
రోహిత్ శర్మ
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా తాత్కలిక కెప్టెన్ రోహిత్ శర్మ మరో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో పేలవ ఫామ్‌తో సతమతమైన రోహిత్ తాజా ట్రైసిరీస్‌లో సైతం దారుణంగా విఫలమయ్యాడు. నిదహాస్ ట్రోఫీలో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన రోహిత్ గత ఐదేళ్లలో అత్యధిక డకౌట్‌లు అయిన భారత ఆటగాడిగా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. మార్చి 6, 2013 నుంచి ఇప్పటి వరకు జరిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో రోహిత్ 12 సార్లు డకౌట్ అయ్యాడు.
ఈ క్రమంలో ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ రికార్డును సమం చేశాడు. 11 డక్‌లతో పేసర్ భువనేశ్వర్ కుమార్ వీరి తర్వాతి స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలోనే రోహిత్ టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత క్రికెటర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇక టీ20ల్లో రోహిత్‌కు ఇది ఐదో డకౌట్. 68 టీ20 ఇన్నింగ్స్‌లలో రోహిత్ 5 సార్లు డకౌట్ కాగా, ఆ తర్వాతి స్థానాల్లో మూడేసి డక్‌లతో ఆశిష్ నెహ్రా, యూసుఫ్ పఠాన్‌లు కొనసాగుతున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనలో విఫలమైనా.. తాజా సిరీస్‌లో రాణిస్తాడని ఎదురు చూసిన అభిమానులకు రోహిత్ నుంచి నిరాశే ఎదురైంది. ఇక తొలి మ్యాచ్‌లో భారత్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గురువారం బంగ్లాదేశ్‌తో భారత్ రెండో టీ20 ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment