Bangladesh cricketers
-
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. పాక్ బ్యాటర్ ఊచకోత
Bangladesh Premier League 2023: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2023 సీజన్లో సంచలన ప్రదర్శనలు నమోదయ్యాయి. రంగ్‌పూర్ రైడర్స్‌తో ఇవాళ (జనవరి 19) జరుగుతున్న మ్యాచ్‌లో ఫార్చూన్ బారిషల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాక్ ఆటగాడు ఇఫ్తికార్ అహ్మద్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. అతని జతగా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (43 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడటంతో ఫార్చూన్ బారిషల్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది బీపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక టీమ్ టోటల్‌గా రికార్డుల్లోకెక్కింది. 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో జత కట్టిన ఇఫ్తికార్-షకీబ్ ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో అజేయమైన 192 పరుగులు జోడించారు. బీపీఎల్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇఫ్తికార్-షకీబ్ జోడీ ఇన్నింగ్స్ ఆఖరి 3 ఓవర్లలో (18వ ఓవర్లో 22, 19వ ఓవర్లో 24, 20వ ఓవర్లో 27) నమ్మశక్యం కాని రీతిలో 73 పరుగులు జోడించి బీపీఎల్‌లో చరిత్ర సృష్టించింది. ఇఫ్తికార్-షకీబ్ జోడీ.. ప్రత్యర్ధి స్పిన్నర్లను ఊచకోత కోసింది. కాగా, బీపీఎల్ ప్రస్తుత సీజన్లో షకీబ్ సారధ్యంలోని ఫార్చూన్ బారిషల్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. టాప్ ప్లేస్‌లో సిల్హెట్ స్ట్రయికర్స్ (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు) టీమ్ ఉంది. కొమిల్లా విక్టోరియన్స్, రంగ్‌పూర్ రైడర్స్, చట్టోగ్రామ్ ఛాలెంజర్స్, ఖుల్నా టైగర్స్, ఢాకా డామినేటర్స్ వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఈ లీగ్‌లో పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు కొందరు భారత ఆటగాళ్లు (బీసీసీఐతో సంబంధం లేని వాళ్లు) కూడా పాల్గొంటున్నారు. -
ఒకే రోజు ఇద్దరు క్రికెటర్లను బలి తీసుకున్న బ్రెయిన్ ట్యుమర్
ప్రాణాంతక వ్యాధి బ్రెయిన్ ట్యుమర్ ఒకే రోజు ఇద్దరు మాజీ అంతర్జాతీయ క్రికెటర్లను బలి తీసుకుంది. ఈ ఇద్దరు బంగ్లాదేశ్‌కు చెందిన వారే కావడం విశేషం. బంగ్లాదేశ్ తొలి వన్డే జట్టులో సభ్యుడైన సమియుర్ రెహమాన్ (69) బ్రెయిన్ ట్యుమర్ వ్యాధి కారణంగా ఇవాళ (ఏప్రిల్ 19) ఢాకాలోని సిటీ ఆసుపత్రిలో కన్నుమూయగా, ఇదే రోజు బంగ్లా మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మొషారఫ్ హొస్సేన్ (40) అదే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ మృతి చెందాడు. ఒకే రోజు ఇద్దరు మాజీ క్రికెటర్లు కన్నుమూయడం పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. (సమియుర్ రెహమాన్) రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన సమియుర్ బంగ్లాదేశ్ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్ కూడా సాధించలేకపోగా, మొషారఫ్ హొస్సేన్ 2008-16 మధ్యలో 5 వన్డేలు ఆడి 4 వికెట్లు పడగొట్టాడు. సమియుర్ ఆటగాడిగా రిటైర్ అయిన అనంతరం బంగ్లా దేశవాళీ టోర్నీలకు అంపైర్‌గా వ్యవహరించగా, మొషారఫ్ హొస్సేన్.. బంగ్లా దేశవాళీ టోర్నీల్లో 572 వికెట్లు పడగొట్టి స్టార్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చదవండి: లక్నోతో మ్యాచ్.. భారీ రికార్డులపై కన్నేసిన దినేశ్ కార్తీక్ -
భళా... బంగ్లాదేశ్
శ్రీలంకపై సంచలన విజయం షబ్బీర్ సూపర్ బ్యాటింగ్ ఆసియా కప్ మిర్పూర్: సొంతగడ్డపై బంగ్లాదేశ్ క్రికెటర్లు మరోసారి రెచ్చిపోయారు. సమష్టి కృషితో తమకన్నా మెరుగైన ప్రత్యర్థికి అద్భుతంగా అడ్డుకట్ట వేశారు. భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయినా... నాణ్యమైన బౌలింగ్‌తో తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌ను చక్కగా కాపాడుకున్నారు. ఫలితంగా ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసింది. షబ్బీర్ రెహమాన్ (54 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోయాడు. షకీబ్ (34 బంతుల్లో 32; 3 ఫోర్లు), మహ్ముదుల్లా (12 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఆరంభంలో లంక బౌలర్ల ధాటికి బంగ్లా 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన షబ్బీర్ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు చెలరేగాడు. షకీబ్‌తో కలిసి ధాటిగా పరుగులు చేశాడు. నాలుగు, ఆరో ఓవర్లో వరుసగా 18, 12 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 3 వికెట్లకు 41 పరుగులకు చేరింది. ఏడో ఓవర్ నుంచి స్పిన్నర్లు రావడంతో పరుగుల వేగం కాస్త మందగించినా... 13వ ఓవర్లో షబ్బీర్ ఓ సిక్స్, రెండు ఫోర్లతో మళ్లీ జోరు పెంచాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ 16వ ఓవర్లో ఓ భారీ సిక్సర్ సంధించిన అతను ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. దీంతో షకీబ్, షబ్బీర్ మధ్య నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చివర్లో మహ్మదుల్లా మెరుగ్గా ఆడాడు. చమీరా 3 వికెట్లు తీశాడు. తర్వాత శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులకే పరిమితమైంది. చండిమల్ (37 బంతుల్లో 37; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. జయసూర్య (21 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఓ మాదిరిగా ఆడినా... మిగతా వారు నిరాశపర్చారు. దిల్షాన్ (12) విఫలం కావడంతో లంకకు సరైన శుభారంభం దక్కలేదు. మిడిలార్డర్లో ఒక్కరు కూడా మంచి భాగస్వామ్యాలను నమోదు చేయలేకపోయారు. దీనికితోడు రెండు వైపుల నుంచి బంగ్లా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో మ్యాథ్యూస్సేన కోలుకోలేకపోయింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: మిథున్ ఎల్బీడబ్ల్యు (బి) మ్యాథ్యూస్ 0; సౌమ్య సర్కార్ (సి) మ్యాథ్యూస్ (బి) కులశేఖర 0; షబ్బీర్ రెహమాన్ (సి) జయసూర్య (బి) చమీరా 80; ముష్ఫికర్ రహీమ్ రనౌట్ 4; షకీబ్ (సి) చండిమల్ (బి) చమీరా 32; మహ్ముదుల్లా నాటౌట్ 23; హసన్ (సి) మ్యాథ్యూస్ (బి) చమీరా 2; మోర్తజా రనౌట్ 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1-0; 2-2; 3-26; 4-108; 5-123; 6-140; 7-147. బౌలింగ్: మ్యాథ్యూస్ 3-0-8-1; కులశేఖర 4-0-44-1; తిసారా పెరీరా 1-0-14-0; జయసూర్య 3-0-21-0; హెరాత్ 4-0-24-0; దిల్షాన్ 1-0-5-0; చమీరా 4-0-30-3. శ్రీలంక ఇన్నింగ్స్: చండిమల్ (సి) తస్కిన్ (బి) మహ్మదుల్లా 37; దిల్షాన్ (సి) సర్కార్ (బి) షకీబ్ 12; జయసూర్య (స్టం) నూరుల్ హసన్ (బి) షకీబ్ 26; మ్యాథ్యూస్ (సి) షకీబ్ (బి) అల్ అమిన్ 12; తిసారా పెరీరా ఎల్బీడబ్ల్యు (బి) ముస్తాఫిజుర్ 4; సిరివర్ధన (సి) షబ్బీర్ (బి) మోర్తజా 3; షనక (సి) ముష్ఫికర్ (బి) అల్ అమిన్ 14; కపుగెడెర నాటౌట్ 12; కులశేఖర (సి) సౌమ్య సర్కార్ (బి) అల్ అమిన్ 0; చమీరా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1-20; 2-76; 3-78; 4-85; 5-92; 6-102; 7-116; 8-117. బౌలింగ్: తస్కిన్ అహ్మద్ 3-0-19-0; అమిన్ హుస్సేన్ 4-0-34-3; షకీబ్ 4-0-21-2; ముస్తాఫిజుర్ 4-0-19-1; మోర్తజా 3-0-17-1; మహ్ముదుల్లా 2-0-14-1.