విజయ్ శంకర్
సాక్షి, స్పోర్ట్స్ : సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై బాధపడటం లేదని టీమిండియా యువ ఆలౌరౌండర్ విజయ్ శంకర్ అభిప్రాయపడ్డారు. నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో తన జిడ్డు బ్యాటింగ్‌తో శంకర్ భారత్‌ను ఓటమి అంచులకు చేర్చగా దినేశ్ కార్తీక్ చివరి బంతిని సిక్సుబాది గట్టెక్కించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్ బ్యాటింగ్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విమర్శలపై శంకర్ స్పందిస్తూ.. ఇలాంటి కామెంట్స్‌కు తాను చింతించడం లేదని, కానీ తన తల్లి తండ్రులు, స్నేహితుల నుంచి వస్తున్న ఓదార్పు మెసెజ్‌లు చాలా ఇబ్బంది పెడుతున్నాయన్నాడు. టోర్నీమొత్తం బంతితో రాణించానని కానీ చివరి రోజు ఓ చెడు దినంగా మిగిలిపోయిందన్నాడు. అది మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నానని, కానీ సానుభూతి మెసేజ్‌లు మర్చిపోలేకుండా చేస్తున్నాయని, దీంతో చాలా కష్టంగా ఉందని తెలిపాడు. ఇక భారత్‌కు ఆడుతున్నప్పుడు అభిమానుల నుంచి ఇలాంటి విమర్శలు రావడం సహజమేనని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విన్నర్‌గా హీరో అయ్యె ఓ మంచి అవకాన్ని కోల్పోయానన్నాడు.
జట్టులోని ప్రతి ఒక్కరు తనకు మద్దతుగా నిలిచారని, కెప్టెన్ రోహిత్, కోచ్ రవిశాస్త్రి ఇలాంటివి సహజమేనని చెప్పారని, దీంతో తన మనసు కొంత కదుట పడిందని ఈ చెన్నై క్రికెటర్ పేర్కొన్నాడు. అంతకు ముందు తాను ఆడిన టోర్నీల్లో బంతులను డాట్ చేయలేదని, ముష్పికర్ ఆ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడన్నాడు. స్ట్రైక్ రోటేడ్ చేయకుండా షాట్‌లకు ప్రయత్నించడం తప్పేనని ఒప్పుకున్నాడు. భారత జట్టులో చోటుదక్కే అవకాశంపై ఎలాంటి బెంగలేదని, మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ తనకు ఊరట కల్పించే అంశమని తన సత్తా నిరూపించుకుంటానని శంకర్ వ్యాఖ్యానించాడు. ఇక శంకర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment