కొలంబో: శ్రీలంక స్వాతంత్య్రం పొంది 70 ఏళ్లవుతున్న సందర్భంగా తలపెట్టిన ‘నిదాహస్’ ముక్కోణపు టి20 టోర్నీ మంగళవారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య శ్రీలంకను ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఎదుర్కోనుంది. వేడుకల సందర్భంగా శ్రీలంక క్రికెట్ బోర్డు మ్యాచ్ ఆరంభానికి ముందే వేసే టాస్ కాయిన్ ను ప్రత్యేక రూపొందించింది. బంగారం పూతతో ప్రత‍్యేకంగా టాస్ కాయిన్‌ను తయారు చేసినట్టు బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల తెలిపారు. టోర్నీలోని అన్ని మ్యాచ్‌ల్లో ఇదే కాయిన్‌ను వాడుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. టోర్నీలో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
అయితే, పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపుతప్పిన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. మంగళవారం నుంచి 10 రోజుల పాటు ఈ ఎమర్జెన్సీ అమలులో ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానాలు తలెత్తాయి. దీనిపై స్పందించిన బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం యథావిధిగా మ్యాచ్ జరిగి తీరుతుందని ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. ఎమర్జెనీతో మ్యాచ్‌కు అంతరాయం కలగదని బీసీసీఐ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment