
ఎంఎస్ ధోని, చికాగో చాచా (ఫైల్ ఫొటో)
సాక్షి, స్పోర్ట్స్ : తన భార్య కంటే టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనియే ఎక్కువ ఇష్టమని పాకిస్తాన్ అభిమాని మహ్మద్ బషీర్ అకా (చికాగో చాచా) అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌కు చెందిన చాచా చికాగోలో నివసిస్తున్నారు. నిదహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకకు వచ్చిన చాచా, భారత వీరభిమాని సుధీర్, బంగ్లా అభిమాని షోయబ్ అలీలతో కలిసి మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఇక 2011 ప్రపంచకప్ సెమీఫైనల్ వరకు ధోని ఎవరో తనకు తెలియదని ఈ వీరాభిమాని చెప్పుకొచ్చారు.
‘2011 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ కోసం నేను మోహాలీ చేరుకున్నాను. మ్యాచ్ టికెట్లు లేవని చెప్పారు. నాకు మ్యాచ్ చూడాలని ఉందని ప్లకార్డు ప్రదర్శించాను. ఓ వ్యక్తి టికెట్స్ ఉన్న కవర్ తీసుకొచ్చి ఇస్తూ.. ఈ టికెట్లు ధోని పంపించాడని తెలిపాడు. నిజంగా అప్పటికి ధోని ఎవరో కూడా నాకు తెలియదు. ఆ టికెట్స్‌తో మ్యాచ్‌ను ఆస్వాదించాను. అప్పటి నుంచి ధోనిని నాభార్య కన్నా ఎక్కువ ఇష్ట పడుతున్నాను.’ అని తెలిపారు. ఆ క్షణం నుంచి భారత్ మ్యాచ్‌లు చూస్తూనే ఉన్నానన్నారు.
‘అయితే చాలా మంది భారత్‌కు ఎందుకు మద్దతిస్తున్నావని అడిగారు. వారికి ఒక్కటే చెప్పా మీరు ఎక్కువ ప్రేమను భారత్ నుంచే పొందగలరు అని. వృద్ధులంతా భారత్ శత్రుదేశం అని యువకులకు నూరిపోశారు. ఇది అంత మంచిది కాదు అని’ చాచా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment