక్షణమే వైద్యుడుని సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: రియల్ లైఫ్ వెయిట్ లాస్ స్టోరీ: జస్ట్ 90 రోజుల్లోనే 14 కిలోలు..!) -
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూత (ఫొటోలు)
-
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూత
టీమిండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. గైక్వాడ్ కేన్సర్ చికిత్సకు సంబంధించి ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఆదుకోవాలని బీసీసీఐకి దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ మధ్యే విన్నవించిన సంగతి తెలిసిందే. స్పందించిన బీసీసీఐ గైక్వాడ్ చికిత్సకు తక్షణం సాయం కింద రూ.కోటి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈలోపే ఆయన కన్నుమూశారు. గైక్వాడ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. క్రికెట్‌కు గైక్వాడ్ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, తను మరణించారన్న వార్త బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రధాని సానూభూతి ప్రకటించారు. బీసీసీఐ కార్యదర్శి జైషాతో, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీతో పాటు పలువురు క్రికెటర్లు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. Shri Anshuman Gaekwad Ji will be remembered for his contribution to cricket. He was a gifted player and an outstanding coach. Pained by his demise. Condolences to his family and admirers. Om Shanti.— Narendra Modi (@narendramodi) July 31, 2024 My deepest condolences to the family and friends of Mr Aunshuman Gaekwad. Heartbreaking for the entire cricket fraternity. May his soul rest in peace🙏— Jay Shah (@JayShah) July 31, 2024 అన్షుమన్ గైక్వాడ్ 1974-87 మధ్య భారత జట్టు తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. మొత్తం 2,254 పరుగులు చేశారు. వాటిలో రెండు శతకాలు ఉన్నాయి. 1983లో జలంధర్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 201 పరుగులు చేశాడు. రెండుసార్లు టీమిండియాకు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. అంతకు ముందు నైంటీస్‌లో ఆయన జాతీయ టీమ్ సెలెక్టర్‌గా, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగానూ పనిచేశారు. -
టీమిండియా మాజీ కోచ్‌కు క్యాన్సర్.. ట్రీట్మెంట్కు నిధులు సమకూర్చిన బీసీసీఐ
టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ గతేడాది కాలంగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ లండన్‌లో చికిత్స పొందుతున్నాడు. ట్రీట్మెంట్ ఖరైంది కావడంతో అన్షుమన్ కుటుంబం ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అన్షుమన్ కుటుంబానికి చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. బీసీసీఐ అన్షుమన్ వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సాయం కింద కోటి రూపాయల నిధులు విడుదల చేసింది. అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతి లభించిన అనంతరం నిధులు విడుదల చేయాలని బీసీసీఐ కార్యదర్శి జై షా బోర్డును ఆదేశించారు. నిధుల విడుదల అనంతరం షా అన్షుమన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మున్ముందు వారికి ఎలాంటి అవసరం వచ్చినా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చాడు. అన్షుమన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. కాగా, 71 ఏళ్ల అన్షుమన్ గైక్వాడ్ 1974-87 మధ్యలో టీమిండియా తరఫున 40 టెస్ట్‌లు, 15 వన్డేలు ఆడాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన అన్షుమన్.. టెస్ట్‌ల్లో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1985 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ ఉంది. వన్డేల్లో అన్షుమన్ ఓ హాఫ్ సెంచరీ సాయంతో 269 పరుగులు చేశాడు. పార్ట్ టైమ్ బౌలర్ అయిన అన్షుమన్ టెస్ట్‌ల్లో 2 వికెట్లు, వన్డేల్లో ఓ వికెట్ పడగొట్టాడు.అన్షుమన్ 1997-2000 మధ్యలో రెండుసార్లు టీమిండియా హెడ్ కోచ్‌గా పని చేశాడు. తొలి దఫా (1997-1999) మూడేళ్లు కోచింగ్ పదవిలో ఉన్న అన్షుమన్.. రెండో దఫా (2000) ఏడాదికాలం భారత హెడ్ కోచ్‌గా సేవలందించాడు. ప్రస్తుతం క్యాన్సర్‌తో పోరాడుతూ, ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్షుమన్‌కు ఆర్దిక సాయం చేయాలని టీమిండియా మాజీలు బీసీసీఐని అభ్యర్దించారు. చాలా మంది నుంచి విన్నపాలను పరిగణలోకి తీసుకుని బీసీసీఐ కోటి రూపాయల నిధులు విడుదల చేసింది. -
బ్లడ్ క్యాన్సర్.. బాధగా ఉంది: బీసీసీఐకి కపిల్ దేవ్ విజ్ఞప్తి
టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి తీరు పట్ల అసహనం వ్యక్తం చేశాడు. పాతతరం ఆటగాళ్ల పట్ల కూడా కాస్త ఉదారంగా వ్యవహరిస్తే బాగుంటుందని హితవు పలికాడు. మాజీ క్రికెటర్ల బాగోగులు చూసేందుకు ట్రస్టు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు.అన్షుమన్ గైక్వాడ్‌కు బ్లడ్ క్యాన్సర్కాగా భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. గతేడాది కాలంగా లండన్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై కపిల్ దేవ్ స్పందిస్తూ.. అన్షుమన్ చికిత్స కోసం మొహిందర్ అమర్నాథ్, సునిల్ గావస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్‌సర్కార్, మదన్ లాల్, రవిశాస్త్రి, కీర్తి ఆజాద్ తదితరులు తమ వంతు సహాయంగా నిధులు సమకూరుస్తున్నారని తెలిపాడు.బీసీసీఐ సాయం చేయాలిబీసీసీఐ కూడా చొరవ తీసుకుని అన్షుమన్ గైక్వాడ్‌కు ఆర్థికంగా సహాయం అందించాలని కపిల్ దేవ్ విజ్ఞప్తి చేశాడు. ‘‘ఇది చాలా విచాకరం. నా మనసంతా బాధతో నిండిపోయింది.అన్షుతో కలిసి క్రికెట్ ఆడిన నేను.. అతడి ప్రస్తుత పరిస్థితిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. అతడిని ఆ స్థితిలో చూడలేకపోతున్నాను. ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదు.బోర్డు ఈ విషయంలో చొరవ తీసుకుంటుందని భావిస్తున్నా. మైదానంలో భయంకరమైన బంతులు విసిరే ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కోవడానికి అన్షు ఎంతో పట్టుదలగా నిలబడిన సందర్భాలు ఉన్నాయి.ఇప్పుడు మనమంతా అతడికి అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది. క్రికెట్ ప్రేమికులు అతడి కోసం ప్రార్థించండి’’ అని కపిల్ స్పోర్ట్స్‌స్టార్ ద్వారా విజ్ఞప్తి చేశాడు.అదే విధంగా.. క్రికెటర్లకు ఆపత్కాలంలో సహాయం అందించేందుకు బీసీసీఐ ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కపిల్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ‘‘ఇలాంటి సమయంలో క్రికెటర్లను ఆదుకునేందుకు దురదృష్టవశాత్తూ మనకంటూ ఒక స్థిరమైన వ్యవస్థ లేదు.ట్రస్టు ఏర్పాటు చేయాలిమా తరంలో ఆటగాకు అంతగా డబ్బు వచ్చేది కాదు. అప్పుడు బోర్డు దగ్గర కూడా అంతగా ధనం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి ఒక్క ఆటగాడు కావాల్సినంత సంపాదించుకోగలుగుతున్నాడు.సహాయక సిబ్బందికి కూడా వేతనాలు బాగానే ఉన్నాయి. మరి మా సంగతేంటి? సీనియర్ల కోసం ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలి. బీసీసీఐ తలచుకుంటే అదేమీ అంత పెద్ద విషయం కాదు. కావాలంటే మేమంతా మా పెన్షన్ల నుంచి కొంత విరాళంగా ట్రస్టుకు ఇస్తాం కూడా’’ అని కపిల్ దేవ్ అన్నాడు. మరి బీసీసీఐ కపిల్ విజ్ఞప్తిపై స్పందిస్తుందో లేదో చూడాలి!టీమిండియా హెడ్ కోచ్‌గానూ కాగా మహారాష్ట్రకు చెందిన 71 ఏళ్ల అన్షుమన్ గైక్వాడ్ 1975- 1987 మధ్య టీమిండియా తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. రెండుసార్లు టీమిండియా హెడ్ కోచ్‌గానూ వ్యవహరించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ టెస్టుల్లో 1985, వన్డేల్లో 269 పరుగులు సాధించాడు.చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
రికార్డులన్ని కోహ్లి ఖాతాలోకే.. ఎవరు టచ్ చేయలేరు
టీమిండియాలో దిగ్గజ బ్యాట్స్‌మన్ ఎవరు అనగానే ముందుగా గుర్తుచ్చే పేరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. బ్యాట్స్‌మన్‌గా లెక్కలేనన్ని రికార్డులు సచిన్ సొంతం. వన్డేల్లో 49 సెంచరీలు, టెస్టుల్లో 51 సెంచరీలు కలిపి వంద సెంచరీల మార్క్‌ను అందుకొని ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించాడు. 200 టెస్టులు.. 464 వన్డేలు.. ఇన్ని మ్యాచ్‌లు భవిష్యత్తులో మరే క్రికెటర్ ఆడకపోవచ్చు కూడా. ఈ దశలో టీమిండియాలోకి విరాట్ కోహ్లి అడుగుపెట్టాడు. ఆరంభం నుంచి అతని దూకుడైన ఆటతీరు చూసి సచిన్‌కు సరైన వారసుడు వచ్చాడు అన్నారు. అందుకు తగ్గట్లే కోహ్లి వన్డేల్లో మెషిన్గన్గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికే 43 సెంచరీలతో ఉన్న కోహ్లి.. మరో ఆరు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డును అందుకుంటాడు. కనీసం ఒక్క ఫార్మాట్లోనైనా సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం కోహ్లికి మాత్రమే ఉంది. అయితే గత కొంతకాలంగా మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పటికి పాత కోహ్లిని చూపించలేకపోతున్నాడు. కోహ్లి సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు కావొస్తుంది. దీంతో కోహ్లి సెంచరీ చేస్తే చూడాలని ఉందంటే పలువురు ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వందో టెస్టు ఆడిన విరాట్ కోహ్లిపై టీమిండియా మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ రికార్డులను అందుకునే దమ్ము కోహ్లికి మాత్రమే ఉంది.. కోహ్లిని ఎవరు టచ్ చేయలేరు అంటూ పేర్కొన్నాడు. '' కోహ్లి వందో టెస్టు ఆడడం మైలురాయి అని చెప్పొచ్చు. సరైన ఫిట్నెస్ లేని ఈ కాలంలో కోహ్లి వంద టెస్టుల మార్క్‌ను అందుకోవడం గొప్ప విషయం. ఈ వంద టెస్టులు అతనికి మంచి అనుభవం నేర్పాయని అనుకుంటున్నా. మరో వంద టెస్టులు ఆడే సామర్థ్యం కోహ్లిలో ఉంది. అతని ఫిట్నెస్ ఇలాగే ఉంటే టచ్ చేయడం కూడా కష్టం. 33 ఏళ్ల కోహ్లి వన్డేల్లో 43 సెంచరీలు సాధించాడు. ఇంకో ఆరు సెంచరీలు బాదితే వన్డేల పరంగా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లి కొత్త చరిత్ర సృష్టిస్తాడు. మరో మూడు నాలుగేళ్లు ఆడే సత్తా ఉన్న కోహ్లి.. తన ఫిట్నెస్ను కాపాడుకుంటే మాత్రం మరో పదేళ్లు అతన్ని గ్రౌండ్లో చూడొచ్చు. ఒకవేళ అదే నిజమైతే ఎన్ని రికార్డులు బద్దలవుతాయనేది చెప్పడం కష్టమే'' అని తెలిపాడు. చదవండి: Sachin Tendulkar: మన్కడింగ్‌ను రనౌట్‌గా మార్చడం సంతోషం.. కానీ విరాట్ కోహ్లికి పొంచి ఉన్న పెను ప్రమాదం.. మరో 43 పరుగులు చేయకపోతే..? -
టి20 వరల్డ్ కప్ వాయిదా పడితేనే...
న్యూఢిల్లీ: ఈ ఏడాది టి20 ప్రపంచకప్ జరిగే సూచనలు కనిపించడం లేదని, భారత్‌లో పరిస్థితులు సర్దుకుంటే దాని స్థానంలో ఐపీఎల్ నిర్వహించే అవకాశముందని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు, భారత జట్టు మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా నెలకొన్న అనిశ్చితిని ఎదుర్కొనేందుకు క్రికెటర్లు మానసిక స్థయిర్యాన్ని కూడగట్టుకోవాలని ఆయన సూచించారు. ‘ఈ ఏడాది టి20 వరల్డ్ కప్ జరుగనుంది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ గురించి ఆలోచించకూడదుగానీ, భారత్‌లో పరిస్థితి అనుకూలిస్తే లీగ్ నిర్వహణకు ప్రపంచకప్ జరిగే అక్టోబర్–నవంబర్ నెలలే అనుకూలమైన సమయం. ఒకవేళ వరల్డ్ కప్ రద్దు లేదా వాయిదా పడితేనే లీగ్ జరిగే అవకాశముంది. అది కూడా భారత్‌లో వాతావరణం అనుకూలిస్తేనే. కరోనా తగ్గాక క్రికెట్ మునుపటిలా ఉండబోదు. ప్రేక్షకులు లేకుండానే ఆడేందుకు క్రికెటర్లు అలవాటు పడాలి. మైదానంలో ముందులా సత్తా చాటాలంటే ఆటగాళ్లు మానసిక స్థయిర్యాన్ని పెంపొందించుకోవాలి’ అని అన్షుమన్ పేర్కొన్నారు. -
‘సచిన్ ఏడుస్తూనే ఉన్నాడు’
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే భావోద్వేగాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది గాయంతో బాధపడుతూనే అద్భుత బ్యాటింగ్‌తో విజయానికి చేరువగా తీసుకొచ్చి వెనుదిరిగితే, ఆపై జట్టు ఓటమిపాలైతే ఆ బాధ ఎలా ఉంటుంది... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 1999లో చెన్నైలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో ఇలాంటి వేదనే అనుభవించాడు. రెండో ఇన్నింగ్స్‌లో విజయం కోసం 271 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ బరిలోకి దిగింది. తీవ్ర వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నా... సచిన్ 136 పరుగులతో చెలరేగాడు. అయితే నయన్ మోంగియా (52) మినహా సహచరులంతా విఫలం కావడంతో సచిన్ చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. అయితే 254 పరుగుల వద్ద సచిన్ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. మరో 4 పరుగులకే మిగిలిన 3 వికెట్లు కోల్పోయిన భారత్ చివరకు 12 పరుగులతో ఓడింది. దీనిని గుర్తు చేసుకుంటూ నాటి భారత కోచ్ అన్షుమన్ గైక్వాడ్... ‘సక్లాయిన్ బౌలింగ్‌లో అవుటై పెవిలియన్ తిరిగి వచ్చాక సచిన్ నిరాశ పడ్డాడు. భారత జట్టు ఓడిపోయిందని తెలిసిన తర్వాత అతను బయటకే రాలేదు. ఒక టవల్‌ను అడ్డుగా పెట్టుకొని అతను ఏడుస్తూనే ఉన్నాడు. సచినే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అయితే అతను దానిని తీసుకునేందుకు వెళ్లలేదు. వేదికపైనున్న రాజ్‌సింగ్ దుంగార్పూర్ సచిన్ ఎక్కడ అంటూ అడిగినా అతని జాడే లేదు. బహుమతి ప్రదాన కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా టెండూల్కర్ తన సీటులోనే స్తబ్దుగా ఉండిపోయాడు. చివరకు నేను సముదాయించాల్సి వచ్చింది. అతను ఇలా భావోద్వేగాలు ప్రదర్శించడం ఎప్పుడూ చూడలేదు’ అని నాటి ఘటనను వివరించారు. ప్రేక్షకుల మధ్య ఆడితే ఆ మజాయే వేరు ఏ ఆటలోనైనా ప్రేక్షకులు కూడా భాగమే. మీకు అనుకూలంగా అయినా వ్యతిరేకంగా అయినా వారి ప్రోత్సాహం, కేకలు క్రీడలో చాలా అవసరం. మైదానంలో ఖాళీ స్టేడియాల మధ్య ఆడటం క్రీడాకారులను తీవ్రంగా నిరాశపరుస్తుంది. ప్రేక్షకులకు ఆటగాళ్లు స్పందించే ఘటనలు కోకొల్లలు. నేను ఏదైనా మంచి షాట్ ఆడినప్పుడు ప్రేక్షకులు అభినందిస్తే మరింత ఊపు వస్తుంది. బౌలర్ కూడా అద్భుతమైన స్పెల్ వేసినప్పుడు అభిమానులు అభినందిస్తుంటే బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెరిగిపోతుంది. కరోనా తర్వాత ఆటలో సహజంగానే మార్పులు వస్తాయి. సహచరుల మధ్య కౌగిలింతలు, అభినందనలు కొంత కాలం కనిపించకపోవచ్చు. ఇక బంతి మెరుపు పెంచేందుకు ఉమ్మిని వాడాలంటే భయపడతారు. ఒకటి మాత్రం స్పష్టం. క్రికెట్ జరగాలని నేనూ కోరుకుంటాను. అయితే అంతా బాగుందని, ఆరోగ్యాలకు ప్రమాదం లేదని భావించినప్పుడే మళ్లీ ఆట మొదలు పెట్టాలి. ఇలాంటి విపత్కర పరిస్థితిని దాటిన తర్వాతే ఐపీఎల్, టి20 వరల్డ్‌కప్ గురించి ఆలోచించాలి. ప్రస్తుతం వీటిపై అసలు చర్చించడమే నా దృష్టిలో అనవసరం. –సచిన్ టెండూల్కర్ వేడుకలు లేవు... కోవిడ్–19 కారణంగా దేశంలో నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకోరాదని సచిన్ నిర్ణయించుకున్నాడు. ‘సంబరాలకు ఇది సరైన సమయం కాదని సచిన్ భావిస్తున్నాడు. కరోనాపై పోరులో ముందున్న వైద్యులు, నర్సులు, పోలీసులు, ఇతర సిబ్బందికి మనం అండగా నిలవడం మనందరికీ ముఖ్యమని అతను చెప్పాడు. సహాయనిధికి ఇచ్చిన డబ్బు మాత్రమే కాకుండా ఇతర రూపాల్లో కూడా సహాయక కార్యక్రమాల్లో సచిన్ పాలపంచుకుంటున్నాడు’ అని అతను సన్నిహితుడొకరు వెల్లడించారు. మీకు తెలుసా... సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున తన 24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 989 మంది క్రికెటర్లతో కలిసి ఆడాడు. ఇందులో 141 మంది టీమిండియా సహచరులు కాగా... 848 మంది ప్రత్యర్థి జట్లకు చెందినవారు. -
కోహ్లి మాటలు పట్టించుకోం : గైక్వాడ్
న్యూఢిల్లీ : టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగాలని కోరుకుంటున్నానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు తమను ప్రభావితం చేయవని క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) సభ్యుడు అన్షుమన్ గైక్వాడ్ తెలిపాడు. ఓపెన్ మైండ్‌తోనే ఎంపిక ప్రక్రియ చేపడుతామని స్పష్టం చేశాడు. తమకు బీసీసీఐ నిర్ధేశించిన మార్గదర్శకాలే కీలకమన్నాడు. ‘అతను కెప్టెన్ ఏమైనా మాట్లడగలడు. అవి మమ్మల్ని ఏ మాత్రం ప్రభావితం చేయవు. అతని అభిప్రాయాన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుంది. తప్పా మేం కాదు. ఎంపిక ప్రక్రియ అనేది బీసీసీఐపైనే ఆధారపడి ఉంటుంది. వారిచ్చే గైడ్‌లైన్స్ మేరకే మా ఎంపిక ఉంటుంది. కోహ్లి అతినికేం కావాలో చెప్పాడు. మహిళా జట్టు కోచ్ ఎంపిక చేసినప్పుడు మేం ఎవ్వరిని సంప్రదించలేదు. మా విధానంలోనే ఎంపికచేశాం. ఓపెన్ మైండ్‌తో ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. దేశ, విదేశాల నుంచి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. నేను, కపిల్ ఇద్దరం కోచ్‌గా పనిచేసినవాళ్లమే. కావునా జట్టుకు ప్రయోజనకరమైనవి ఏంటో మాకు తెలుసు. ప్రస్తుత కోచ్ పర్యవేక్షణలో జట్టు బాగానే రాణించింది. కానీ ఇంకా బాగా ఆడాల్సింది. కోచ్ ఎంపికప్రక్రియలో చాలా అంశాలు ఉన్నప్పటికీ.. ఆటగాళ్లను సమన్వయపరచడం, ప్రణాళికలు రచించంచడం, సాంకేతికంగా అనుభవం కలిగి ఉండటం. ఈ మూడు లక్షణాలు మాత్రం కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మూడు ఉన్నవారే కోచ్‌గా రాణిస్తారు.’ అని గైక్వాడ్ పేర్కొన్నారు. త్వరలో టీమిండియా కోచ్ ఎంపిక ప్రక్రియ మొదలుకానున్న తరుణంలో గైక్వాడ్ తరచు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. -
‘టీమిండియా కోచ్‌కు అవే ప్రధానం’
న్యూఢిల్లీ: ప్రధాన కోచ్ రవిశాస్త్రి హయాంలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించిందని ఇటీవల వ్యాఖ్యానించిన క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) సభ్యుడు అన్షుమన్ గైక్వాడ్.. తాజాగా ఒక వ్యక్తిని కోచ్‌గా నియమించే క్రమంలో ఏ లక్షణాలు ప్రధానంగా పరిశీలిస్తామనే దానిపై స్పష్టత ఇచ్చారు. ప్రధానంగా టీమిండియా కోచ్‌గా క్రికెటర్లను సమన్వయ పరుస్తూ జట్టును ముందుండి ఎవరైతే నడుపుతారని భావిస్తామో వారికే అధిక ప్రాముఖ్యత ఉంటుందన్నారు. దీంతో పాటు కచ్చితమైన ప్రణాళికలు కూడా కోచ్‌గా నియమించే వ్యక్తికి అత్యంత అవసరమని గైక్వాడ్ అన్నారు. ఈ రెండు అంశాలు టీమిండియా కోచ్‌కు అత్యంత అవసరమని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ మంచి ప్రణాళికతో పాటు ఆటగాళ్లను సమన్వయంతో ముందుకు నడిపించే వ్యక్తే టీమిండియా కోచ్‌గా అవసరం. ఈ రెండు లక్షణాలు కోచ్‌ను ఎంపిక చేసే క్రమంలో ముఖ్యంగా పరిశీలిస్తాం. దాంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఎలాగు ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడే ఆ వ్యక్తి సరైన ప్రణాళికతో ఉన్నాడా..లేడా అనేది అర్థమవుతుంది’ అని గైక్వాడ్ తెలిపారు. త్వరలో టీమిండియా కోచ్ ఎంపిక ప్రక్రియ మొదలుకానున్న తరుణంలో గైక్వాడ్ తరచు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. -
కపిల్ త్రయం చేతిలో... హెడ్ కోచ్ ఎంపిక బాధ్యత!
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ నియామక ప్రక్రియను దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన తాత్కాలిక క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)కి అప్పగించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు నియమిత క్రికెట్ పాలకుల మండలి (సీవోఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారికంగా ప్రకటనేదీ రాకున్నా ఆ దిశగా ఆలోచనలు సాగుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మిగతా కోచింగ్, సహాయక సిబ్బంది నియామకం మాత్రం బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి పర్యవేక్షణలో సాగుతుంది. గతంలో సీఏసీ సభ్యులుగా నియమితులైన మేటి క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో వివరణ ఇచ్చుకోవాల్సి రావడంతో... వారి స్థానంలో కపిల్ త్రయాన్ని తాత్కాలిక (అడహక్) ప్రాతిపదికపై నియమించారు. ఈ బృందమే డిసెంబరులో మహిళా జాతీయ జట్టు కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ను ఎంపిక చేసింది. సీవోఏ తీరుపై బీసీసీఐ వర్గాల మండిపాటు ప్రత్యేకించి అక్టోబరు 22న వార్షిక సర్వసభ్య సమావేశం ఉండగా... టీమిండియా కోచింగ్ సిబ్బంది నియామక ప్రకటన విషయంలో సీవోఏకు అంత తొందరేమిటని బీసీసీఐ వర్గాలు మండిపడుతున్నాయి. ఓవైపు ప్రపంచ కప్‌లో భారత్ ప్రదర్శనపై హెడ్ కోచ్, కెప్టెన్‌తో సమీక్ష సమావేశం నిర్వహణ కోరుతూనే, మరోవైపు కోచింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరడాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తప్పుబట్టారు. ‘ఈ పరిణామాలు నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం. సీవోఏ ఇప్పటికే బోర్డు ఎన్నికలకు తేదీలు వెల్లడించింది. ఇంతలోనే ఇదేమిటి? తమ ఉద్దేశంలో ఉన్న వ్యక్తుల్లో ఎవరినైనా వారు నియమించాలని, ప్రపంచ కప్ సాధించలేకపోయిన విషయాన్ని మరుగునపర్చాలని అనుకుంటున్నారా’ అని ఆ అధికారి ప్రశ్నించారు. ప్రస్తుత కోచింగ్ సిబ్బంది అందరూ తమతమ నివేదికలు సమర్పించాల్సి ఉన్న నేపథ్యాన్ని ఆయన ప్రస్తావించారు. విజయ్ శంకర్ గాయం తీవ్రత సహా, నాలుగో స్థానంపై తీసుకున్న నిర్ణయాలకు బ్యాటింగ్ కోచ్ కీలకమైన నివేదిక ఇవ్వాల్సి ఉండటాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. -
పంత్, శంకర్ కాదు.. మరెవరు?
మాంచెస్టర్: టీమిండియాలో నాలుగు స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న చర్చ గత కొంత కాలంగా జరుగుతోంది. ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన కష్టపడి నెగ్గడంతో నాలుగో స్థానంపై చర్చ మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. రిషబ్ పంత్ లేదా విజయ్ శంకర్ సరిపోతారా అని మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్‌ను అడిగితే ఊహించని విధంగా ఆయన మరోపేరు చెప్పారు. కేదార్ జాదవ్ కరెక్టుగా సరిపోతాడని సమాధానమిచ్చారు. ‘జాదవ్ బాగా ఆడగలడు. స్టైక్ రొటేట్ చేస్తూ పరుగులు పిండుకోవడంలో సిద్ధహస్తుడు. తనదైన షాట్లతోనూ అలరిస్తాడు. నా అభిప్రాయం ప్రకారం అతడిని నాలుగో స్థానంలో ఆడించాల’ని గైక్వాడ్ పేర్కొన్నారు. రెండో ఆప్షన్‌గా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వైపు మొగ్గు చూపారు. ‘దినేశ్ కార్తీక్ అనుభవజ్ఞుడు. ఫినిషనర్గా నిరూపించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లో కుదురుకుని ఆడగల సామర్థ్యం అతడికి ఉంద’ని తెలిపారు. యువ ఆటగాడు రిషబ్ పంత్ బ్యాటింగ్ బాగున్నా నాలుగో స్థానంలో ఎలా ఆడతాడో తాను చెప్పలేనని అన్నారు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్ల షాట్ సెలెక్షన్‌ను గైక్వాడ్ తప్పుబట్టారు. కేఎల్ రాహుల్, విజయ్ శంకర్ అవుటైన తీరును విమర్శించారు. (చదవండి: భారత్ అజేయభేరి) -
కుంబ్లేతో వివాదం.. తప్పంతా కోహ్లిదే!
న్యూఢిల్లీ: కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే వివాదంపై మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ స్పందించాడు. టీమిండియా కోచ్‌గా కుంబ్లేనే కొనసాగితే బాగుంటుందని భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ అభిప్రాయపడ్డాడు. చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓటమి అనంతరం ఆటగాళ్లపై కోచ్‌గా ఉన్న కుంబ్లే ఆగ్రహం వ్యక్తం చేయడంలో అసలు తప్పేలేదన్నాడు. ఫైనల్లో వారి ఆటతీరు చూసి ఏ కోచ్ అయినా అలాగే స్పందిస్తారంటూ కుంబ్లేకే తన మద్ధతు తెలిపాడు అన్షుమన్ గైక్వాడ్. 1990 దశకం చివర్లో భారత జట్టుకు కోచ్‌గా పనిచేసిన గైక్వాడ్ ఈ వివాదంపై మరిన్ని అంశాలు ప్రస్తావించాడు. 'కుంబ్లే నిబద్ధత, అంకితభావం అందరికీ తెలుసు. కుంబ్లే, కోహ్లిల మధ్య వివాదమేంటో అంతగా తెలియదు. కానీ మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలిస్తే కోహ్లి దురుసు ప్రవర్తనతో కుంబ్లే మనసు నొచ్చుకుంది. అందుకే తెగే వరకు లాగొద్దని భావించి కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేశాడనుకుంటున్నా. బీసీసీఐతో కుంబ్లేకు ఉన్న కాంట్రాక్టు ఎలాంటిదో స్పష్టతలేదు. ఓ టోర్నీ తర్వాత ఆటగాళ్ల ప్రదర్శన, ప్రవర్తనపై నిర్ణయం తీసుకునే అధికారం కోచ్‌గా కుంబ్లేకు ఉందని నమ్ముతున్నాను. కుంబ్లే అప్పటివకప్పుడే స్పందించడంతో ఆటగాళ్లు రాద్ధాంతం చేశారు. కోచ్ తన మనసులో మాటను ఆటగాళ్లకు చెప్పడంపై బీసీసీఐ పరిమితులు విధిస్తుందని తాను భావించడం లేదని' గైక్వాడ్ వివరించాడు. మాజీ కోచ్, మేనేజర్ అజిత్ వాడేకర్, మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం కోహ్లీ తీరును తప్పుపట్టిన విషయం తెలిసిందే.