భళా... బంగ్లాదేశ్ | Sri Lanka against Sensational win | Sakshi
Sakshi News home page

భళా... బంగ్లాదేశ్

Published Mon, Feb 29 2016 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

భళా... బంగ్లాదేశ్

భళా... బంగ్లాదేశ్

 శ్రీలంకపై సంచలన విజయం
 షబ్బీర్ సూపర్ బ్యాటింగ్  ఆసియా కప్

 
మిర్పూర్: సొంతగడ్డపై బంగ్లాదేశ్ క్రికెటర్లు మరోసారి రెచ్చిపోయారు. సమష్టి కృషితో తమకన్నా మెరుగైన ప్రత్యర్థికి అద్భుతంగా అడ్డుకట్ట వేశారు. భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయినా... నాణ్యమైన బౌలింగ్‌తో తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌ను చక్కగా కాపాడుకున్నారు. ఫలితంగా ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసింది. షబ్బీర్ రెహమాన్ (54 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోయాడు. షకీబ్ (34 బంతుల్లో 32; 3 ఫోర్లు), మహ్ముదుల్లా (12 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఆరంభంలో లంక బౌలర్ల ధాటికి బంగ్లా 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన షబ్బీర్ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు చెలరేగాడు.

షకీబ్‌తో కలిసి ధాటిగా పరుగులు చేశాడు. నాలుగు, ఆరో ఓవర్‌లో వరుసగా 18, 12 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 3 వికెట్లకు 41 పరుగులకు చేరింది. ఏడో ఓవర్ నుంచి స్పిన్నర్లు రావడంతో పరుగుల వేగం కాస్త మందగించినా... 13వ ఓవర్‌లో షబ్బీర్ ఓ సిక్స్, రెండు ఫోర్లతో మళ్లీ జోరు పెంచాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ 16వ ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ సంధించిన అతను ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. దీంతో షకీబ్, షబ్బీర్ మధ్య నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చివర్లో మహ్మదుల్లా మెరుగ్గా ఆడాడు. చమీరా 3 వికెట్లు తీశాడు.  


తర్వాత శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులకే పరిమితమైంది. చండిమల్ (37 బంతుల్లో 37; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. జయసూర్య (21 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఓ మాదిరిగా ఆడినా... మిగతా వారు నిరాశపర్చారు. దిల్షాన్ (12) విఫలం కావడంతో లంకకు సరైన శుభారంభం దక్కలేదు. మిడిలార్డర్‌లో ఒక్కరు కూడా మంచి భాగస్వామ్యాలను నమోదు చేయలేకపోయారు. దీనికితోడు రెండు వైపుల నుంచి బంగ్లా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో మ్యాథ్యూస్‌సేన కోలుకోలేకపోయింది.
 
స్కోరు వివరాలు
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: మిథున్ ఎల్బీడబ్ల్యు (బి) మ్యాథ్యూస్ 0; సౌమ్య సర్కార్ (సి) మ్యాథ్యూస్ (బి) కులశేఖర 0; షబ్బీర్ రెహమాన్ (సి) జయసూర్య (బి) చమీరా 80; ముష్ఫికర్ రహీమ్ రనౌట్ 4; షకీబ్ (సి) చండిమల్ (బి) చమీరా 32; మహ్ముదుల్లా నాటౌట్ 23; హసన్ (సి) మ్యాథ్యూస్ (బి) చమీరా 2; మోర్తజా రనౌట్ 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 147.

 వికెట్ల పతనం: 1-0; 2-2; 3-26; 4-108; 5-123; 6-140; 7-147.
బౌలింగ్: మ్యాథ్యూస్ 3-0-8-1; కులశేఖర 4-0-44-1; తిసారా పెరీరా 1-0-14-0; జయసూర్య 3-0-21-0; హెరాత్ 4-0-24-0; దిల్షాన్ 1-0-5-0; చమీరా 4-0-30-3.

శ్రీలంక ఇన్నింగ్స్: చండిమల్ (సి) తస్కిన్ (బి) మహ్మదుల్లా 37; దిల్షాన్ (సి) సర్కార్ (బి) షకీబ్ 12; జయసూర్య (స్టం) నూరుల్ హసన్ (బి) షకీబ్ 26; మ్యాథ్యూస్ (సి) షకీబ్ (బి) అల్ అమిన్ 12; తిసారా పెరీరా ఎల్బీడబ్ల్యు (బి) ముస్తాఫిజుర్ 4; సిరివర్ధన (సి) షబ్బీర్ (బి) మోర్తజా 3; షనక (సి) ముష్ఫికర్ (బి) అల్ అమిన్ 14; కపుగెడెర నాటౌట్ 12; కులశేఖర (సి) సౌమ్య సర్కార్ (బి) అల్ అమిన్ 0; చమీరా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 124.

వికెట్ల పతనం: 1-20; 2-76; 3-78; 4-85; 5-92; 6-102; 7-116; 8-117.

బౌలింగ్: తస్కిన్ అహ్మద్ 3-0-19-0; అమిన్ హుస్సేన్ 4-0-34-3; షకీబ్ 4-0-21-2; ముస్తాఫిజుర్ 4-0-19-1; మోర్తజా 3-0-17-1; మహ్ముదుల్లా 2-0-14-1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement