Nidahas Trophy
-
తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించనున్న దినేష్ కార్తీక్...!
భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య 2018 మార్చిలో జరిగిన నిదాహస్ ట్రోఫీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఫైనల్ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ ఆడిన తీరు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంది. 8 బంతుల్లో 29 పరుగులతో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. చివరి బంతికి కార్తీక్ కొట్టిన ఫ్లాట్ సిక్స్ ఇప్పటికీ మన కళ్లలో మెదులుతూనే ఉంటుంది. దినేష్ కార్తీక్ చివరి సిక్స్ ఇప్పడు ఎన్ఎఫ్టీ రూపంలో...! దినేష్ కార్తీక్ కొట్టిన చివరి సిక్స్ మూమెంట్ అంతమనేది లేకుండా నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) రూపంలో త్వరలోనే లభించనుంది. భారత్‌ను గెలిపించాక దినేష్ కార్తీక్ సెలబ్రెట్ చేసుకున్న విన్నింగ్ మూమెంట్‌ను యానిమేషన్ రూపంలో ఎన్ఎఫ్టీగా రానుంది. విన్నింగ్ పరుగులను సాధించినప్పుడు కార్తీక్‌లోని ఆలోచనలు, భావోద్వేగాలను ఈ ఎన్ఎఫ్టీ యానిమేషన్ రూపంలో పొందుపర్చనున్నారు. చదవండి: పబ్లిసిటీ కోసం రోజు రూ. 2.6 లక్షల ఖర్చు..! ఈ సందర్భంగా దినేష్ కార్తీక్ మాట్లాడుతూ...‘నిదాహస్ ట్రోఫి ఫైనాల్ నా జీవితంలో అత్యుత్తమ క్షణాల్లో అది ఒకటి. ఆ క్షణాలు ఇప్పుడు గ్రాఫికల్ ఎన్ఎఫ్టీ రూపంలో రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంద’ని అన్నారు. ఈ ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్‌ను కార్తీక్ సమీప బంధువు, అగ్రశ్రేణి స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ సహకారంతో చేపట్టారు. దినేష్ కార్తీక్ ఎన్ఎఫ్టీ అక్టోబర్ 12 నుంచి వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్ఎఫ్టీ అంటే..! బ్యాంకులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా డిజిటల్ మార్కెట్లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా కొనసాగుతోంది. బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు డబ్బుకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు. చదవండి: ఒక్కసారి ఛార్జ్‌తో 1360 కిలోమీటర్ల ప్రయాణం..! -
ఆ బంతిని సిక్స్‌గా మలిచినందుకు థాంక్స్: రోహిత్
టీమిండియా క్రికెటర్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తిక్ నేడు 35వ ఏట అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా జట్టు సహచరులు, అభిమానుల నుంచి అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, క్రికెటర్లు అశ్విన్, హర్భజన్ సింగ్ ట్విటర్ వేదికగా డీకేను విష్ చేశారు. ఇక హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మాత్రం..‘‘హ్యాపీ బర్త్ డే డీకే బాబా. ఆ చివరి బంతిని సిక్స్‌గా మలిచినందుకు ధన్యవాదాలు’’అంటూ నిదహాస్ ట్రోఫీ విజయంలో దినేశ్ కార్తిక్ హీరోగా నిలిచిన విషయాన్ని మరోసారి గుర్తుచేశాడు. ఐపీఎల్లో భాగంగా తాను ముంబై ఇండియన్స్ జెర్సీ, దినేశ్ కేకేఆర్ జెర్సీ ధరించి ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ఇన్‌స్టాలో షేర్ చేశాడు.(‘ఖేల్‌రత్న’కు రోహిత్ శర్మ పేరు సిఫారసు) కాగా 2018లో బంగ్లాదేశ్‌తో జరిగిన నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో డీకే అద్బుత ప్రదర్శనతో టీమిండియాను విజయతీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. ట్రోఫీ కైవసం చేసుకునేందుకు భారత్‌కు 3 ఓవర్లలో 35 పరుగులు అవసరమైన క్లిష్ట పరిస్థితుల్లో.. 8 బంతుల్లో 29 పరుగులు చేసి.. ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్‌లో చివరి బంతిని సిక్స్‌గా మలిచి ప్రేక్షకులకు గొప్ప అనుభూతి అందించాడు. ఇక నిదహాస్ ట్రోఫీ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో కోహ్లి జట్టుకు దూరం కాగా.. రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అలా తన కెప్టెన్సీలో టీమిండియాకు డీకే అందించిన చిరస్మరణీయ విజయాన్ని రోహిత్ తన పుట్టినరోజు సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. (నేను స్లెడ్జ్ చేస్తా.. నువ్వు కేవలం నవ్వు అంతే!) View this post on Instagram Happy birthday Dk baba. Thanks for that last ball six 👌@dk00019 A post shared by Rohit Sharma (@rohitsharma45) on May 31, 2020 at 11:06pm PDT -
‘సిక్సర్ కొట్టకుంటే.. నాగిని డ్యాన్స్ చూడలేక చచ్చేవాళ్లం’
-
‘సిక్సర్ కొట్టకుంటే.. చూడలేక చచ్చేవాళ్లం’
హైదరాబాద్ : సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున క్రికెటర్ విజయ్ శంకర్‌ను తిట్టకుండా.. దినేశ్ కార్తీక్‌ను పొగడుకుండా ఉండని అభిమాని ఉండకపోవచ్చు. ఎందుకంటే సులువుగా గెలిచే మ్యాచ్‌ను ఓటమి అంచుకు శంకర్ తీసుకరాగ.. ఇక ఓటమి ఫిక్స్ అనుకున్న తరుణంలో మ్యాచ్‌ను గెలిపించి అభిమానుల ముఖంలో చిరునవ్వు కలిగిలే చేశాడు దినేశ్ కార్తీక్. నిదహాస్ ట్రోఫి ఫైనల్ మ్యాచ్‌లో చివరి బంతికి సిక్సర్ కొట్టి బంగ్లాదేశ్ నుంచి మ్యాచ్‌ను, టీమిండియా పరువును దినేశ్ కార్తీక్ కాపాడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆ మ్యాచ్‌కు సంబంధించిన విషయాలను నెమరు వేసుకుంటున్నారు. ఆ మ్యాచ్.. ఇంకా నా కళ్ల ముందు కదలాడుతూనే’ ఉందంటూ ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ‘కార్తీక్ భయ్యా సిక్సర్ కొట్టకుంటే.. నాగిని డ్యాన్స్ చూడలేక చచ్చేవాళ్లం’అంటూ మరో అభిమాని కామెంట్ చేశాడు. ఇక ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బంగ్లా బ్యాట్స్‌మన్ షబ్బీర్ రహ్మాన్(77) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఏదీ కలసి రాలేదు. రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో రాణించగా.. ధవన్, రైనాలు విఫలమయ్యారు. ఈ తరుణంలో 14వ ఓవర్లో 98/4తో ఉన్న దశలో క్రీజ్‌లోకి వచ్చిన శంకర్.. అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 3 ఓవరల్లో 35 పరుగులు చేయాల్సిన దశలో ముస్తాఫిజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో సింగిల్ కూడా తీయలేకపోయాడు. ఈ దశలో దినేశ్ కార్తీక్ 8 బంతుల్లో 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. ఆ మ్యాచ్‌లో శంకర్ 19 బంతుల్లో 17 రన్స్ మాత్రమే చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. -
నిదాహస్ ట్రోఫీయే నాకు బుద్ధి చెప్పింది : శంకర్
నాగ్‌పూర్ : చివరి ఓవర్లో అదరగొట్టి ఆస్ట్రేలియా విజయానికి అడ్డుకట్టవేసిన టీమిండియా యువ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఈ తరహా ప్రదర్శనకు కారణం గతేడాది జరిగిన నిదాహస్ ట్రోఫీ ట్రోఫియేనని అభిప్రాయపడ్డాడు. ఆ టోర్నీ వల్లే తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. మంగళవారం నాగ్‌పూర్ వేదికగా ఆతిథ్య ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 8 పరుగుల తేడాతో గెలుపొంది.. 500వ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో, బంతితో అద్భుత ప్రదర్శన కనబర్చిన విజయ్ శంకర్.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ప్రపంచకప్ బెర్త్ గురించి ఆలోచించడం లేదని, కేవలం తన ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టానన్నాడు. ‘నేను ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను.. ప్రపంచకప్ సెలక్షన్ గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే దానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం నాకు ప్రతి మ్యాచ్ ముఖ్యమే. నేను కేవలం జట్టు గెలుపుకు తన నుంచి ఇవ్వాల్సిన ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టాను. నిజం చెప్పాలంటే.. నిదాహస్ ట్రోఫీ నాకు ఎన్నో విషయాలను నేర్పించింది. ఆ టోర్నీ తర్వాతే ఒత్తిడిలో ఎలా ఉండాలో తెలిసింది. అన్నివేళలో ప్రశాంతంగా ఉండాలనే తత్వం బోధపడింది. తాజా మ్యాచ్‌లో ఏ సమయంలోనైనా బౌలింగ్ చేయాడనికి మానసికంగా సిద్ధమయ్యాను. 44 ఓవర్లనంతరం ఎప్పుడైనా బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని, అది చివరి ఓవరైనా చాలెంజ్‌కు సిద్ధంగా ఉండాలని నాకు నేను చెప్పుకున్నాను. చివరి ఓవర్లో బుమ్రా మెళుకువలు కలిసొచ్చాయి. క్లబ్ క్రికెట్లో తప్పా నేనెప్పుడూ చివరి ఓవర్ బౌలింగ్ చేయలేదు. చివరి ఓవర్లో రెండు వికెట్లు దక్కడంతో పొంగిపోలేదు. కేవలం ఆ మూమెంట్‌ను ఆస్వాదించాను. రనౌట్ కావడం క్రికెట్లో సర్వసాధారణం. ఆ సమయంలో మళ్లీ క్రీజులోకి వేళ్లే అవకాశం లేదు. దీనిని ఏదో నేను దురదృష్టం అనుకోను.’ అని ఈ తమిళనాడు క్రికెటర్ చెప్పుకొచ్చాడు. చదవండి : శంకరన్నా.. సూపరన్నా! -
ఇప్పటికీ ఆ మ్యాచ్ గుర్తొస్తే బాధగా ఉంది
-
‘ఆరోజు నేను బాగా బౌలింగ్ చేసుంటే..’
ఢాకా: నిదహాస్ ట్రోఫీలో భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఓటమిని బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. చివరి వరకూ గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ చివరి బాల్కి తలకిందులవ్వడాన్ని బంగ్లా ప్లేయర్లు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే మ్యాచ్ ఓటమిపై బంగ్లాదేశ్ పేసర్ రూబెల్ హుస్సేన్ పశ్చాతాపం వ్యక్తం చేశాడు. తాను ధారాళంగా పరుగులివ్వడంతోనే తమ జట్టు ఓటమి పాలైందని, ఈ విషయంలో అభిమానులు క్షమించాలని విజ్ఞప్తి చేశాడు. తమ జట్టు ఓటమికి తానే కారణమవుతానని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నానని, ఈ ఒక్కసారికి వదిలేయాలని అభిమానులకు కోరాడు. తాజాగా చివరి ఓవర్ వేసిన సౌమ్య సర్కార్ స్పందించాడు. మ్యాచ్ ఓటమికి తాను కూడా కారణమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నేను ఇంతకుముందు కూడా బౌలింగ్ చేసాను.. కానీ ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఎప్పుడూ బౌలింగ్ చేయలేదు. ఈ మ్యాచ్‌తో ఎలాంటి పరిస్థితులోనైనా కట్టుదిట్టంగా బాల్స్ వేయగలననే నమ్మకం వచ్చింది. గతంలో మా జట్టు టీ20 మ్యాచ్‌ల్లో భారీ తేడాతో ఓటమి చవిచూసేది. కానీ ఇపుడు 200 పరుగులు లక్ష్మాన్ని కూడా చేయగలుగుతున్నాం. అదే విధంగా భారీ లక్ష్యాలను కూడా సునాయాసంగా చేధించగలుగుతున్నాము. కానీ మొన్నటి మ్యాచ్ ఓటమి మరచిపోలేకపోతున్నాను. ఇప్పటికీ ఆ మ్యాచ్ గుర్తొస్తే బాధగా ఉంది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి అవసరమైన 12 పరుగుల్ని సమర్పించుకోవడం నా కెరీర్లో చేదు జ్ఞాపకం. ప్రధానంగా చివరి బంతికి సిక్సర్ ఇచ్చి మా పరాజయంలో భాగమయ్యా. ఆ రోజు నేను బాగా బౌలింగ్ చేసి ఉంటే 16 కోట్ల మంది పెదవులపై చిరునవ్వును చూసేవాళ్లం’ అని సౌమ్య తెలిపాడు. బంగ్లాదేశ్‌తో గత ఆదివారం ఉత్కంఠభరింతగా జరిగిన నిదహస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సౌమ్య వేసిని ఆఖరి బంతిని దినేష్ కార్తిక్ సిక్స్‌గా మార్చడంతో భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. -
‘అతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కలం'
కోల్‌కతా: నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసి భారత జట్టుకు కప్ అందించిన దినేశ్ కార్తీక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా బౌలర్ వినయ్‌కుమార్, కార్తీక్ గొప్ప ఆటగాడని, అంతకు మించి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కొనియాడాడు. వీరిద్దరు ఐపీఎల్లో కోల్‌కతా తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గౌతం గంభీర్ కోల్‌కతా జట్టును విడిచి ఢిల్లీకి వెళ్లడంతో టీం మేనేజ్ మెంట్ దినేశ్ కార్తీక్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. దీనిపై స్పందించిన వినయ్‌కుమార్.. తమిళనాడు, ఇండియా రెడ్ జట్లకు కార్తీక్ నాయకత్వం వహించాడని, ఆ అనుభవంతో కోల్‌కతా జట్టును ఐపీఎల్లో విజయతీరాలకు తీసుకెళ్తాడని ఈ కర్ణాటక కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతమున్న జట్టుపై సంతృప్తి వ్యక్తం చేసిన వినయ్.. సీనియర్లు, జూనియర్లతో సమతుల్యంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆంపైర్ సమీక్షా పద్దతిని ప్రవేశ పెట్టడం ద్వారా ఆటగాళ్లకు ఎంతో మేలు కలుగుతుందని వినయ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రంజీలో కూడా డీఆర్ఎస్ ప్రవేశపెడితే బాగుంటుందని వినయ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ విమర్శలపై బాధపడటంలేదు: శంకర్
సాక్షి, స్పోర్ట్స్ : సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై బాధపడటం లేదని టీమిండియా యువ ఆలౌరౌండర్ విజయ్ శంకర్ అభిప్రాయపడ్డారు. నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో తన జిడ్డు బ్యాటింగ్‌తో శంకర్ భారత్‌ను ఓటమి అంచులకు చేర్చగా దినేశ్ కార్తీక్ చివరి బంతిని సిక్సుబాది గట్టెక్కించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్ బ్యాటింగ్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై శంకర్ స్పందిస్తూ.. ఇలాంటి కామెంట్స్‌కు తాను చింతించడం లేదని, కానీ తన తల్లి తండ్రులు, స్నేహితుల నుంచి వస్తున్న ఓదార్పు మెసెజ్‌లు చాలా ఇబ్బంది పెడుతున్నాయన్నాడు. టోర్నీమొత్తం బంతితో రాణించానని కానీ చివరి రోజు ఓ చెడు దినంగా మిగిలిపోయిందన్నాడు. అది మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నానని, కానీ సానుభూతి మెసేజ్‌లు మర్చిపోలేకుండా చేస్తున్నాయని, దీంతో చాలా కష్టంగా ఉందని తెలిపాడు. ఇక భారత్‌కు ఆడుతున్నప్పుడు అభిమానుల నుంచి ఇలాంటి విమర్శలు రావడం సహజమేనని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విన్నర్‌గా హీరో అయ్యె ఓ మంచి అవకాన్ని కోల్పోయానన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరు తనకు మద్దతుగా నిలిచారని, కెప్టెన్ రోహిత్, కోచ్ రవిశాస్త్రి ఇలాంటివి సహజమేనని చెప్పారని, దీంతో తన మనసు కొంత కదుట పడిందని ఈ చెన్నై క్రికెటర్ పేర్కొన్నాడు. అంతకు ముందు తాను ఆడిన టోర్నీల్లో బంతులను డాట్ చేయలేదని, ముష్పికర్ ఆ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడన్నాడు. స్ట్రైక్ రోటేడ్ చేయకుండా షాట్లకు ప్రయత్నించడం తప్పేనని ఒప్పుకున్నాడు. భారత జట్టులో చోటుదక్కే అవకాశంపై ఎలాంటి బెంగలేదని, మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ తనకు ఊరట కల్పించే అంశమని తన సత్తా నిరూపించుకుంటానని శంకర్ వ్యాఖ్యానించాడు. ఇక శంకర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చదవండి : శంకర్.. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుకో -
ధోనితో పోలిక తగదు: దినేశ్ కార్తీక్
సాక్షి, స్పోర్ట్స్ : సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో తనకు పోలిక తగదని టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. నిదహాస్ ట్రోఫీలో ఈ స్టార్ వికెట్ కీపర్ చివరి బంతిని సిక్సు బాది భారత్‌కు విజయాన్నందించిన విషయం తెలిసిందే. దీంతో కార్తీక్ సూపర్ హీరో అయ్యాడు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. స్టార్ వికెట్ కీపర్, మ్యాచ్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనితో తనను పోల్చవద్దన్నాడు. ధోని ప్రయాణం, తన ప్రయాణం వేర్వేరని, అతను యూనివర్సిటీ టాపర్ అయితే తాను ఆ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని మాత్రమేనన్నాడు. తనకు ఆ అవకాశమే గొప్పదని చెప్పుకొచ్చాడు. అందరి నోట నాపేరు రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తన తల రాత బాగుండటంతోనే ఆ సిక్సు కొట్టగలిగానని, రెండు మిల్లీమీటర్ల వ్యత్యాసంలోని సిక్సు పడిందని గుర్తు చేశాడు. గత రెండేళ్లుగా అభిషేక్ నాయర్ తన కెరీర్‌కు ఎంతో సాయం చేశాడని ఈ తమిళ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. శంకర్ బ్యాటింగ్‌పై స్పందిస్తూ.. అతను మంచి నైపుణ్యం ఉన్న ఆల్‌రౌండర్ అని, బౌలర్‌గా అద్భుతంగా రాణించాడని, కానీ బ్యాటింగ్లోచాలా ఒత్తిడికి లోనయ్యాడని అభిప్రాయపడ్డాడు. శంకర్‌కు మంచి భవిష్యత్తుందని, తనలో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయని, అవే తాను చాలా రోజులు ఆడేలా చేస్తాయన్నారు. ఇక ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్‌గా వ్యవహరించేందుకు ఉవ్విళ్లూరుతున్నానని, ఈ అద్భుత టోర్నమెంట్ తనకెంతో ముఖ్యమని కార్తీక్ తెలిపాడు. ఇక ఈ సీజన్లో కార్తీక్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. -
దినేశ్ కార్తీక్.. మై సూపర్ హీరో : దీపికా
సాక్షి, స్పోర్ట్స్ : నిదహాస్ ట్రోఫీలో చివరి బంతిని సిక్స్ బాది భారత్‌కు అనూహ్య విజయాన్నందించిన టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే కార్తీక్ ప్రదర్శన పట్ల అతని సతీమణి భారత స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ ఆనందం వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం టీవీలో కనిపిస్తున్న దినేశ్ కార్తీక్ ఫొటోపై ‘మై దాదా మై సూపర్‌హీరో’ అనే క్యాఫ్షన్‌తో ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. ఇక మరో పోస్ట్‌లో కార్తీక్ ఫొటో లవ సింబల్స్‌తో తన ప్రేమను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక సూపర్ సిక్సుతో సూపర్ స్టార్ అయిన దినేశ్ కార్తీక్ తొలుత చిన్ననాటి స్నేహితురాలు నిఖితను పెళ్లి చేసుకున్నాడు. అనుకొని కారణాలతో 2012లో ఆమెతో విడిపోవాల్సి వచ్చింది. తర్వాత నిఖితను భారత క్రికెటర్ మురళీ విజయ్ పెళ్లి చేసుకున్నాడు. అనంతరం కార్తీక్... దీపికా పల్లికల్‌ను 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. -
ఆ క్రికెటర్‌పై డీకే అభిమానుల ఆగ్రహం
సాక్షి, స్పోర్ట్స్ : నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శనతో జట్టుకు విజయం అందించిన దినేశ్ కార్తిక్‌కు అభిమానులతో పాటు, సహచర ఆటగాళ్లు, సీనియర్లు ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. దీంతో డీకే అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. కానీ వారికి ఇప్పుడు కోపం వచ్చింది. ఎందుకంటే దేశమంతా డీకేను కొనియాడుతుంటే ఒక క్రికెటర్ మాత్రం జట్టును మాత్రమే పొగిడి కనీసం డీకే పేరును ప్రస్తావించకపోవడంతో ట్విటర్ వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీకే సహచర ఆటగాడు, ఒకప్పటి స్నేహితుడు మురళీ విజయ్ భారత విజయాన్ని అభినందిస్తూ ‘ఇదొక గొప్ప విజయం.. భారత క్రికెట్ బ్రాండ్ విలువను పెంచేందుకు బీసీసీఐ చేస్తున్న కృషికి ఇది నిదర్శనం’ అంటూ ట్వీట్ చేశాడు. జట్టు విజయానికి కారణమైన కార్తిక్ పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడంతో డీకే అభిమానులు మురళీ విజయ్‌కు కౌంటర్‌గా ట్వీట్ల ద్వారానే సమాధానం ఇస్తున్నారు. ‘విజయ్ నీకు ఇదేమీ కొత్త కాదు.. ఇంతకు ముందు తమిళనాడు జట్టు విజయ్ హజారే ట్రోఫీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన డీకేని విస్మరించావు. నువ్వింకా ఎదగాలి’ అంటూ ఓ అభిమాని ట్వీట్ చేయగా.. ‘మీ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి.. నిజాయితీగా స్పందించడం నేర్చుకో’ అని మరొకరు సలహా ఇచ్చారు. కాగా భారత క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా.. ‘డీకే పేరును ప్రస్తావించక పోవడానికి ఉన్న స్పష్టమైన కారణాలేంటో’ అంటూ ట్వీట్ చేశాడు. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న ఈ తమిళనాడు ఆటగాళ్లు... దినేశ్ కార్తిక్ మాజీ భార్య నిఖిత.. మురళీ విజయ్ను పెళ్లాడినప్పటి నుంచి దూరమయ్యారు. కాగా 2015లో దినేశ్ కార్తిక్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్‌ను పెళ్లి చేసుకున్నాడు. Remarkable win boys @bcci 🌟 pretty much typifies the brand of cricket we play 🤙🏽 #INDVBAN #Champions #TeamIndia #supremacy #NidahasTrophy #NidahasTrophyFinal pic.twitter.com/ewUKclUX29 — Murali Vijay (@mvj888) March 18, 2018 -
లంక అభిమానికి రోహిత్ శర్మ గిప్ట్
కొలంబో : భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నాడు. ఆదివారం జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఓ లంక అభిమానికి రోహిత్ అద్భుత బహుమతిని అందిచాడు. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఓ శ్రీలంక అభిమానికి వీఐపీ టిక్కెట్లు అందించాడు. అసలు ఏం జరిగిందంటే.. లంక పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రాక్టీస్ చేసుకొనే సమయంలో బంతులు వేసేందుకు కవీన్ ఫెర్నాండే అనే 23 ఏళ్ల ఆటగాడిని శ్రీలంక క్రికెట్ బోర్డు నియమించింది. ఒకసారి ప్రాక్టీస్ సెషన్లో కవీన్ వేసిన బంతులను రిషబ్ పంత్ ఎదుర్కొంటున్నాడు. ఆ సమయంలో రిషబ్ పంత్ కొట్టిన ఓ బంతి అనుకోకుండా కవీన్‌ను బలంగా తాకడంతో ముక్కు, దవడ నుంచి రక్తం వచ్చింది. వెంటనే స్థానిక నవలోక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం కోలుకున్న కవీన్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కవీన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లినట్లు విషయం తెలుసుకున్న రోహిత్, టీమ్ మేనేజ్మెంట్తో మాట్లాడి, రెండు వీఐపీ టిక్కెట్లు తీసుకుని కవీన్‌కు పంపించాడు. ఆదివారం జరిగే ఫైనల్‌ను చూసేందుకు రావాలని కోరాడు. దీంతో కవీన్ ఆనందానికి అవధుల్లేవు. ఆదివారం తండ్రితో కలిసి వచ్చి కవీన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు. ఈ సందర్బంగా కవిన్ రోహిత్ శర్మను పొగడ్తలతో ముంచెత్తాడు. -
విజయానంతరం శ్రీలంక జెండాతో రోహిత్!
సాక్షి, స్పోర్ట్స్ : నిదహాస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో విజయానంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంక జాతీయ పతాకంతో మైదానంలో సందడి చేశారు. లంక స్వాతంత్ర్య వేడుకల పురస్కరించుకొని ఈ ముక్కోణపు టోర్నీని నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే శ్రీలంకపై బంగ్లాదేశ్ అనూహ్య విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆటగాళ్లు దురుసుగా ప్రవర్తించడంతో లంక అభిమానులు ఫైనల్లో భారత్‌కు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో రోహిత్ విజయానంతరం వారి మద్దతుకు ప్రతీకగా ఆ దేశ జెండాను ఊపుతూ వారిలో ఉత్సహాన్ని నింపారు. దీంతో రోహిత్‌పై లంక అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. క్రికెట్‌కే ఇదొక అందమని, రోహిత్ శర్మ శ్రీలంక జెండా పట్టుకోవడం సంతోషంగా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. -
ఈ ఒక్క సారికి వదిలెయ్యండి: బంగ్లా క్రికెటర్
సాక్షి, స్పోర్ట్స్ : నిదహాస్ ట్రోఫీలో భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఓటమిపై బంగ్లాదేశ్ పేసర్ రూబెల్ హొస్సెన్ పశ్చాతాపం వ్యక్తం చేశాడు. తాను దారళంగా పరుగులివ్వడంతోనే తమ జట్టు ఓటమి పాలైందని, ఈ విషయంలో అభిమానులు క్షమించాలని విజ్ఞప్తి చేశాడు. ఓటమికి తానే కారణమవుతానని ఊహించలేదని ఈ బంగ్లా బౌలర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ జట్టు విజయానికి దగ్గరగా వచ్చిందని, కానీ చివరకు తన వల్లె ఓడిపోయిందన్నాడు. దీంతో ఈ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నానని, ఈ ఒక్కసారికి వదిలెయ్యాలని అభిమానులకు రూబెల్ బంగ్లా మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడు. ఇక 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి కేవలం 133 పరుగులు చేసింది. ఆ సమయంలో క్రీజులో పాతుకు పోయిన బ్యాట్స్‌మెన్ సైతం లేరు. ఓ వైపు జిడ్డు బ్యాటింగ్‌తో భారత్ ఓటమి అంచుకు చేర్చిన విజయ్ శంకర్ ఉండగా అప్పుడే క్రీజులోకి దినేశ్ కార్తీక్ వచ్చాడు. ఇంకా భారత్ విజయానికి 12 బంతుల్లో 34 పరుగులు అవసరం. 19 ఓవర్ వేసేందుకు రూబెల్ హోస్సెన్ సిద్దమయ్యాడు. ఇక బంగ్లా విజయం కాయమని అందరూ భావించారు. ఎందుకంటే అప్పటికి రూబెల్ 3 ఓవర్లు వేసి కేవలం 13 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసాడు. దీంతోనే బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ముందుగానే రూబెల్కు బంతి ఇచ్చాడు. కానీ కార్తీక్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరుస బంతుల్లో 6, 4, 6, 0, 2, 4 లతో 22 పరుగులు పిండుకున్నాడు. దీంతో చివరి ఓవర్లో భారత్ లక్ష్యం 12 పరుగులకు చేరడం కార్తీక్ విన్నింగ్ షాట్‌తో భారత్‌ను గట్టెక్కించడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఓటమి తనవల్లేనని భావించిన రూబెల్ అభిమానులను క్షమాపణలు కోరాడు. -
శంకర్.. టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడుకో
సాక్షి, స్పోర్ట్స్ : నిదహాస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అద్భుత ప్రదర్శనతో భారత్ గట్టెక్కిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్‌ను గెలిపించిన కార్తీక్‌పై ప్రశంసల జల్లు కురుస్తుండగా.. జిడ్డు బ్యాటింగ్‌తో భారత్‌ను ఓటమి అంచులకు చేర్చిన యువ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌పై మిమర్శల పర్వం కొనసాగుతోంది. అసలే అది ఉత్కంఠకర టీ20 మ్యాచ్.. పైగా ఫైనల్ మ్యాచ్ కూడా.. ఈ తరుణంలో ప్రతి బంతిని బౌండరీకి తరలించాల్సింది పోయి.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు బంతులు డాట్ చేయడంతో విజయ్ శంకర్‌పై అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. మ్యాచ్ గెలిచినా అభిమానులకు శంకర్‌పై ఉన్న కోపం తగ్గలేదు. ఇంకేముంది సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వెల్లగక్కారు. అసలు నిన్నెవరు(శంకర్) సెలక్ట్ చేసిందని, గల్లీ క్రికెటర్‌వి అంటూ తీవ్ర పదాజాలంతో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ ఓడిపోయి ఉంటే శంకర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారేదని, దినేశ్ కార్తీక్ మ్యాచ్‌ను గెలిపించడమే కాదు.. శంకర్‌ను కాపాడాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతని అరంగేట్ర సిరీస్‌లోనే వీడ్కోలు జరిగేదని, శంకర్ నీవు టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడుకోవడం మంచిదని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. Vijay Shankar should immediately be barred from any level of cricket asap. At the most he should play tennis ball cricket 😂 — iMac_too (@iMac_too) 18 March 2018 Dinesh Karthik just saved 1: India 2:Vijay Shankar 3:us from watching their naagin dance#dineshkarthik #teamindia#naagindance 😂😂 — sujithsukumar (@sujithsukumar3) 18 March 2018 -
నా జీవితంలో ఓ అద్భుతమైన రాత్రి..
సాక్షి, స్పోర్ట్స్ : నరాలు తెగెంత ఉత్కంఠకర మ్యాచ్‌లో చివరి బంతిని సిక్సుకు తరలించి భారత్‌కు విజయాన్నందించిన టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన జీవితంలో ఈ రాత్రిని ఓ అద్భుతమైన రాత్రిగా అభివర్ణించాడు. నిదహాస్ ట్రోఫీలో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ అద్భుత ప్రదర్శనతో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో కార్తీక్‌పై అటు క్రికెట్ దిగ్గజాలు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి ఇటు సామాన్య అభిమాని వరకు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో కార్తీక్ సైతం ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘బహుషా నా జీవితంలో ఇది ఓ గొప్ప రాత్రి. ఇలాంటి అవకాశం మరోసారి రాకపోవచ్చు’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. Probably one of the best nights of my life. Nothing comes close to crossing the finish line for… https://t.co/lmy5k4DrMi — DK (@DineshKarthik) 19 March 2018 ఇక ధోని వల్లె తనకు ఈ శక్తి వచ్చిందని, ఎంతటి క్లిష్టసమయాల్లోనైనా టెన్షన్ లేకుండా, కూల్‌గా ఉండగలగడం ఒక్క ధోనీకే సాధ్యమని, మ్యాచ్‌ను విజయవంతంగా ఫినిష్ చెయ్యడం ధోనీ నుంచే నేర్చుకున్నానని మ్యాచ్ అనంతరం కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ ముందు సీనియర్ వికెట్ కీపర్ ధోనికి విశ్రాంతి ఇవ్వడంతో అతని స్థానంలో యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కు అవకాశమివ్వాలని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ కెప్టెన్ రోహిత్ కార్తీక్‌పై ఉన్న నమ్మకంతో తొలి రెండు మ్యాచుల్లో ఈ ఇద్దరి ఆటగాళ్లకు అవకాశమిచ్చాడు. తర్వాత పంత్ బ్యాటింగ్‌లో ఇబ్బంది పడటంతో రాహుల్‌కు అవకాశం దక్కిన విషయం తెలిసిందే. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్తీక్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. -
లాస్ట్ బాల్ చూడలేదు.. ప్యాడ్స్ కట్టుకోడానికెళ్లా..!
న్యూఢిల్లీ : నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఒక థ్రిల్లర్‌ను తలపించిన సంగతి తెలిసిందే. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో చివరి బంతిని సిక్సర్‌గా మలిచి.. టీమిండియాకు దినేశ్ కార్తీక్ (డీకే) మరుపురాని విజయాన్ని అందించాడు. అభిమానుల గుండెల్లో ఓవర్‌నైట్ డీకే హీరో అయిపోయాడు. అయితే, ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో టీమిండియా సారథి అయిన రోహిత్ శర్మ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. కార్తీక్ చివరి బంతిని ఎదుర్కోవడాన్ని తాను చూడలేదని చెప్పాడు. మ్యాచ్ టై అవుతుందేమోనని భావించి.. సూపర్ ఓవర్ కోసం సన్నాహకాల్లో మునిగిపోయినట్టు తెలిపాడు. కార్తీక్ చివరి బంతి ఆడే సమయంలో.. ‘నేను మళ్లీ ప్యాడ్స్ కట్టుకునేందుకు డ్రెసింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాను’ అని మ్యాచ్ అనంతరం రోహిత్ తెలిపాడు. దినేశ్‌కు ఇప్పటివరకు గేమ్‌లో తన ప్రతిభ చూపించే అవకాశం రాలేదని, ఈ మ్యాచ్‌లో తన సత్తా ఏమిటో అతను చాటాడని, అతను చివరి బంతిని సిక్సర్‌గా మలచడం తనకెంతో ఆనందం కలిగించిందని చెప్పాడు. ఆల్‌రౌండర్ విజయ్‌శంకర్‌ను ముందు పంపించడాన్ని సమర్థించుకున్న రోహిత్.. కార్తీక్ మ్యాచ్ ఫినిషింగ్ సామర్థ్యంపై అపారమైన నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించి.. రోహిత్ శర్మ అర్ధ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ టీ-20 కెరీర్లో ఇది 14వ అర్ధసెంచరీ కావడం గమనార్హం. -
గెలిపించింది దినేశ్ కాదు.. ధోనీనే!
సాక్షి, స్పోర్ట్స్: ఆల్‌టైమ్ గ్రేట్ మహేంద్ర సింగ్ ధోనీ ఘనత గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. టీమ్‌లో ఉన్నా, లేకున్నా చర్చలోకి మహీని లాగాల్సిందే! నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్ చిత్తుచేసిన సందర్భంలోనూ ధోనీ ఉన్నాడు. అవును. కీపింగ్‌తోపాటు మ్యాచ్ ఫినిషింగ్ బాధ్యతలు కూడా తీసుకున్న దినేశ్లో ధోనీని చూసుకుంటున్నారు అభిమానులు. చిరునవ్వులు చిందిస్తోన్న దినేశ్‌ను కట్టేసి, ముసుగు తీస్తే ధోనీ కనిపిస్తాడనే అర్థంతో రూపొందిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. అందుకు తగ్గట్లే కార్తీక్ కూడా ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘బహుశా నాకీ శక్తి అతని నుంచే వచ్చి ఉండొచ్చు. ఎంతటి క్లిష్టసమయాల్లోనైనా టెన్షన్ లేకుండా, కామ్‌గా ఉండగలగడం ఒక్క ధోనీకే సాధ్యమైంది. మ్యాచ్‌ను విజయవంతంగా ఫినిష్ చెయ్యడం ధోనీ నుంచే నేర్చుకున్నాను. నేనేకాదు ప్రతిఒక్కరూ ధోనీ నుంచి తెల్సుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది..’ అని డీకే చెప్పాడు. నాగిని డ్యాన్స్ ఎక్స్టెండ్ అయితే.. : మధ్యలో ఆసీస్-సఫారీల మధ్య మాటల యుద్ధాలు, గిల్లికజ్జాలను క్రీడాభిమానులు మర్చిపోకముందే నిదహాస్ టీ20 ట్రోఫీలోనూ ఉద్వేగ పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఆతిథ్య శ్రీలంకలో మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ ప్లేయర్లు చేసిన నాగిని డ్యాన్స్‌కు క్రీడాలోకం విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. నిన్నటి ఫైనల్స్‌లోనూ బంగ్లా వ్యతిరేకులు కొందరు.. పాములా బుసకొట్టడం చూశాం. ఇక మ్యాచ్ తర్వాతైతే సోషల్ మీడియా నిండా నాగిని ఫొటోలే! సరదాగా రూపొందించిన ఆ ఫొటోల్లో కొన్ని.. Take a bow, Dinesh Karthik👏👏👏 pic.twitter.com/O9gy8NTH6P — All India Bakchod (@AllIndiaBakchod) March 18, 2018 #INDvBAN pic.twitter.com/fNuH0anSLN — Pakchikpak Raja Babu (@HaramiParindey) March 18, 2018 Pic 1: Before Match Pic 2: After Match#INDvBAN pic.twitter.com/zXwgWuwEUU — PhD in Bakchodi (@Atheist_Krishna) March 18, 2018 Rohit Sharma #INDvBAN pic.twitter.com/C7E9L6pSRF — Pakchikpak Raja Babu (@HaramiParindey) March 18, 2018 Dinesh Karthik after saving Vijay Shankar's career. #INDvBAN pic.twitter.com/cd5Uj87qjx — SAGAR (@sagarcasm) March 18, 2018 Dear Bangladesh, never underestimate an Indian wicketkeeper on the last ball of a T20 match. #IndvBan #DineshKarthik pic.twitter.com/TIg9kkkoBH — Bollywood Gandu (@BollywoodGandu) March 18, 2018 -
హ్యాట్సాఫ్.. దినేష్ కార్తీక్
సాక్షి, స్పోర్ట్స్: నిదహాస్ ట్రోఫీ గెలిచేందుకు హోరాహోరీగా సాగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో తన అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చిన దినేశ్ కార్తిక్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్న డీకేపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు, సహ ఆటగాళ్లు అతడిని పొగడ్తల్లో ముంచెత్తారు. ‘యూ బ్యూటీ’ అంటూ డీకేను యువరాజ్ సింగ్ పొడిగాడు. ఒత్తిడిలోనూ గొప్పగా ఆడి జట్టుకు విజయాన్ని అందించిన దినేష్ కార్తీక్‌కు శిఖర్ ధవన్ హ్యాట్సాఫ్ చెప్పాడు. టీమిండియా అద్భుత విజయం సాధించిందని, దినేష్ కార్తీక్ బ్యాటింగ్ సూపర్బ్‌గా ఉందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. రోహిత్ శర్మ గొప్ప ఇన్నింగ్స్‌లో జట్టు విజయానికి బాటలు వేశాడని మెచ్చుకున్నాడు. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని కలిగించిందన్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి..‘ రాత్రి జరిగిన మ్యాచ్ అద్భుతం.. దీనికి ఆటగాళ్ల సమష్ఠి కృషే కారణం.. వెల్డన్ డీకే’ అంటూ ట్వీట్ చేశాడు. నిదహాస్ ట్రోఫీకి దూరంగా ఉన్నప్పటికీ మ్యాచ్‌లన్నీ వీక్షిస్తూ కోహ్లి తన సహచరులను ఉత్సాహపరుస్తూనే ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం కోసం 3 ఓవర్లలో 35 పరుగులు అవసరమైన క్లిష్ట పరిస్థితుల్లో.. 8 బంతుల్లో 29 పరుగులు చేసి దినేశ్ కార్తీక్ బ్యాట్‌తో అద్భుతం చేసిన సంగతి తెలిసిందే. What a game of cricket last night, Complete team performance! Big up boys!!! 💪👌Well done DK @DineshKarthik 👊@BCCI #NidahasTrophy2018 #INDvsBAN — Virat Kohli (@imVkohli) March 19, 2018 Amazing victory by #TeamIndia. Superb batting by @DineshKarthik. A great knock by @ImRo45 to set the platform. What a finish to a final!!#NidahasTrophy2018 #INDvsBAN pic.twitter.com/ZYDl6jzVWl — Sachin Tendulkar (@sachin_rt) March 18, 2018 What a game! What a final! What a player! @DineshKarthik you beauty! That was a great shot under pressure to finish things off! Hats off🏆🏆🏆🤗🤗🤗😊😊😊 #INDvBAN pic.twitter.com/fxPH8OPRPJ — Shikhar Dhawan (@SDhawan25) March 18, 2018 You beauty ! @DineshKarthik 👊🏽👌🏼 — yuvraj singh (@YUVSTRONG12) March 18, 2018 -
దినేశ్ కార్తీక్‌కు క్షమాపణలు
కొలంబో/ముంబై: నరాలు తెగిపోయేంతటి ఉత్కంఠ పోరులో భారత్‌ను విజేతగా నిలిపిన దినేశ్ కార్తీక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి ఇదే చర్చ.. సోషల్‌మీడియాలోనూ ట్రెండింగ్ నేమ్ డీకేదే. ‘వాట్ ఏ గేమ్.. వాట్ ఏ ప్లేయర్..’ అంటూ కామెంట్లు..! అందరిలాగే సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తూ ఓ ట్వీట్ వదిలారు. కానీ అందులో సంఖ్యలు తప్పుగా రాయడంతో, దినేశ్ కార్తీక్‌కు క్షమాపణలు చెబుతూ ఇంకో ట్వీట్ చేశారు. అందుకే శంకర్‌ను ముందు పంపాం: రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం దినేశ్ కార్తిక్ నాలుగో డౌన్లో(98 పరుగుల వద్ద రోహిత్ ఔటైన తర్వాత) రావాల్సింది. కానీ అనూహ్యంగా శంకర్ క్రీజ్‌లోకి వచ్చాడు. అనుభవలేమితో సతమతమౌతూ వరుసగా బంతుల్ని మింగుతూ శంకర్.. అభిమానుల టెన్షన్‌ను మరింత పెంచాడు. ఆ నిర్ణయంపై కెప్టెన్ రోహిత్ వివరణ ఇచ్చుకున్నాడు. ‘కీలకమైన తరుణంతో అనుభవమున్న ఆటగాడి అవసం చాలా ఉంటుంది. మ్యాచ్‌ను విజయవంతంగా ముగించగల సత్తా కార్తీక్‌కు ఉందని నేను గట్టిగా నమ్మాను. అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి పంపాం. అనుకున్నట్లే డీకే తనదైన నైపుణ్యంతో రాణించాడు’’ అని రోహిత్ చెప్పాడు. 20 ఏళ్ల తర్వాత లంక గడ్డపై.. శ్రీలంక 50వ స్వాతంత్ర్యదినోత్సవాల సందర్భంగా 1998లో తొలిసారి నిదహాస్ ముక్కోణపు వన్డే ట్రోఫీని నిర్వహించారు. అప్పుడు శ్రీలంక-భారత్-న్యూజిలాండ్ జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్‌లో సచిన్ టెండూల్కర్ సూపర్ సెచరీ(128)తో భారత్ 307 పరుగులు చేయగా, లంక 301 పరుగులకే ఆలౌటైంది. అలా తొలి ట్రోఫీని టీమిండియా గెలుచుకుంది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత.. అంటే శ్రీలంక 70వ స్వాతంత్ర్యదినోత్సవాల సందర్భంగా రెండోసారి నిదహాస్ ట్రోఫీని నిర్వహించారు. వన్డేలకు బదులు టీ20లు ఆడించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 8 బంతుల్లో 29 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ లభించగా, వాషింగ్టన్ సుందర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. (చదవండి : దినేశ్ కార్తీక్ సూపర్ హిట్) T 2747 - that should read 34 needed in 2 overs .. NOT 24 .. apologies to Dinesh Kartik .. pic.twitter.com/yH6rVjWzpk — Amitabh Bachchan (@SrBachchan) 18 March 2018 -
భారత్ గెలుపు-లంక అభిమానుల సంబరం
-
భారత్ గెలుపు-లంక అభిమానుల సంబరం
కొలంబో : నిదహాస్ ముక్కోణపు సిరీస్ ఫైనల్ ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించి సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఇప్పటి వరకూ ఈ సిరీస్ రెండు సార్లు జరగ్గా రెండుసార్లు భారత్ విజేతగా నిలిచింది. 1998లో జరిగిన టోర్నీలో శ్రీలంకపై ఆరు పరుగులతో గెలుపొంది తొలిసారి సిరీస్ సొంతం చేసుకోగా, ఆదివారం రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 4వికెట్ల తేడాతో గెలుపొంది రెండోసారి కప్‌ను కైవశం చేసుకుంది. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ టీ20 మ్యాచ్‌లోని అసలు మజాను క్రికెట్ అభిమానులకు చూపించాడు. కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి భారత్‌ను విజేతగా నిలిపాడు. దినేష్ కార్తీక్ అద్భుత ఆటతీరుతో భారత్‌ను గెలిపిండంతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే భారత్ అభిమానులతో పాటు శ్రీలంక అభిమానులు సైతం సంబరాలు చేసుకున్నారు. భారత్ విజయాన్ని తమ విజయంగా భావించి వేడుకలు జరుపుకున్నారు. ఇందుకు కారణం బంగ్లాదేశ్, శ్రీలంకల మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్. ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్‌లో శ్రీలంక అనూహ్యంగా ఓటమిపాలైంది. అంతేకాకుండా బంగ్లా ఆటగాళ్లు శ్రుతిమించి శ్రీలంక ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ , బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో లంక అభిమానులు ఇండియాకు మద్దతు పలికారు. భారత్ గెలవాలని కోరుకున్నారు. ఉత్కంఠ పోరులో భారత్ గెలవడంతో లంక అభిమానులు పండగ చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఓ శ్రీలంక అభిమాని, భారత అభిమాని సుధీర్ కుమార్ చౌదరిని ఎత్తుకొని గ్రౌండ్లో పరుగులు తీశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది. -
నేడు ముక్కోణపు టి20 టోర్నీ ఫైనల్
-
నిదహస్ నీదా... నాదా?
కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలో దిగిన యువ టీమిండియా... ‘నిదహస్’ ట్రోఫీని ఒడిసి పట్టేందుకు మరొక్క విజయం చాలు. అనవసర ఒత్తిడికి గురికాకుండా మన ఆట మనం ఆడుకుంటే ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను మట్టికరిపించడం ఏమంత పెద్ద కష్టం కాదు. లీగ్ దశలో ఇదే జట్టుపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన రోహిత్ బృందం ఆత్మవిశ్వాసం తోడుగా చెలరేగితే సగర్వంగా టైటిల్ అందుకోవడం ఖాయం. అయితే ఆతిథ్య శ్రీలంకపై రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ సూపర్ ఛేజింగ్ చేసిన బంగ్లాదేశ్ అంతిమ సమరంలో అద్భుతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో టైటిల్ పోరు రసవత్తరంగా సాగే అవకాశముంది. కొలంబో: టోర్నీ ప్రారంభంలో ఇరు జట్లు తడబడ్డాయి. ఇటు తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్ తర్వాత ఘనంగా పుంజుకుంది. అటు బంగ్లాదేశ్ క్రమక్రమంగా ఆటతీరు మెరుగుపర్చుకుంటూ వచ్చింది. స్థాయికి తగ్గ ఆటతో రోహిత్ సేన, పోరాటపటిమతో షకీబ్ బృందం నిదహస్ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నీ ఫైనల్ చేరాయి. శక్తిసామర్థ్యాలు, గత రికార్డు చూస్తే టీమిండియాదే పైచేయిగా కనిపిస్తున్నా, సంచలనాల ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయలేం. రెండు జట్లలో లోతైన బ్యాటింగ్ లైనప్, ఆల్ రౌండర్లు, నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో ఆదివారం జరుగనున్న తుది సమరం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. టీమిండియాకు ‘ఒక్క’ లోటు... మొన్నటివరకు కెప్టెన్ రోహిత్‌శర్మ ఫామ్ భారత్‌కు పెద్ద ఆందోళనగా ఉండేది. ఎట్టకేలకు గత మ్యాచ్‌లో బంగ్లాపైనే అతడు టచ్‌లోకి వచ్చి బెంగతీర్చాడు. ఓపెనర్ ధావన్ సహా రైనా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ అందరూ ఈ టోర్నీలో సత్తాచాటారు. దీంతో బ్యాటింగ్ పరంగా ఇబ్బందులేమీ లేవు. యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పవర్ ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేస్తూనే వికెట్లూ తీస్తున్నాడు. చహల్ గాడిన పడ్డాడు. అయితే... ఉనాద్కట్, సిరాజ్ ఇద్దరూ విఫలమవడంతో రెండో ప్రధాన పేసర్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పేస్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఉన్నందున సిరాజ్ స్థానంలో దీపక్ హుడా, అక్షర్ పటేల్‌లలో ఒకరిని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తొలుత బ్యాటింగ్‌కు దిగితే 200పైగా పరుగులు సాధించి ప్రత్యర్థిని మానసికంగా ఒత్తిడిలోకి నెట్టాలి. బౌలింగ్ చేయాల్సి వచ్చినా 160లోపు కట్టడి చేస్తే ఛేదనలో ఇబ్బందులు ఎదురవవు. బంగ్లాతో పారాహుషార్... భారత్ స్థాయిలో ఆటగాళ్లు లేకున్నా బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఆతిథ్య శ్రీలంకపై రెండు మ్యాచ్‌ల్లోనూ వారి పోరాటం విస్మరించలేనిది. తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్లకు తోడు కెప్టెన్ షకీబుల్ హసన్ రాకతో బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. సారథ్య బాధ్యతల ఒత్తిడి లేకపోవడంతో గత మ్యాచ్‌లో మహ్ముదుల్లా అద్వితీయంగా ఆడాడు. ముస్తఫిజుర్, రూబెల్ పదునైన పేసర్లు. స్పిన్‌లో మెహదీ హసన్‌కు షకీబ్ తోడయ్యాడు. వీరంతా సమష్టిగా ఆడితే భారత్‌కు కష్టాలు తప్పవు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే బంగ్లా ఫైనల్‌కు బరిలో దించే అవకాశాలు ఉన్నాయి. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్‌శర్మ (కెప్టెన్), ధావన్, రైనా, రాహుల్, పాండే, కార్తీక్, విజయ్‌శంకర్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్, చహల్, దీపక్ హుడా/అక్షర్ పటేల్/సిరాజ్. బంగ్లాదేశ్: షకీబుల్ హసన్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, మహ్ముదుల్లా, షబ్బీర్, మెహదీ హసన్, రూబెల్ హుస్సేన్, ముస్తఫిజుర్, నజ్ముల్ ఇస్లాం. పిచ్, వాతావరణం మరోసారి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. రాత్రి వేళలో ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. వర్షంతో మ్యాచ్‌కు ఆటంకం లేదు. రాత్రి గం.7 నుంచి డి స్పోర్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం ‘శ్రీలంకతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టి20ల్లో ఉండాల్సిన నాటకీయత, ఉద్వేగాలు అన్నీ కనిపించాయి. విజేతగా నిలిచినందుకు మేం అదృష్టవంతులం. స్ట్రైక్ రొటేట్ చేసి మహ్ముదుల్లాకు బ్యాటింగ్ వచ్చేలా చూడాలనుకున్నా. ఫైనల్లో భారత్ కఠిన ప్రత్యర్థే. కానీ మా జోరు కొనసాగిస్తాం.’ –బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ 7 భారత్, బంగ్లాదేశ్ జట్లు టి20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 7 సార్లు తలపడ్డాయి. ఏడింటిలోనూ భారత్‌నే విజయం వరించింది. షకీబ్, నూరుల్ మ్యాచ్ ఫీజులో కోత కొలంబో: శ్రీలంకతో శుక్రవారం చివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా అంపైర్ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్... క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రవర్తించాడని పేర్కొంటూ అతడి మ్యాచ్ ఫీజులో ఐసీసీ 25 శాతం కోత విధించి, ఒక డి మెరిట్ పాయింట్ ఇచ్చింది. దీంతోపాటు మ్యాచ్‌కు అప్రతిష్ఠ తెచ్చేలా వ్యవహరించినందుకు బంగ్లాదేశ్ సబ్‌స్టిట్యూట్ నూరుల్ హసన్ మ్యాచ్ ఫీజులోనూ 25 శాతం కోత పెడుతూ, ఒక డి మెరిట్ పాయింట్ కేటాయించింది. శనివారం ఈ ఆటగాళ్లిద్దరూ ఐసీసీ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా వాదనలేమీ లేకుండానే వారిపై నిర్ణయం తీసుకున్నారు. ‘మ్యాచ్ ఎంత ఉత్కంఠగా ఉన్నా శుక్రవారం ఘటన ఏ స్థాయి క్రికెట్లోనూ సహించరానిది. షకీబ్‌ను నాలుగో అంపైర్ అదుపు చేయలేకపోయినా, ఫీల్డ్ అంపైర్లు నూరుల్–తిసారా మధ్య కలుగజేసుకోకపోయినా పరిస్థితులు దారుణంగా మారేవి. ఈ ఇద్దరు ఆటగాళ్లు పరిధిని అతిక్రమించారు’ అని క్రిస్ బ్రాడ్ స్పష్టం చేశాడు.