సారథిగా, ఆటగాడిగా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు ఎంఎస్ ధోని. బెస్ట్ ఫినిషర్‌గా, గొప్ప నాయకుడిగా పేరు గాంచిన ధోని మైదానంలో చాలా ఆక్టీవ్‌గా, అలర్ట్‌గా ఉంటాడు. టీమిండియా సారథ్య బాధ్యతలు కోహ్లికి అప్పగించినప్పటికీ మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేస్తూ, బౌలర్లకు సలహాలు ఇస్తుంటాడు. ప్రస్తుత టీమిండియా సారథి కోహ్లి కూడా ధోని సూచనలను కాదనకుండా పాటిస్తాడు. ఇక టీమిండియా ఆటగాళ్లే కాకుండా ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా ధోని సూచనలను పాటిస్తున్నారు.