Gold Coin
-
బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై డిస్కౌంట్
హైదరాబాద్: ప్రముఖ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్లరీ సంస్థ భీమా జ్యువెల్స్ ‘అద్భుతమైన ఫిబ్రవరి’ ఆఫర్ ప్రకటించింది. బంగారు, వెండి ఆభరణాల తయారీ చార్జీలపై 70% డిస్కౌంట్ అందిస్తుంది. వజ్రాభరణాలపై క్యారెట్‌కు రూ.7,000 తగ్గింపుతో పాటు ప్రతి క్యారెట్‌తో ఒక గ్రాము బంగారు నాణెం ఉచితంగా పొందవచ్చు. ప్రతి వారం నిర్వహించే ‘గ్రాండ్ వీక్లీ లక్కీ డ్రా’ ద్వారా 20 మంది కస్టమర్లు అప్రిలియా స్కూటర్ గెలుచుకోవచ్చు. స్క్రాచ్ అండ్ విన్ క్యాష్ ఆఫర్లో భాగంగా ప్రతి గ్రాముకు రూ.150 వరకు క్యాష్ బ్యాక్ గెలుచుకోవచ్చు. ఇప్పటికే మొదలైన ‘అద్భుతమైన ఆఫర్’ ఫిబ్రవరి 28 వరకు అందుబాటులో ఉంటుందని, కస్టమర్లు సది్వనియోగం చేసుకోవాలని కంపెనీ తెలిపింది. -
‘దసరా’ టీంకు కీర్తి ఖరీదైన కానుకలు! ఏకంగా 130 మందికి...
‘మహానటి’ మూవీతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది కీర్తి సురేశ్. ఈ సినిమాలో అచ్చం సావిత్రిని అభినయస్తూ మంచి మార్కులు కొట్టేసింది. దీంతో కీర్తి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అయితే అదే క్రేజ్‌ను ఆమె కొనసాగించలేకపోయింది. కథలను ఎంపికలతో తడపబడుతూ స్టార్ ఇమేజ్ను డ్యామేజ్ చేసుకుంది. మహానటి తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించనప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. చదవండి: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాతృదేవోభవ’ హీరోయిన్.. ఫొటోలు వైరల్ ఇటీవల మహేశ్ బాబు సర్కారు వారి పాటతో మంచి హిట్టు కొట్టిన కీర్తి దసరా మూవీతో ఎలాగైన మరో హిట్ కోట్టాలని ఆసక్తిగా ఎదురు చూస్తుంది. నానికి జోడిగా ఆమె నటించిన దసరా మూవీ ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కీర్తికి సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినిమా షూటింగ్ అయిపోయిన సందర్భంగా కీర్తి దసరా టీంకు ఖరీదైన బహుమతులు ఇచ్చిందట. చదవండి: షాకింగ్: లాకర్లోని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ ఈ మూవీకి పని చేసిన టెక్నీషియన్లకు బంగారు నాణెలు కానుక ఇచ్చినట్లు సమాచారం. దాదాపు 130 మంది టెక్నిషియన్లు ఒక్కొక్కరి కీర్తి గోల్డ్ కాయిన్స్ పచ్చినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుంతో తెలియాల్సి ఉంది. కానీ కీర్తి గొప్ప మనసు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మహానటి తర్వాత మళ్లీ నటనకు స్కోప్ ఉన్న అలాంటి పాత్ర రావడం, షూటింగ్లో తనకు అన్ని విధాలా సహకరించినందుకు గానూకృతజ్ఞతగా ఈ బంగారు నాణెలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
పాలిథీన్ చెత్తతో రండి.. గోల్డ్ కాయిన్‌తో వెళ్లండి
అనంతనాగ్(జమ్ము కశ్మీర్): ఈ భూమ్మీద పనికిరాని వస్తువంటూ ఏదీ ఉండదు. మనసు పెడితే.. చెత్త కూడా బంగారమే అవుతుంది!. నమ్మరా?.. అయితే.. ఆ సర్పంచ్ వైవిధ్యభరితమైన ఆలోచన, దాని వెనుక ఉన్న బలమైన కారణం.. ఏడాది కాలంలో ఆ ప్రయత్నంతో తన ఊరిలో తెచ్చిన మార్పు గురించి తెలుసుకోవాల్సిందే!. ఫరూఖ్ అహ్మద్ ఘనై.. పాలిథీన్ చెత్తతో వచ్చి గోల్డ్ కాయిన్‌తో వెళ్లమంటున్నాడు. జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని కొండల మధ్య ఉండే సాదివారా అనే ఓ గ్రామానికి ఆయన సర్పంచ్. పైగా లాయర్ కూడా. పర్యావరణానికి జరుగుతున్న నష్టం.. ఒక తీవ్రమైన సమస్యగా అర్థం చేసుకున్నాడాయన. శుభ్రత మీద ఇప్పుడు దృష్టిసారించకపోతే.. రాబోయే పదేళ్లలో సారవంతమైన భూమి, స్వచ్ఛమైన నీటి వనరులను కనుగొనలేరంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారాయన. ఇంట్లో పేరుకుపోయిన పాలిథీన్ చెత్తను బహిరంగ ప్రదేశాలు, పొలాల్లో, నీళ్లలో పడేస్తున్నారు గ్రామస్తులు. అది నేలలో కలిసిపోవడం జరగని పని. అందుకే శుభ్రత కోసం అధికారులు, ప్రభుత్వం శ్రమించే కంటే.. ప్రజలే దృష్టిసారించడం మేలని భావించాడాయన. అలాగే ప్రజల్లో అవగాహన కల్పించడం కంటే.. వాళ్లకు ఆశ కల్పిస్తే ఎలా ఉంటుందని భావించాడు. అందుకే పాలిథీన్ చెత్తతో రండి.. బంగారు కాయిన్‌తో వెళ్లండి అనే పిలుపు ఇచ్చాడు. ఎవరైతే 20 క్వింటాళ్లకు తగ్గకుండా, అంతకు మించి పాలిథీన్ చెత్త తీసుకొస్తారో.. వాళ్లకు ఓ గోల్డ్ కాయిన్ ఇస్తున్నాడు. అలాగే.. అంతకంటే కాస్త తక్కువ చెత్త వచ్చినవాళ్లకు సిల్వర్ కాయిన్ బహుకరిస్తున్నాడు. అంత చెత్త తెచ్చి ఎవరు ఇస్తాడని అనుకోకండి!. ఈ ఐడియా వర్కవుట్ అయ్యింది. ఏడాదిలోనే ఎంతో మార్పు తెచ్చిందని సంబురపడిపోతున్నాడాయన. అంతేకాదు.. ఈ ఆలోచన జిల్లా అధికారులను సైతం కదిలించింది. అన్ని పంచాయితీల్లోనూ ఈ ప్రణాళిక అమలు చేయాలని జిల్లా అభివృద్ధి అధికార యంత్రాంగం నిర్ణయించుకుంది. -
ఐదు తులాల బంగారు నాణేనికి బదులు బిల్లొచ్చింది!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో ఐదు తులాల బంగారు నాణేన్ని ఆర్డర్ చేశాడో వ్యక్తి. సీల్డ్బాక్స్లో బిల్ ఇన్వాయిస్ మాత్రమే పంపించిందా దుకాణం. నష్టపరిహారంగా 18 శాతం వడ్డీతో నగదు ఇవ్వాలని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార సంస్థ తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా పరకాలకు చెందిన రవిచంద్ర (24) 2016 డిసెంబర్ 17న ఆన్లైన్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు చెందిన 50 గ్రాముల బంగారాన్ని హైదరాబాద్‌లోని షాపర్స్‌స్టాప్‌లో ఆర్డర్ చేశాడు. అందుకోసం రూ.1,53,091 చెల్లించాడు. ఆరమెక్స్ కొరియర్ ద్వారా బంగారం పంపుతున్నట్లు 2016 డిసెంబర్ 22న మలబార్ గోల్డ్ నుంచి సమాచారం వచ్చింది. కానీ డిసెంబర్ 26న ఇ–కామ్ ఎక్స్‌ప్రెస్ కొరియర్ ద్వారా సీల్డ్బాక్స్ వచ్చింది. అనుమానాస్పదంగా ఉన్న ఆ కవర్‌ను వీడియోగ్రఫీ సాయంతో తెరిచి చూడగా, అందులో గోల్డ్ కాయిన్ లేదు. కేవలం రూ.1,53,091కి సంబంధించిన బిల్లు మాత్రమే ఉంది. దీంతో అతను వీడియోను జత చేస్తూ షాపర్స్‌స్టాప్ హైదరాబాద్, ముంబై ఆఫీసుల్లో ఫిర్యాదు చేశాడు. అయినా ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో 2017లో హైదరాబాద్‌లోని వినియోగదారుల ఫోరం–1 కోర్టును ఆశ్రయించాడు. 2019 ఫిబ్రవరి 5న ఫిర్యాదుదారునికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై షాపర్స్‌స్టాప్, రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎస్సీడీఆర్సీ)ని ఆశ్రయించింది. కేసు పూర్వాపరాలను, సాక్ష్యాధారాలను పరిశీలించిన కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎంఎస్కె జైస్వాల్, సభ్యురాలు మీనా రామనాథన్ శుక్రవారం తీర్పు వెలువరించారు. హైదరాబాద్ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్ధించారు. వినియోగదారుడు చెల్లించిన మొత్తాన్ని, అప్పటి నుంచి డబ్బు తిరిగి ఇచ్చేంతవరకు 18 శాతం వడ్డీతో ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాక రూ.50 వేల నష్టపరిహారం, రూ.10వేలు ఖర్చుల కింద చెల్లించాలని, ఈ ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేయాలని తీర్పులో పేర్కొన్నారు. (క్లిక్: హైదరాబాద్‌లో ఇక ఇంటి వద్దకే ఇంధనం!) -
రామ్ చరణ్ గొప్ప మనసు, ఆర్ఆర్ఆర్ టీం ఒక్కొక్కరికి తులం బంగారం..
Ram Charan Gifted 10 Grams Gold Coins To RRR Crew: ‘ఆర్ఆర్ఆర్’.. సినిమా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కనిపిస్తుంది. ఉత్తరాదిన ఊహించని స్పందన రావడం, అక్కడ వసూళ్లు మరింత స్ట్రాంగ్‌గా ఉండటంతో ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లపరంగా దూసుకుపోతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. చదవండి: బంజారాహిల్స్ రేవ్ పార్టీ: వివరణ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్ ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో ఒకపక్క హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సహా సినిమాలో భాగమైన అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన మంచి తనాన్ని చాటుకున్నారు. సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి ఆహ్వానించారు. చదవండి: నిహారికపై వస్తున్న వార్తలపై నాగబాబు స్పందన.. ఈ సందర్భంగా వారిని అల్పాహారం విందు కోసం ఆహ్వానించిన చరణ్ వారితో కాస్త సమయం గడిపారు. అనంతరం వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం(10 గ్రాముల) బంగారం కాయిన్ కానుకగా ఇవ్వడమే కాకుండా ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా రామ్ చరణ్ వారందరని కొనియాడాడు. సినిమా ఘనవిజయం సాధించిన సందర్భంగా రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. -
బాప్రే.. బంగారు నాణేనికి రూ.142 కోట్లు!
అమెరికా బంగారునాణెం ‘డబుల్ ఈగల్’కు వేలంలో రికార్డు స్థాయిలో రూ.142 కోట్ల ధర పలికింది. ఫ్యాషన్ డిజైనర్ స్టువార్ట్ వీట్జమన్‌కు చెందిన ఈ నాణేన్ని మంగళవారం వేలం వేశారు. 20 డాలర్ల ఈ బంగారు నాణేలను 1933లో తయారుచేసినా... తీవ్ర ఆర్థిక మంద్యాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ డబుల్ ఈగల్ నాణేలను చలామణికి విడుదల చేయకుండా ఆపేశారు. నాణేలను కరిగించమని ఆదేశించారు. అప్పుడు బయటికి వచ్చి రెండింటిలో ఇదొకటి. డబుల్ ఈగిల్‌పై ఒకవైపు లేడీ లిబర్టీ, రెండో వైపు అమెరికన్ ఈగిల్ బొమ్మలు ముద్రించి ఉన్నాయి. 1794కు చెందిన ‘ఫ్లోయింగ్ హెయిర్’ వెండి నాణేం 2013లో 73 కోట్లకు అమ్ముడుపోయి అత్యధిక ధర పలికిన నాణేంగా రికార్డులకెక్కింది. మంగళవారం డబుల్ ఈగిల్ రూ.142 కోట్లు పలికి ఈ రికార్డును తిరగరాసింది. చదవండి: 24 వేల ఏళ్ల తర్వాత బతికొచ్చాయి! World Oceans Day: ‘ప్లాస్టిక్’ సముద్రాలు! -
ఫ్రీగా బంగారు నాణేలు, ఫ్రిజ్: కావాలంటే ఇది చేయాల్సిందే!
పాట్నా: ఉచితంగా బంగారు నాణేలు, ఫ్రిజ్ తదితర గృహపకరోణాలు మీకు ఇస్తాం.. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటే పని. అది వ్యాక్సిన్ వేయించుకోవడమే. వ్యాక్సిన్ వేసుకునే వారికి ఓ జిల్లా అధికారులు ఈ విధంగా తాయిలాలు ప్రకటించారు. కరోనా వైరస్ రాకుండా ముందస్తు వేయించుకునే వ్యాక్సిన్‌కు ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో వ్యాక్సిన్ ప్రక్రియ వేగం పెంచేందుకు బిహార్‌లోని షియోహర్ జిల్లా అధికారులు ఆఫర్లు ఇస్తామని తెలిపారు. జూలై 15వ తేదీ వరకు జిల్లాలో 45 ఏండ్లు నిండిన వారందరికీ 100 శాతం వ్యాక్సిన్ వేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఈ జిల్లాలో మొత్తం 53 గ్రామాలు ఉండగా వాటిలో 13 వరద ప్రభావిత గ్రామాలు ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమైతే వ్యాక్సిన్ వేసే పరిస్థితి ఉండదు. గ్రామాలన్నీ వరద ప్రభావానికి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆలోపే ఆ గ్రామస్తులందరికీ వ్యాక్సిన్ వేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ జిల్లాలో 45 ఏళ్లు పైబడినవారు మొత్తం 60,369మంది ఉన్నారు. వాక్సిన్ త్వరగా వేయించుకోవడానికి వారు తరలివస్తారనే భావనతో ఈ ఆఫర్లు ఇచ్చారు. అయితే ఈ బహమతులు ఇచ్చేందుకు ఓ ప్రక్రియ ఏర్పాటుచేశారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ప్రతి వారం ఐదుగురిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. ఆ డ్రాలో ఎవరికి ఏం వచ్చిందో ఆ వస్తువులు అందించనున్నారు. బంగారు నాణేలు, ఫ్రిజ్‌లు, కూలర్లు, మైక్రోవేవ్స్ అందించనున్నారు. -
7 కిలోల బంగారు నాణెం!
లండన్: ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు నాణేన్ని లండన్‌లోని ‘ద రాయల్ మింట్’ టంక శాల తయారుచేసింది. దీని బరువు సుమారు 7 కిలోలు. జేమ్స్‌బాండ్ 25వ చిత్రం త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఈ ప్రత్యేక నాణేన్ని రూపొందించారు. రాయల్ మింట్ గడిచిన 1,100 సంవత్సరాలలో ఇంత బరువైన, ముఖవిలువ కలిగిన కాయిన్‌ను తయారుచేయడం ఇదే మొదటిసారి. ఇది 185 మిల్లీమీటర్ల పొడవు కలిగి ఉంది. దీని వాస్తవ ధరను రాయల్ మింట్ వెల్లడించలేదు. -
అతిచిన్న బంగారు నాణెం
బెర్లిన్: స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రపంచంలోనే అతి చిన్న బంగారు నాణేన్ని ముద్రించింది. దీనిపై చిత్రించిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ వెక్కిరిస్తున్నట్లుగా ఉన్న బొమ్మ చూడాలంటే మాత్రం కళ్లద్దాలు ధరించాల్సిందే. వెడల్పు 2.96 మిల్లీమీటర్లు ఉండే ఈ నాణెం బరువు 0.0163 గ్రాములు. ప్రపంచంలోనే ఇది అతి చిన్న నాణెం అని స్విస్‌మింట్ వెల్లడించింది. ఇటువంటి 999 నాణేలను మాత్రమే ముద్రించామనీ, ఒక్కో నాణెం వెల సుమారు రూ.18 కాగా రూ.14,657కు విక్రయిస్తామని తెలిపింది. నాణెంతోపాటు దానిపైని శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ చిత్రం చూసేందుకు కొనుగోలుదారులకు కళ్లద్దాలు కూడా అందజేస్తామని వివరించింది. -
ముక్కోణపు టోర్నీలో 'గోల్డెన్' టాస్
కొలంబో: శ్రీలంక స్వాతంత్య్రం పొంది 70 ఏళ్లవుతున్న సందర్భంగా తలపెట్టిన ‘నిదాహస్’ ముక్కోణపు టి20 టోర్నీ మంగళవారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య శ్రీలంకను ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఎదుర్కోనుంది. వేడుకల సందర్భంగా శ్రీలంక క్రికెట్ బోర్డు మ్యాచ్ ఆరంభానికి ముందే వేసే టాస్ కాయిన్ ను ప్రత్యేక రూపొందించింది. బంగారం పూతతో ప్రత్యేకంగా టాస్ కాయిన్‌ను తయారు చేసినట్టు బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల తెలిపారు. టోర్నీలోని అన్ని మ్యాచ్‌ల్లో ఇదే కాయిన్‌ను వాడుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. టోర్నీలో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే, పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపుతప్పిన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. మంగళవారం నుంచి 10 రోజుల పాటు ఈ ఎమర్జెన్సీ అమలులో ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానాలు తలెత్తాయి. దీనిపై స్పందించిన బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం యథావిధిగా మ్యాచ్ జరిగి తీరుతుందని ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. ఎమర్జెనీతో మ్యాచ్‌కు అంతరాయం కలగదని బీసీసీఐ స్పష్టం చేసింది. -
ఆడ పిల్లలు పుడితే బంగారమే!
సాక్షి, తిరువనంతపురం : కేరళలోని మలప్పురం జిల్లా కొట్టాక్కల్ మున్సిపాలిటి. ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రాంతంగా పేరుంది. ఇక్కడ ఆడ పిల్లలకు జన్మినిచ్చే తల్లులకు ఓ బంపరాఫర్ ప్రకటించాడు స్థానిక కౌన్సిలర్ ఒకరు. ఒక గ్రాము గోల్డ్ అందజేస్తానని ప్రకటించారాయన. ఆయన పేరు అబ్దుల్ రహీమ్. స్వతంత్ర్య అభ్యర్థిగా గెలుపొందిన ఆయన ఎక్కడైనా ఆడపిల్ల పుట్టిందంటే చాలూ వాలిపోయి ఆ తల్లిదండ్రులకు ఓ గ్రాము బంగారం అందిస్తారు. ఇందుకు గాను ఆయనకు అయ్యే ఖర్చు 2500 రూపాయిలు. ఆయన చేస్తున్న పనిని అభినందిస్తూ సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తుంటే.. ఆయన మాత్రం వద్దని తిరస్కరిస్తున్నారు. ‘‘నా జీతం 8000 వేలు. అందులో ఆ మాత్రం ఖర్చుపెట్టేందుకు నేను వెనకాడను. స్త్రీమూర్తులను దేవతలుగా కొలిచే మనం, కళ్ల ముందున్న వారిపై వివక్షత చూపుతూ నిర్లక్ష్యం చేస్తున్నాం. పరిస్థితులు మారాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన చెబుతున్నారు. లింగ నిష్పత్తిలో కేరళ రాష్ట్రం మొదటిస్థానంలో ఉన్నప్పటికీ(స్త్రీ-పురుష నిష్పత్తి 1084 : 1000).. భ్రూణ హత్యల నివారణే ప్రధాన ధ్యేయంగా ఈ పని చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. ఇప్పటిదాకా ఆయన అలా గత రెండేళ్లలో 16 మందికి బంగారు కాయిన్లు అందజేసినట్లు తెలుస్తోంది. -
గతవారం బిజినెస్
ఎన్ఎస్ఈ సీఈఓగా వైదొలిగిన చిత్రా రామకృష్ణ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)ఎండీ, సీఈఓగా చిత్రా రామకృష్ణ అనూహ్యమైన పరిస్థితుల్లో వైదొలిగారు. 1992లో ఎన్ఎస్ఈ ఏర్పడినప్పటి నుంచి వివిధ హోదాల్లో ఆమె సేవలందించారు. త్వరలో రానున్న ఎన్ఎస్ఈ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) విషయంలో బోర్డు సభ్యులతో ఏర్పడిన విభేదాల వల్లే ఆమె తన పదవి నుంచి వైదొలిగారని సమాచారం. షెడ్యూల్ ప్రకారమైతే, ఆమె పదవీ కాలం 2018 మార్చి వరకూ ఉంది. ఎన్ఎస్ఈ మాత్రం వ్యక్తిగత కారణాల వల్లే ఆమె వైదొలిగినట్లు తెలియజేసింది. ఇక ఎన్ఎస్ఈ తాత్కాలిక సీఈఓగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ రవిచంద్రన్ వ్యవహరిస్తారు. ⇔ డిపాజిట్ చేయండి... టాక్‌టైమ్ పొందండి.. అధిక సేవింగ్స ఖాతాల ప్రారంభమే ప్రధాన లక్ష్యంగా కస్టమర్లను ఆకర్షించడం కోసం ఎరుుర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. కస్టమర్లు ఖాతాలో డిపాజిట్ చేసే ప్రతి రూపారుుకి ఒక నిమిషం టాక్‌టైమ్‌ను (ఎరుుర్‌టెల్ నుంచి ఎరుుర్‌టెల్‌కు) ఉచితంగా అందిస్తామని పేర్కొంది. ఈ సౌకర్యం తొలిసారి చేసిన డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.1,000ల డిపాజిట్‌తో బ్యాంక్ ఖాతాను తెరిచాడనుకోండి... అతను తన ఎరుుర్‌టెల్ మొబైల్ నంబర్‌పై 1,000 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను పొందొచ్చు. ఈ టాక్‌టైమ్‌తో దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఎరుుర్‌టెల్ నంబర్కై నా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. ⇔ మార్చి 31 వరకు జియో సేవలు ఫ్రీ.. రిలయన్స జియో నూతన సంవత్సర కానుకగా ‘జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ ప్రకటించింది. ప్రస్తుత కస్టమర్లకు డిసెంబర్ 3తో ముగిసిపోతున్న ఉచిత సేవలను మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. డేటా, దేశీయంగా వారుుస్, వీడియో కాల్స్, జియో యాప్స్‌ను ప్రస్తుత కస్టమర్లతోపాటు కొత్తగా చేరే వారు సైతం మార్చి వరకు ఉచితంగా పొందవచ్చని తెలిపారు ⇔ నవంబర్‌లో నీరసించిన తయారీ రంగం దేశీయ తయారీ రంగంపై నోట్ల రద్దు ప్రభావం పడింది. నిక్కీ మార్కెట్ ఇండియా మ్యానుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) అక్టోబర్‌లో 54.4 శాతంతో 22 నెలల గరిష్ట స్థారుుకి చేరగా... మరుసటి నెల నవంబర్‌లో ఇది 52.3 శాతానికి దిగొచ్చింది. నవంబర్ 8న ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన ఫలితంగా నోట్లకు కొరత ఏర్పడి వినియోగంతోపాటు, సరుకుల తయారీ, నూతన ఆర్డర్లు తగ్గడమే దీనికి కారణం. పీఎంఐ సూచీ 50కి పైన ఉంటే దాన్ని విస్తరణగా, అంతకంటే దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. ⇔ ఇన్ఫ్రా పరుగులు మౌలిక రంగ వృద్ధి అక్టోబర్‌లో రికార్డు స్థారుుకి చేరుకుంది. గత ఆరు నెలల కాలంలోనే అత్యధికంగా అక్టోబర్‌లో 6.6 శాతంగా నమోదైంది. స్టీల్, రిఫైనరీ రంగాల అద్భుత పనితీరు ఈ స్థారుు వృద్ధికి తోడ్పడ్డారుు. మౌలికంలో భాగమైన విద్యుదుత్పత్తి, ఎరువుల ఉత్పత్తి, సిమెంట్ ఉత్పత్తి మాత్రం భారీగా పడిపోరుుంది. మౌలికంలో భాగమైన ఎనిమిది రంగాలు... బొగ్గు, ముడి చమురు, సహజవాయువు,, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుదుత్పత్తి వృద్ధి రేటు గతేడాది అక్టోబర్‌లో కేవలం 3.8 శాతంగానే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 5 శాతంగా నమోదవగా.. తాజాగా అది 6.6 శాతానికి చేరుకుంది. ⇔ విప్రో ‘ఎకో ఎనర్జీ’ వ్యాపారం విక్రయం ప్రధాన వ్యాపారమైన ఐటీపై మరింత దృష్టి సారించే దిశగా విప్రో తన ఎకో ఎనర్జీ వ్యాపార విభాగాన్ని 70 మిలియన్ డాలర్ల (రూ.469 కోట్లు)కు చుబ్ అల్బా కంట్రోల్ సిస్టమ్స్‌కు విక్రరుుంచనున్నట్టు తెలిపింది. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ యునెటైడ్ టెక్నాలజీస్ కార్పొరేషన్ (యూటీసీ)కు పరోక్ష అనుబంధ సంస్థే చుబ్ అల్బా. ‘‘ప్రధాన ఐటీ వ్యాపారంపై మరింత దృష్టి సారించిన నేపథ్యంలో అందులో భాగం కాని ఎకో ఎనర్జీ వ్యాపార నుంచి వైదొలగాలని నిర్ణరుుంచినట్టు విప్రో వెల్లడించింది. ఈ డీల్ 2017 ప్రథమార్థంలో పూర్తి అవుతుందని తెలిపింది. ⇔ రెండు కంపెనీలుగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్! ఇటీవలి కాలంలో పలు వివాదాల్లో నలుగుతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీని రెండుగా విడగొట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఉత్పత్తి .. నిర్వహణకు ఒక సంస్థను, హోల్డింగ్ కంపెనీగా మరొకదాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు దాదాపు ఆరు నెలల సమయం పట్టొచ్చని శాంసంగ్ వివరించింది. ⇔ ఈటీఎఫ్‌ల్లో రూ.9,723 కోట్ల ఈపీఎఫ్‌వో పెట్టుబడులు ఈ ఏడాది అక్టోబర్ వరకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లలో రూ.9,723 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. వీటిపై రాబడి 9.17 శాతంగా ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకుల నేపథ్యంలో ఆ ప్రభావం నుంచి తట్టుకునేందుకు నిఫ్టీ, సెన్సెక్స్ ఈటీఎఫ్‌లలో ఈ మేరకు పెట్టుబడి పెట్టినట్టు పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో వద్ద ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం రూ.7.49 లక్షల కోట్ల నిధులు ఉన్నట్టు వెల్లడించారు. ఈపీఎఫ్‌వో గతేడాది ఆగస్ట్ నుంచి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ⇔ సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 7.3 శాతం భారత్ మరోసారి ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచింది. దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో 7.3 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంతో పోలిస్తే క్షీణించినట్టు తెలుస్తోంది. అరుుతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే సానుకూల వృద్ధి నమోదైంది. సాగు రంగంలో ఆశాజనక పరిస్థితులు, సేవలు, వాణిజ్య రంగాల పనితీరు మెరుగవడం వృద్ధి రేటు పెరగడానికి తోడ్పడింది. నోట్ల రద్దు ప్రభావంతో మూడో త్రైమాసికంలో ఈ స్థారుులో వృద్ధి రేటు కొనసాగకపోవచ్చనే అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ⇔ వృద్ధి రేటును ఒక శాతం తగ్గించిన క్రిసిల్ ట్ల రద్దు కారణంగా ఆర్థిక రంగం కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందన్న ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్... దేశ జీడీపీ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతంలో వేసిన అంచనా 7.9 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది. అదే సమయంలో వినియోగధరల ఆధారిత ద్రవ్యోల్బణం సైతం అంచనా వేసిన 5 శాతం కంటే తక్కువగా 4.7 శాతంగా ఉంటుందని తెలిపింది. డీమానిటైజేషన్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నట్టు ఆర్థిక సేవల సంస్థ నోమురా తెలిపింది. ఇక బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ సైతం ఇదే విధమైన అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.9 శాతానికి దిగి వస్తుందని తెలిపింది. ⇔ రూ. 4 లక్షల కోట్లకు ద్రవ్య లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో ద్రవ్య లోటు రూ. 4.23 లక్షల కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అంచనాల్లో ఇది 79.3 శాతం. గతేడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో ద్రవ్య లోటు బడ్జెట్ అంచనాల్లో 74 శాతమే. ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్య లోటు 2016-17లో సుమారు రూ. 5.33 లక్షల కోట్లు (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 3.5 శాతం)గా ఉండొచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. ⇔ బ్రాండెడ్ బంగారు కాయిన్లపై ఎక్సైజ్ సుంకం ఎత్తివేత బ్రాండెడ్ బంగారు కారుున్లపై ఉన్న ఒక శాతం ఎకై ్సజ్ డ్యూటీని కేంద్రం ఎత్తివేసింది. 99.5 శాతం అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన బ్రాండెడ్ బంగారు కారుున్లపై ఎకై ్సజ్ డ్యూటీ ఇకపై ఉండదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎకై ్సజ్ అండ్ కస్టమ్స్ తన నోటిఫికేషన్లో పేర్కొంది. వెండి కారుున్లకు ఉన్న ఎకై ్సజ్ డ్యూటీ మినహారుుంపు కొనసాగుతుందని తెలిపింది. ఇక, బంగారం, వెండి ఆభరణాల తయారీదారులు తయారు చేసే ప్రీషియస్ మెటల్ లేదా మెటల్ ఆధారిత వస్తువులపై మాత్రం ఒక శాతం ఎకై ్సజ్ డ్యూటీ కొనసాగుతుందని వెల్లడించింది. -
బంగారు నాణేల విక్రయానికి ఎస్బీఐతో ఎంఎంటీసీ జట్టు!
వదోదర: ప్రభుత్వ తయారీ బంగారు కారుున్ల విక్రయానికి ఎస్బీఐతో ఒప్పందం చేసుకోనున్నట్టు ఎంఎంటీసీ చైర్మన్ వేద్‌ప్రకాశ్ తెలిపారు. ఎంఎంటీసీ ఇప్పటికే డజను బ్యాంకులతో ఈ విధంగా టైఅప్ అరుు్య లక్ష కారుున్లను విక్రరుుంచినట్టు ఆయన చెప్పారు. వచ్చే కొన్నేళ్లలో 5 లక్షల కారుున్ల విక్రయాన్ని లక్ష్యంగా విధించుకున్నట్టు తెలిపారు. ఎంఎంటీసీ 5 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాముల పరిమాణంలో కారుున్లను విక్రరుుస్తోంది. -
టాస్ కోసం ప్రత్యేక కాయిస్,ప్రత్యేక క్యాప్