
విజయ్ శంకర్ హీరోగా, అప్సరా రాణి హీరోయిన్ గా ‘రాచరికం’ సినిమా ఆరంభం అయింది. సురేష్ లంకలపల్లి దర్శకుడు. చిల్ బ్రోస్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈశ్వర్ నిర్మిస్తున్న ‘రాచరికం’ మూవీ సోమవారంప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతలు డీఎస్ రావు కెమెరా స్విచ్చాన్ చేయగా, రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా, ఈశ్వర్ స్క్రిప్ట్‌ను అందించారు.
ఈశ్వర్ మాట్లాడుతూ ‘‘సురేష్‌తో ఆరు నెలలుగా ప్రయాణించాం. సినిమా బాగా వస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘రాచరికం’ చిత్రంలో ప్రతి పాత్రకుప్రాధాన్యత ఉంటుంది’’ అన్నారు సురేష్ లంకలపల్లి. ‘‘రాచరికం’ లాంటి మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు విజయ్ శంకర్. ‘‘రాచరికంతో అరాచకం సృష్టించబోతున్నాం’’ అన్నారు అప్సరా రాణి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: చాణక్య, కెమెరా: ఆర్య సాయికృష్ణ, సంగీతం: వెంగి.
Comments
Please login to add a commentAdd a comment