
లండన్: ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు నాణేన్ని లండన్‌లోని ‘ద రాయల్ మింట్’ టంక శాల తయారుచేసింది. దీని బరువు సుమారు 7 కిలోలు. జేమ్స్‌బాండ్ 25వ చిత్రం త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఈ ప్రత్యేక నాణేన్ని రూపొందించారు. రాయల్ మింట్ గడిచిన 1,100 సంవత్సరాలలో ఇంత బరువైన, ముఖవిలువ కలిగిన కాయిన్‌ను తయారుచేయడం ఇదే మొదటిసారి. ఇది 185 మిల్లీమీటర్ల పొడవు కలిగి ఉంది. దీని వాస్తవ ధరను రాయల్ మింట్ వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment