ఎంత లక్కీ గురూ నువ్వు! | estimated 16 lakh fees before the people of the country had forgotten | Sakshi
Sakshi News home page

ఎంత లక్కీ గురూ నువ్వు!

Published Tue, Dec 12 2017 12:09 AM | Last Updated on Tue, Dec 12 2017 12:09 AM

 estimated 16 lakh fees before the people of the country had forgotten - Sakshi

ఢిల్లీ దగ్గరి గురుగ్రామ్‌లోని ఫోర్టిస్‌ మెమోరియల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇటీవల ఓ ఏడేళ్ల అమ్మాయికి డెంగ్యూ చికిత్సకు డాక్టర్లు 16 లక్షల ఫీజు వసూలు చేసిన ఘటనను దేశ ప్రజలు మర్చిపోక ముందే విజయ్‌ శంకర్‌ అనే యువకుడు.. నోటికి చెయ్యి అడ్డం పెట్టుకోకుండా ‘హా ’ మని తుమ్మాడని అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఇంకో స్టార్‌ హాస్పిటల్‌ అతడికి 2 లక్షల రూపాయల ఫీజు వేసింది! ఆ బిల్లు చూసి గుండె గుభేల్‌మన్న విజయ్‌ శంకర్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ చాయ్‌వాలా చెప్పడంతో ఈ విషయం బయటికి పొక్కింది. విజయ్‌ కుప్పకూలిన వెంటనే అదే హాస్పిటల్‌ డాక్టర్లు అతడిని ఐసీయూలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

అదృష్టవశాత్తూ అప్పుడే స్పృహలోకి వచ్చిన విజయ్‌ అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నాడు. ఈ సంగతి మాత్రం స్వయంగా అతడే చెప్పుకున్నాడు. ‘ఒకవేళ వాళ్లు నన్ను తీసుకెళ్లి ఉంటే, గ్లూకోజ్‌ ఎక్కించి, ఒక్కో బాటిల్‌కి 5 లక్షలు బిల్లు వేసి ఉండేవారని’ విజయ్‌ ఇప్పుడు తన సమయస్ఫూర్తికి మురిసిపోతున్నాడట. సామాజిక పరిణామాల మీద వ్యంగ్యాస్త్రాలు వేస్తుండే ఓ వెబ్‌సైటు చేసిన పరిహాసం ఇది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement