![Dinesh Karthik Says Comparisons With Dhoni Is Unfair - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/20/Dinesh-Kartik.jpg.webp?itok=egBYuNkW)
దినేశ్ కార్తిక్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, స్పోర్ట్స్ : సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో తనకు పోలిక తగదని టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. నిదహాస్ ట్రోఫీలో ఈ స్టార్ వికెట్ కీపర్ చివరి బంతిని సిక్సు బాది భారత్‌కు విజయాన్నందించిన విషయం తెలిసిందే. దీంతో కార్తీక్ సూపర్ హీరో అయ్యాడు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. స్టార్ వికెట్ కీపర్, మ్యాచ్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనితో తనను పోల్చవద్దన్నాడు.
ధోని ప్రయాణం, తన ప్రయాణం వేర్వేరని, అతను యూనివర్సిటీ టాపర్ అయితే తాను ఆ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని మాత్రమేనన్నాడు. తనకు ఆ అవకాశమే గొప్పదని చెప్పుకొచ్చాడు. అందరి నోట నాపేరు రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తన తల రాత బాగుండటంతోనే ఆ సిక్సు కొట్టగలిగానని, రెండు మిల్లీమీటర్ల వ్యత్యాసంలోని సిక్సు పడిందని గుర్తు చేశాడు. గత రెండేళ్లుగా అభిషేక్ నాయర్ తన కెరీర్‌కు ఎంతో సాయం చేశాడని ఈ తమిళ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.
శంకర్ బ్యాటింగ్‌పై స్పందిస్తూ.. అతను మంచి నైపుణ్యం ఉన్న ఆల్‌రౌండర్ అని, బౌలర్‌గా అద్భుతంగా రాణించాడని, కానీ బ్యాటింగ్లోచాలా ఒత్తిడికి లోనయ్యాడని అభిప్రాయపడ్డాడు. శంకర్‌కు మంచి భవిష్యత్తుందని, తనలో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయని, అవే తాను చాలా రోజులు ఆడేలా చేస్తాయన్నారు. ఇక ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్‌గా వ్యవహరించేందుకు ఉవ్విళ్లూరుతున్నానని, ఈ అద్భుత టోర్నమెంట్ తనకెంతో ముఖ్యమని కార్తీక్ తెలిపాడు. ఇక ఈ సీజన్‌లో కార్తీక్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment