దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో విధ్వంసకర సెంచరీతో చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్.. 48 గంటల తిరగకముందే ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసి మంచి జోష్ మీదన్న శాంసన్ ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లోను అదే జోరును కొనసాగిస్తాడని అంతా భావించారు.
కానీ ఈ మ్యాచ్‌లో సంజూ తీవ్ర నిరాశపరిచాడు. మూడు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు డకౌటైన భారత ప్లేయర్‌గా శాంసన్ చెత్త రికార్డు నెలకొల్పాడు.
నాలుగో 'సారీ'..
ఈ ఏడాది టీ20ల్లో శాంసన్ డకౌట్ కావడం ఇది నాలుగో సారి. ఈ ఏడాది ఆరంభంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటైన సంజూ.. ఆ తర్వాత జూలైలో శ్రీలంకపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. గతంలో రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు యూసఫ్ పఠాన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ప్రోటీస్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది.
చదవండి: చాలా గర్వంగా ఉంది.. ఈ రోజు కోసమే అతడు ఎంతో కష్టపడ్డాడు: సూర్య
Comments
Please login to add a commentAdd a comment