మహ్మద్ సిరాజ్
కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో స్పల్ప మార్చులు చోటు చేసుకున్నాయి. భారత జట్టులో జయదేవ్ ఉనద్కత్ స్థానంలోకి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. గత రెండు టీ20లకు బెంచ్‌కే పరిమితమైన ఈ హైదరాబాదీకి ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు అవకాశం లభించింది. ఇక బంగ్లాదేశ్ జట్టులో టస్కిన్ స్థానంలో అబూ హైదర్‌ను తీసుకున్నారు.
ఈ సిరీస్‌లో రోహిత్ సేనకు ఇది చివరి మ్యాచ్ కాగా ముష్ఫికర్ బృందం ఆతిథ్య శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు లంకపై సంచలన విజయం నమోదు చేసిన బంగ్లాదేశ్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ నెగ్గితే రన్‌రేట్ వంటి సాంకేతికాంశాల అవసరం లేకుండా నేరుగా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ ఓడినా ప్రస్తుతానికి రన్‌రేట్ మెరుగ్గా (+0.21) ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది రాదు. అయితే... శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితం కోసం కొంత ఎదురుచూడాల్సి రావచ్చు.
తుదిజట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రైనా, రాహుల్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, చహల్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, లిటన్‌దాస్, ముష్ఫికర్ రహీమ్, షబ్బీర్ రెహ్మాన్, ముస్తాఫిజుర్, రూబెల్ హుస్సేన్, అబు హైదర్, మెహదీ హసన్, నజ్ముల్ ఇస్లాం.
Comments
Please login to add a commentAdd a comment