తమీమ్ తడాఖా | World T20 Qualifiers: Tamim Iqbal's maiden ton powers Bangaldesh into the Super 10s | Sakshi
Sakshi News home page

తమీమ్ తడాఖా

Published Mon, Mar 14 2016 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

తమీమ్ తడాఖా

తమీమ్ తడాఖా

ఒమన్‌పై విజయంతో  ప్రధాన టోర్నీకి బంగ్లాదేశ్
 
ధర్మశాల: తమీమ్ ఇక్బాల్ (63 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో... బంగ్లాదేశ్ టి20 ప్రపంచకప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. ఆదివారం జరిగిన కీలక క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 54 పరుగులు తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) ఒమన్‌పై నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 2 వికెట్లకు 180 పరుగులు సాధించింది. సౌమ్య సర్కార్ (12) విఫలమైనా... తమీమ్ వీరవిహారం చేశాడు. షబ్బీర్ రెహమాన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 9.1 ఓవర్లలో 97; షకీబ్ (9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 4 ఓవర్లలో అజేయంగా 41 పరుగులు జత చేశాడు.

లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఇన్నింగ్స్‌కు ఏడు ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 16 ఓవర్లలో 152 పరుగులుగా సవరించారు. ఆ తర్వాత మరోసారి వరుణుడు ప్రతాపం చూపడంతో లక్ష్యాన్ని 12 ఓవర్లలో 120 పరుగులుగా మార్చారు. చివరకు ఒమన్ 12 ఓవర్లలో 9 వికెట్లకు 65 పరుగులు చేసింది. జితేందర్ సింగ్ (25) మినహా మిగతావారు నిరాశపర్చారు. షకీబ్ 4 వికెట్లు తీశాడు.

 నెదర్లాండ్స్‌కు ఊరట
మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 12 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 6 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 6 ఓవర్లలో 5 వికెట్లకు 59 పరుగులు చేసింది. మైబర్గ్ (27), బోరెన్ (14)లు రాణించారు. డాక్రిల్ 3 వికెట్లు తీశారు. తర్వాత ఐర్లాండ్ 6 ఓవర్లలో 7 వికెట్లకు 47 పరుగులు మాత్రమే సాధించింది. స్టిర్లింగ్ (15) టాప్ స్కోరర్. మికెరెన్ 4 వికెట్లు తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement