ఆరంభంలోనే ధోని ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. విండీస్ వికెట్ కీపర్ షాయ్ హోప్ చెత్త కీపింగ్‌తో అవుటయ్యే ప్రమాదం నుంచి ధోని తప్పించుకున్నాడు. స్పిన్నర్ ఫబియన్ అలెన్ వేసిన 34 ఓవర్ తొలి బంతిని ధోని ముందుకచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాట్‌కు దూరంగా వెళ్లిన బంతి కీపర్ చేతుల్లో పడింది. అయితే తొలి ప్రయత్నంలో స్టంపౌట్ చేయడంలో హోప్ విఫలమయ్యాడు. అయితే ఔట్ అని ఫిక్స్ అయిన ధోని లేట్‌గా స్పందించాడు. దీంతో హోప్‌కు మరో అవకాశం లభించింది. అప్పటికీ స్టంపౌట్ చేయడంలో హోప్ విఫలమయ్యాడు.