టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్‌కు ఊరట విజయం లభించింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 3 వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది.
అయితే ఈ మ్యాచ్‌లో 30 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా బాబర్ రికార్డులకెక్కాడు.
పొట్టి ప్రపంచకప్‌లో బాబర్ ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్‌లలో 549 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని 29 ఇన్నింగ్స్‌లలో 529 పరుగులు చేశాడు.
తాజా మ్యాచ్‌తో ధోని ఆల్‌టైమ్ రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. ఇక ఈ జాబితాలో బాబర్, ధోని తర్వాత కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(527) ఉన్నాడు. కాగా ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కనబరిచింది.
అమెరికా వంటి పసికూనపై ఓటమి పాలై సూపర్-8కు చేరే అవకాశాలను పాక్ కోల్పోయింది. ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో పాక్ విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment