సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున క్రికెటర్ విజయ్ శంకర్‌ను తిట్టకుండా.. దినేశ్ కార్తీక్‌ను పొగడుకుండా ఉండని అభిమాని ఉండకపోవచ్చు. ఎందుకంటే సులువుగా గెలిచే మ్యాచ్‌ను ఓటమి అంచుకు శంకర్ తీసుకరాగ.. ఇక ఓటమి ఫిక్స్ అనుకున్న తరుణంలో మ్యాచ్‌ను గెలిపించి అభిమానుల ముఖంలో చిరునవ్వు కలిగిలే చేశాడు దినేశ్ కార్తీక్. నిదహాస్ ట్రోఫి ఫైనల్ మ్యాచ్‌లో చివరి బంతికి సిక్సర్ కొట్టి బంగ్లాదేశ్ నుంచి మ్యాచ్‌ను, టీమిండియా పరువును దినేశ్ కార్తీక్ కాపాడిన విషయం తెలిసిందే.