Shabbir Rahman
-
బంగ్లా ఫీల్డింగ్ సెట్ చేసిన ధోని
కార్డిఫ్: సారథిగా, ఆటగాడిగా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు ఎంఎస్ ధోని. బెస్ట్ ఫినిషర్‌గా, గొప్ప నాయకుడిగా పేరు గాంచిన ధోని మైదానంలో చాలా ఆక్టీవ్‌గా, అలర్ట్‌గా ఉంటాడు. టీమిండియా సారథ్య బాధ్యతలు కోహ్లికి అప్పగించినప్పటికీ మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేస్తూ, బౌలర్లకు సలహాలు ఇస్తుంటాడు. ప్రస్తుత టీమిండియా సారథి కోహ్లి కూడా ధోని సూచనలను కాదనకుండా పాటిస్తాడు. ఇక టీమిండియా ఆటగాళ్లే కాకుండా ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా ధోని సూచనలను పాటిస్తున్నారు. ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఈ విచిత్రం చోటుచేసుకుంది. కార్డిఫ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 40వ ఓవర్లో బౌలర్ షబ్బీర్ రహ్మాన్ బౌలింగ్ చేస్తుండగా.. క్రీజులో ఉన్న ధోని బౌలర్‌ను ఆపి ఒక సారి ఫీల్డింగ్ చూసుకోమన్నాడు. మిడ్ వికెట్లో ఉన్న ఫీల్డర్‌ను స్వేర్ లెగ్‌కు మార్చమని సలహా ఇచ్చాడు. అయితే ధోని చెప్పడంతో షబ్బీర్ ఏ మాత్రం ఆలోచించకుండా కనీసం కెప్టెన్‌కు చెప్పకుండానే ఫీల్డర్‌ను మార్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ‘ధోని చెబితే ప్రత్యర్థి జట్లు కూడా వినాల్సిందే’, ‘ధోని మీద నమ్మకంతో ఫీల్డింగ్ మార్చిన షబ్బీర్‌కు హ్యాట్సాఫ్’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : బ్యాటింగ్ చేస్తూ.. బంగ్లా ఫీల్డింగ్ సెట్ చేసిన ధోని ఇక బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ (99 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెటరన్ ధోని (78 బంతుల్లో 113; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకాలతో మెరిశారు. ఫలితంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా 95 పరుగుల తేడాతో గెలుపొందింది. -
బ్యాటింగ్ చేస్తూ.. బంగ్లా ఫీల్డింగ్ సెట్ చేసిన ధోని
-
నీకంత సీన్ లేదు..!
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఆటగాడు షబ్బిర్ రెహ్మాన్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భాగంగా బంగ్లాదేశ్ ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో షబ్బిర్ అర్థ శతకంతో జట్టును ఆదుకున్నాడు. అయితే షబ్బిర్ బ్యాటింగ్ పై ఆసీస్ స్పిన్నర్ నాధన్ లయన్ ప్రశంసలు కురింపించాడు. షబ్బిర్ బ్యాటింగ్ ను చూస్తుంటే తనకు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి బ్యాటింగ్ గుర్తుకొ్చ్చిందంటూ లయన్ కొనియాడాడు. గతంలో భారత్ లో ఆసీస్ పర్యటన సందర్భంగా విరాట్ నుంచి ఎదురైన ప్రతిఘటన షబ్బిర్ లో కనబడిందన్నాడు. ఇదిలా ఉంచితే, లయన్ కామెంట్ పై షబ్బిర్ తనదైన శైలిలో స్పందించాడు. 'నేను విరాట్ కోహ్లి స్థాయి ఆటగాడ్ని కాగలను. తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. కాకపోతే అతనితో నేను పోల్చుకోదలుచుకోలేదు. జట్టుకు అవసరమైన పరుగుల్ని సాధించడమే నాకు ముఖ్యం' అని షబ్బిర్ వ్యాఖ్యానించాడు. దీనిపై విమర్శలు వర్షం కురుస్తోంది. షబ్బిర్.. నీ కంత సీన్ లేదంటూ ట్విట్టర్ లో నెటిజన్లు మండిపడుతున్నారు. నువ్వు విరాట్ కోహ్లి స్థాయి ఆటగాడివైతే ఇక మనం భూమిని విడిచే సమయం ఆసన్నమైనట్లే అంటూ ఛలోక్తులు విసురుకుంటున్నారు. ఇది చాలా మంచి జోక్ అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, ఇక ఈ భూగ్రహం ఎంతమాత్రం మనం నివసించడానికి సేఫ్ గా లేనట్టేనని మరొకరు విమర్శించారు. -
తమీమ్ తడాఖా
ఒమన్‌పై విజయంతో ప్రధాన టోర్నీకి బంగ్లాదేశ్ ధర్మశాల: తమీమ్ ఇక్బాల్ (63 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో... బంగ్లాదేశ్ టి20 ప్రపంచకప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. ఆదివారం జరిగిన కీలక క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 54 పరుగులు తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) ఒమన్‌పై నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 2 వికెట్లకు 180 పరుగులు సాధించింది. సౌమ్య సర్కార్ (12) విఫలమైనా... తమీమ్ వీరవిహారం చేశాడు. షబ్బీర్ రెహమాన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 9.1 ఓవర్లలో 97; షకీబ్ (9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 4 ఓవర్లలో అజేయంగా 41 పరుగులు జత చేశాడు. లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఇన్నింగ్స్‌కు ఏడు ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 16 ఓవర్లలో 152 పరుగులుగా సవరించారు. ఆ తర్వాత మరోసారి వరుణుడు ప్రతాపం చూపడంతో లక్ష్యాన్ని 12 ఓవర్లలో 120 పరుగులుగా మార్చారు. చివరకు ఒమన్ 12 ఓవర్లలో 9 వికెట్లకు 65 పరుగులు చేసింది. జితేందర్ సింగ్ (25) మినహా మిగతావారు నిరాశపర్చారు. షకీబ్ 4 వికెట్లు తీశాడు. నెదర్లాండ్స్‌కు ఊరట మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 12 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 6 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 6 ఓవర్లలో 5 వికెట్లకు 59 పరుగులు చేసింది. మైబర్గ్ (27), బోరెన్ (14)లు రాణించారు. డాక్రిల్ 3 వికెట్లు తీశారు. తర్వాత ఐర్లాండ్ 6 ఓవర్లలో 7 వికెట్లకు 47 పరుగులు మాత్రమే సాధించింది. స్టిర్లింగ్ (15) టాప్ స్కోరర్. మికెరెన్ 4 వికెట్లు తీశాడు. -
రెండు మ్యాచ్‌లూ రద్దు
ధర్మశాల: భారీ వర్షం కారణంగా టి20 ప్రపంచకప్‌లో శుక్రవారం జరగాల్సిన రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లూ రద్దయ్యాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఒమన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత వర్షం రావడంతో మైదానం చిత్తడిగా మారడంతో ఒక్క బంతి కూడా సాధ్యపడలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా పరిణామంతో నెదర్లాండ్స్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించడంలో విఫలమైంది. మరోవైపు బంగ్లాదేశ్, ఐర్లాండ్ల మధ్య మ్యాచ్ ఆలస్యంగా మొదలైనా.. మధ్యలో వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 8 ఓవర్లలో 2 వికెట్లకు 94 పరుగులు చేసింది. తమీమ్ (47), సౌమ్య సర్కార్ (20), షబ్బీర్ రెహమాన్ (13 నాటౌట్) రాణించారు. ఈ దశలో భారీ వర్షం రావడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. శనివారం జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్‌ల్లో జింబాబ్వేతో అఫ్ఘానిస్తాన్; హాంకాంగ్‌తో స్కాట్లాండ్ తలపడతాయి. -
ఆసియా కప్ విజేత భారత్
-
ఆసియాను గెలిచాం 'ప్రపంచం' మిగిలింది
⇒ భారత్‌దే ఆసియాకప్ ⇒ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల విజయం ⇒ రాణించిన ధావన్, కోహ్లి అదే జోరు... ఆసియాకప్‌లో తొలి మ్యాచ్ నుంచి ప్రత్యర్థులకు కనీసం పోటీ ఇచ్చే అవకాశం కూడా లేకుండా చెలరేగిపోయిన ధోనిసేన... ఫైనల్లోనూ చెలరేగింది. స్ఫూర్తిదాయక ఆటతీరుతో సొంతగడ్డపై ఫైనల్ వరకూ వచ్చిన బంగ్లా పులులను భారత్ అలవోకగా వేటాడింది. ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ఆడి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, యూఏఈ... ఇలా ఈ ఏడాదిఎదురైన ప్రతి ప్రత్యర్థినీ చిత్తు చేసిన ధోనిసేన... ఇక సొంతగడ్డపై ప్రపంచాన్ని గెలవడమే మిగిలింది. మిర్పూర్: ఆసియాకప్ ఆసాంతం నిలకడగా ఆడి, ఓటమి లేకుండా చెలరేగిన భారత్ ఫైనల్లోనూ అదే జోరు చూపించింది. సొంతగడ్డపై, అభిమానుల అండతో సంచలనం సృష్టించాలనుకున్న బంగ్లాదేశ్ ఆశలు నెరవేరలేదు. శిఖర్ ధావన్ (44 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి (28 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు)ల సమయోచిత బ్యాటింగ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో 15 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 15 ఓవర్లలో 5 వికెట్లకు 120 పరుగులు చేసింది. మహ్మదుల్లా (13 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), షబ్బీర్ రెహమాన్ (29 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) చెలరేగి ఆడారు. తర్వాత భారత్ 13.5 ఓవర్లలో 2 వికెట్లకు 122 పరుగులు చేసి నెగ్గింది. ధోని (6 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, షబ్బీర్ రెహమాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డులు లభించాయి. ఆఖర్లో హవా కొత్త బంతిని అశ్విన్ చేతికి ఇచ్చిన ధోని.. బంగ్లా ఓపెనర్లు తమీమ్ (13), సౌమ్య (14)లను కట్టడి చేయగా, తర్వాతి ఓవర్లలో నెహ్రా, బుమ్రాలు ఒత్తిడిని కొనసాగించారు. దీంతో తొలి మూడు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే వచ్చాయి. ఒత్తిడిని అధిగమించేందుకు నాలుగో ఓవర్లో సౌమ్య వరుసగా రెండు ఫోర్లు బాదినా... ఆఖరి బంతికి అవుటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే బుమ్రా అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో తమీమ్‌ను వెనక్కి పంపాడు. దీంతో బంగ్లా స్కోరు 30/2కు చేరుకుంది. ఈ దశలో షబ్బీర్, షకీబ్ (21)లు నిలకడగా ఆడారు. అవకాశం వచ్చినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 34 పరుగులు జత చేశాక షకీబ్‌ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. ఇక 12వ ఓవర్లో ముష్ఫికర్ (4), మోర్తజా (0)లు వరుస బంతుల్లో అవుట్‌కావడం బంగ్లా 75 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత షబ్బీర్‌కు జత కలిసిన మహ్మదుల్లా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయి చివరి మూడు ఓవర్లలో 42 పరుగులు రాబట్టాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 20 బంతుల్లోనే 45 పరుగులు జోడించడంతో బంగ్లా మంచి స్కోరు సాధించింది. అశ్విన్, నెహ్రా, బుమ్రా, జడేజా తలా ఓ వికెట్ తీశారు. రోహిత్ విఫలమైనా... లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. అమిన్ బంతిని ఆడబోయి రోహిత్ (1) స్లిప్‌లో దొరికిపోయాడు. దీంతో భారత్ 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత ధావన్, కోహ్లిలు కాస్త జాగ్రత్తగా ఆడారు. అయితే ఐదు, ఆరు ఓవర్లలో ఆరు ఫోర్లతో 29 పరుగులు చేసి జోరు పెంచారు. తర్వాత స్పిన్నర్ నాసిర్ హుస్సేన్ కట్టడి చేసినా... మోర్తజా ఓవర్లో ధావన్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్‌లో భారీ సిక్సర్ బాదడంతో పది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 71/1కి చేరింది. ఈ క్రమంలో ధావన్ 11వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 12వ ఓవర్లో కోహ్లి... మూడు బౌండరీలతో నాసిర్‌కు చుక్కలు చూపెట్టాడు. ఇక 18 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో ధావన్ కొట్టిన బలమైన షాట్‌ను పాయింట్లో సౌమ్య అద్భుతంగా అందుకున్నాడు. దీంతో రెండో వికెట్‌కు 67 బంతుల్లో 94 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక 12 బంతుల్లో 19 పరుగులు కావాల్సిన దశలో ధోని మెరుపులు మెరిపించాడు. అమిన్ వేసి న 14వ ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు. ధోని, కోహ్లి మూడో వికెట్‌కు 7 బంతుల్లో అజేయంగా 23 పరుగులు జత చేశారు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ ఎల్బీడబ్ల్యు (బి) బుమ్రా 13; సౌమ్య సర్కార్ (సి) పాండ్యా (బి) నెహ్రా 14; షబ్బీర్ నాటౌట్ 32 ; షకీబ్ (సి) బుమ్రా (బి) అశ్విన్ 21; ముష్ఫికర్ రనౌట్ 4; మోర్తజా (సి) కోహ్లి (బి) జడేజా 0; మహ్మదుల్లా నాటౌట్ 33; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (15 ఓవర్లలో 5 వికెట్లకు) 120. వికెట్ల పతనం: 1-27; 2-30; 3-64; 4-75; 5-75. బౌలింగ్: అశ్విన్ 3-0-14-1; నెహ్రా 3-0-33-1; బుమ్రా 3-0-13-1; జడేజా 3-0-25-1; పాండ్యా 3-0-35-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సౌమ్య (బి) అల్ అమిన్ 1; ధావన్ (సి) సౌమ్య (బి) తస్కిన్ 60; కోహ్లి నాటౌట్ 41; ధోని నాటౌట్ 20; మొత్తం: (13.5 ఓవర్లలో 2 వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1-5; 2-99. బౌలింగ్: తస్కిన్ అహ్మద్ 3-0-14-1; అల్ అమిన్ 2.5-0-30-1; అబు హైదర్ 1-0-14-0; షకీబ్ 2-0-26-0; మోర్తజా 2-0-16-0; నాసిర్ హుస్సేన్ 3-0-22-0. -
భళా... బంగ్లాదేశ్
శ్రీలంకపై సంచలన విజయం షబ్బీర్ సూపర్ బ్యాటింగ్ ఆసియా కప్ మిర్పూర్: సొంతగడ్డపై బంగ్లాదేశ్ క్రికెటర్లు మరోసారి రెచ్చిపోయారు. సమష్టి కృషితో తమకన్నా మెరుగైన ప్రత్యర్థికి అద్భుతంగా అడ్డుకట్ట వేశారు. భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయినా... నాణ్యమైన బౌలింగ్‌తో తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌ను చక్కగా కాపాడుకున్నారు. ఫలితంగా ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసింది. షబ్బీర్ రెహమాన్ (54 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోయాడు. షకీబ్ (34 బంతుల్లో 32; 3 ఫోర్లు), మహ్ముదుల్లా (12 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఆరంభంలో లంక బౌలర్ల ధాటికి బంగ్లా 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన షబ్బీర్ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు చెలరేగాడు. షకీబ్‌తో కలిసి ధాటిగా పరుగులు చేశాడు. నాలుగు, ఆరో ఓవర్లో వరుసగా 18, 12 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 3 వికెట్లకు 41 పరుగులకు చేరింది. ఏడో ఓవర్ నుంచి స్పిన్నర్లు రావడంతో పరుగుల వేగం కాస్త మందగించినా... 13వ ఓవర్లో షబ్బీర్ ఓ సిక్స్, రెండు ఫోర్లతో మళ్లీ జోరు పెంచాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ 16వ ఓవర్లో ఓ భారీ సిక్సర్ సంధించిన అతను ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. దీంతో షకీబ్, షబ్బీర్ మధ్య నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చివర్లో మహ్మదుల్లా మెరుగ్గా ఆడాడు. చమీరా 3 వికెట్లు తీశాడు. తర్వాత శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులకే పరిమితమైంది. చండిమల్ (37 బంతుల్లో 37; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. జయసూర్య (21 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఓ మాదిరిగా ఆడినా... మిగతా వారు నిరాశపర్చారు. దిల్షాన్ (12) విఫలం కావడంతో లంకకు సరైన శుభారంభం దక్కలేదు. మిడిలార్డర్లో ఒక్కరు కూడా మంచి భాగస్వామ్యాలను నమోదు చేయలేకపోయారు. దీనికితోడు రెండు వైపుల నుంచి బంగ్లా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో మ్యాథ్యూస్సేన కోలుకోలేకపోయింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: మిథున్ ఎల్బీడబ్ల్యు (బి) మ్యాథ్యూస్ 0; సౌమ్య సర్కార్ (సి) మ్యాథ్యూస్ (బి) కులశేఖర 0; షబ్బీర్ రెహమాన్ (సి) జయసూర్య (బి) చమీరా 80; ముష్ఫికర్ రహీమ్ రనౌట్ 4; షకీబ్ (సి) చండిమల్ (బి) చమీరా 32; మహ్ముదుల్లా నాటౌట్ 23; హసన్ (సి) మ్యాథ్యూస్ (బి) చమీరా 2; మోర్తజా రనౌట్ 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1-0; 2-2; 3-26; 4-108; 5-123; 6-140; 7-147. బౌలింగ్: మ్యాథ్యూస్ 3-0-8-1; కులశేఖర 4-0-44-1; తిసారా పెరీరా 1-0-14-0; జయసూర్య 3-0-21-0; హెరాత్ 4-0-24-0; దిల్షాన్ 1-0-5-0; చమీరా 4-0-30-3. శ్రీలంక ఇన్నింగ్స్: చండిమల్ (సి) తస్కిన్ (బి) మహ్మదుల్లా 37; దిల్షాన్ (సి) సర్కార్ (బి) షకీబ్ 12; జయసూర్య (స్టం) నూరుల్ హసన్ (బి) షకీబ్ 26; మ్యాథ్యూస్ (సి) షకీబ్ (బి) అల్ అమిన్ 12; తిసారా పెరీరా ఎల్బీడబ్ల్యు (బి) ముస్తాఫిజుర్ 4; సిరివర్ధన (సి) షబ్బీర్ (బి) మోర్తజా 3; షనక (సి) ముష్ఫికర్ (బి) అల్ అమిన్ 14; కపుగెడెర నాటౌట్ 12; కులశేఖర (సి) సౌమ్య సర్కార్ (బి) అల్ అమిన్ 0; చమీరా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1-20; 2-76; 3-78; 4-85; 5-92; 6-102; 7-116; 8-117. బౌలింగ్: తస్కిన్ అహ్మద్ 3-0-19-0; అమిన్ హుస్సేన్ 4-0-34-3; షకీబ్ 4-0-21-2; ముస్తాఫిజుర్ 4-0-19-1; మోర్తజా 3-0-17-1; మహ్ముదుల్లా 2-0-14-1.