ప్రపంచకప్‌ 2019: విజయ్‌ శంకర్‌కు గాయం? | World Cup 2019 Vijay Shankar suffers Injury | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ 2019: విజయ్‌ శంకర్‌కు గాయం?

Published Fri, May 24 2019 10:07 PM | Last Updated on Wed, May 29 2019 2:38 PM

World Cup 2019 Vijay Shankar suffers Injury - Sakshi

లండన్‌: మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆటగాళ్ల గాయాలు టీమిండియాకు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్‌లో కేదార్‌ జాదవ్‌ గాయం కలవరానికి గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్‌ శంకర్‌ శుక్రవారం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా గాయపడినట్టు స్థానిక మీడియా కథనం ప్రచురించింది. ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో కుడి చేతికి గాయం కావడంతో మైదానాన్ని వీడాడని,  కివీస్‌తో జరగబోయే వార్మప్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదని కథనంలో పేర్కొంది. అయితే విజయ్‌ శంకర్‌ గాయంపై ఇప్పటివరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రపంచకప్‌కు ప్రకటించిన టీమిండియా జాబితాలో శంకర్‌ అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. త్రీ డైమెన్షన్ ప్లేయర్‌ అంటూ సెలక్టర్లు అంబటి రాయుడుని కాదని శంకర్‌కు అవకాశం కల్పించారు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం జూన్‌ 5న దక్షిణాప్రికాతో ప్రపంచకప్‌ తొలి పోరును టీమిండియా ప్రారంభించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement