హ్యాట్సాఫ్‌.. దినేష్‌ కార్తీక్‌ | Virat Kohli Message For Dinesh Karthik | Sakshi
Sakshi News home page

డీకేపై ప్రశంసల వర్షం..

Published Mon, Mar 19 2018 12:13 PM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

Virat Kohli Message For Dinesh Karthik - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌: నిదహాస్‌ ట్రోఫీ గెలిచేందుకు హోరాహోరీగా సాగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో తన అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చిన దినేశ్‌ కార్తిక్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్న డీకేపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు, సహ ఆటగాళ్లు అతడిని పొగడ్తల్లో ముంచెత్తారు. ‘యూ బ్యూటీ’ అంటూ డీకేను యువరాజ్‌ సింగ్‌ పొడిగాడు. ఒత్తిడిలోనూ గొప్పగా ఆడి జట్టుకు విజయాన్ని అందించిన దినేష్‌ కార్తీక్‌కు శిఖర్‌ ధవన్‌ హ్యాట్సాఫ్‌ చెప్పాడు.

టీమిండియా అద్భుత విజయం సాధించిందని, దినేష్‌ కార్తీక్‌ బ్యాటింగ్‌ సూపర్బ్‌గా ఉందని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ట్వీట్‌ చేశాడు. రోహిత్‌ శర్మ గొప్ప ఇన్నింగ్స్‌లో జట్టు విజయానికి బాటలు వేశాడని మెచ్చుకున్నాడు. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌ ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని కలిగించిందన్నాడు.

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి..‘ రాత్రి జరిగిన మ్యాచ్‌ అద్భుతం.. దీనికి ఆటగాళ్ల సమష్ఠి కృషే కారణం.. వెల్‌డన్‌ డీకే’ అంటూ ట్వీట్‌ చేశాడు. నిదహాస్‌ ట్రోఫీకి దూరంగా ఉన్నప్పటికీ మ్యాచ్‌లన్నీ వీక్షిస్తూ కోహ్లి తన సహచరులను ఉత్సాహపరుస్తూనే ఉన్నాడు. 

బంగ్లాదేశ్‌తో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం కోసం 3 ఓవర్లలో 35 పరుగులు అవసరమైన క్లిష్ట పరిస్థితుల్లో.. 8 బంతుల్లో 29 పరుగులు చేసి దినేశ్‌ కార్తీక్‌ బ్యాట్‌తో అద్భుతం చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement