నిదహాస్ ముక్కోణపు సిరీస్ ఫైనల్ ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించి సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఇప్పటి వరకూ ఈ సిరీస్ రెండు సార్లు జరగ్గా రెండుసార్లు భారత్ విజేతగా నిలిచింది. 1998లో జరిగిన టోర్నీలో శ్రీలంకపై ఆరు పరుగులతో గెలుపొంది తొలిసారి సిరీస్ సొంతం చేసుకోగా, ఆదివారం రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 4వికెట్ల తేడాతో గెలుపొంది రెండోసారి కప్‌ను కైవశం చేసుకుంది.