
రోహిత్ శర్మ
సాక్షి, స్పోర్ట్స్ : శ్రీలంక వేదికగా నేటి(మంగళవారం) నుంచి ట్రై నేషన్ (భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక) నిదాహస్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ట్రైసిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ భారత్-శ్రీలంక మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ చూడడానికి ఓ 10 కారణాలు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లు లేకుండా యువభారత్ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.
1. ప్రేమదాసు స్టేడియంలో బ్యాట్స్‌మన్ అత్యధిక స్కోరు 99 (నాటౌట్). (అఫ్ఘనిస్తాన్‌పై లూక్‌రైట్ 2012లో నమోదు చేశాడు)
2. ఈ వేదికలో (4/12) బెస్ట్ బౌలింగ్ హర్బజన్ సింగ్, అజంతా మెండీస్‌ల పేరిట ఉంది. 2012లో హర్భజన్ ఇంగ్లండ్‌పై, మెండీస్ వెస్టిండీస్‌పై సాధించారు.
3. అత్యధిక ఛేదన 173 పరుగులే. 2015లో శ్రీలంకపై పాకిస్తాన్ ఈఘనతను సాధించింది.
4. తొలి సారి (భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక) ట్రై నేషన్ టీ20 సిరీస్ జరుగుతోంది.
5. బంగ్లాదేశ్, శ్రీలంకలతో భారత్ ఆడిన గత 7 టీ20లకు 7 గెలిచింది.
6.మరో 42 పరుగులు చేస్తే టీ20ల్లో 500 పరుగులు చేసిన 8వ భారత బ్యాట్స్‌మన్‌గా కేఎల్ రాహుల్ గుర్తింపు పొందనున్నాడు.
7. మరో 104 పరుగులు చేస్తే టీ20ల్లో 1500 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత బ్యాట్స్‌మన్‌గా సురేశ్ రైనా రికార్డు నమోదు చేయనున్నాడు. అంతకు ముందు కోహ్లి(1983), రోహిత్ (1679)లు ఈ ఘనతను సొంతం చేసుకున్నారు.
8. టీ20ల్లో శ్రీలంక పై భారత్ విన్నింగ్ పర్సెంట్ 71.43 శాతం
9. ఇక ఈ వేదికలో శ్రీలంక 14 మ్యాచుల్లో కేవలం 2 మాత్రమే గెలిచింది.
10 ఆసియాలో 50 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత్ 35 గెలిచి 15 మాత్రమే ఓడింది.