గెలిపించింది దినేశ్‌ కాదు.. ధోనీనే | Dhoni - Dinesh Karthik Memes Trending on Social Media
Sakshi News home page

గెలిపించింది దినేశ్‌ కాదు.. ధోనీనే!

Published Mon, Mar 19 2018 1:39 PM | Last Updated on Mon, Mar 19 2018 2:41 PM

INDvBAN When Dinesh Removes Mask Of Dhoni - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌: ఆల్‌టైమ్‌ గ్రేట్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఘనత గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. టీమ్‌లో ఉన్నా, లేకున్నా చర్చలోకి మహీని లాగాల్సిందే! నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్‌ చిత్తుచేసిన సందర్భంలోనూ ధోనీ ఉన్నాడు. అవును. కీపింగ్‌తోపాటు మ్యాచ్‌ ఫినిషింగ్‌ బాధ్యతలు కూడా తీసుకున్న దినేశ్‌లో ధోనీని చూసుకుంటున్నారు అభిమానులు. చిరునవ్వులు చిందిస్తోన్న దినేశ్‌ను కట్టేసి, ముసుగు తీస్తే ధోనీ కనిపిస్తాడనే అర్థంతో రూపొందిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతోంది.


అందుకు తగ్గట్లే కార్తీక్‌ కూడా ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘బహుశా నాకీ శక్తి అతని నుంచే వచ్చి ఉండొచ్చు. ఎంతటి క్లిష్టసమయాల్లోనైనా టెన్షన్‌ లేకుండా, కామ్‌గా ఉండగలగడం ఒక్క ధోనీకే సాధ్యమైంది. మ్యాచ్‌ను విజయవంతంగా ఫినిష్‌ చెయ్యడం ధోనీ నుంచే నేర్చుకున్నాను. నేనేకాదు ప్రతిఒక్కరూ ధోనీ నుంచి తెల్సుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది..’ అని డీకే చెప్పాడు.

నాగిని డ్యాన్స్‌ ఎక్స్‌టెండ్‌ అయితే.. : మధ్యలో ఆసీస్‌-సఫారీల మధ్య మాటల యుద్ధాలు, గిల్లికజ్జాలను క్రీడాభిమానులు మర్చిపోకముందే నిదహాస్‌ టీ20 ట్రోఫీలోనూ ఉద్వేగ పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఆతిథ్య శ్రీలంకలో మ్యాచ్‌ సందర్భంగా బంగ్లాదేశ్‌ ప్లేయర్లు చేసిన నాగిని డ్యాన్స్‌కు క్రీడాలోకం విపరీతంగా కనెక్ట్‌ అయిపోయింది. నిన్నటి ఫైనల్స్లోనూ బంగ్లా వ్యతిరేకులు కొందరు.. పాములా బుసకొట్టడం చూశాం. ఇక మ్యాచ్‌ తర్వాతైతే సోషల్‌ మీడియా నిండా నాగిని ఫొటోలే! సరదాగా రూపొందించిన ఆ ఫొటోల్లో కొన్ని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement