
న్యూఢిల్లీ: ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో హార్దిక్ పాండ్యా రెగ్యులర్ ఆల్ రౌండర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటికే తానేంటో హార్దిక్ నిరూపించుకోగా, తాజాగా మరొక ఆల్ రౌండర్ రూపంలో విజయ్ శంకర్ తెరపైకి వచ్చాడు. ప్రధానంగా ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విజయ్ శంకర్ భారీ షాట్లతో అలరించి ఆల్ రౌండర్ రేసులోకి వచ్చేశాడు. దీనిపై తాజాగా మాట్లాడిన విజయ్ శంకర్ తనకు హార్దిక్ పాండ్యాతో స్నేహ పూర్వక పోటీ మాత్రమే ఉందన్నాడు.‘ బయట నుంచి చూసేవాళ్లకు హార్దిక్‌తో నాకు పోటీ ఉన్నట్లే కనబడుతోంది. కానీ మా మధ్య స్నేహ పూర్వక పోటీ మాత‍్రమే ఉంది.
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఇద్దరం కలిసి ఆడాం. ఆ క్రమంలోనే చాలా విషయాలు చర్చించాం కూడా. ప్రధానం వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలనే దానిపై హార్దిక్‌తో కలిసి చాలా విషయాల్ని షేర్ చేసుకున్నా. లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో పాటు ప్రభావం చూపే ఆటగాళ్ల గురించి తరచు మాట్లాడుకున్నాం. దాంతో మా మధ్య మంచి సాన్నిహిత్యం ఏర‍్పడింది. బయట నుంచి చూస్తే మా ఇద్దరి మధ్య పోటీ అనేది కనబడుతుంది. కానీ మేము చాలా విషయాలు షేర్ చేసుకోవడంతో మా మధ్య స‍్నేహ సంబంధం మరింత బలపడింది. మేము మంచి స్నేహితులం’ అని విజయ్ శంకర్ తెలిపాడు.