మాంచెస్టర్: ఓల్డ్ ట్రఫోర్డ్ మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు టాస్ కోసం డ్రెస్సింగ్‌రూమ్ నుంచి బయటకు వస్తున్న విరాట్ కోహ్లీకి ఘనస్వాగతం లభించింది. వరణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉన్న ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. పాక్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. నిజాయితిగా చెబుతున్న టాస్ గెలిచినా బౌలింగ్‌నే ఎన్నుకునే వాళ్లమని కోహ్లీ చెప్పాడు.అన్ని విభాగాలలో జట్టు పటిష్ఠంగా ఉందని, 8లక్షల టికెట్లు అమ్ముడయ్యాయంటేనే మ్యాచ్ కల్గించే ఉత్కంఠను అర్థం చేసుకోవచ్చన్నాడు. ఫీల్డ్‌లోకి వెళ్లాక మ్యాచ్ గురించే ఆలోచిస్తామని ఒత్తిడి తట్టుకున్న జట్టే విజయం సాధిస్తుందని పేర్కొన్నాడు. గాయం కారణంగా శిఖర్ ధావన్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చాడని ఆల్‌రౌండర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment