సీఎస్‌కే ఆటగాళ్లతో కోహ్లి (PC: BCCI/IPL)
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్‌లో మూడో బెర్తు కూడా ఖరారైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ టేబుల్ టాపర్‌గా ముందుగానే టాప్-4లో తిష్ట వేయగా.. రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా అర్హత సాధించాయి.
లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం(మే 14)తో ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా రాజస్తాన్.. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌లో నేరుగా చోటు దక్కించుకున్నాయి.
ఆ మూడు జట్ల మధ్య పోటీ
ఇక ప్లే ఆఫ్స్‌లో మిగిలిన ఒక్క స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోటీపడుతున్నాయి. నిజానికి రన్‌రేటు పరంగా ఈ రెండు జట్ల కంటే వెనుకబడి ఉన్న లక్నో(12 పాయింట్లు, నెట్ రన్‌రేటు -0.787) ఈ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్లే!
ఒకవేళ ఆశలు సజీవం చేసుకోవాలంటే.. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో భారీ తేడాతో లక్నో గెలవాలి. అయినప్పటికీ సీఎస్‌కే- ఆర్సీబీ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అందులోనూ ఆర్సీబీని సీఎస్‌కే కచ్చితంగా.. అది కూడా స్వల్ప తేడాతో ఓడిస్తేనే లక్నోకు అవకాశం ఉంటుంది.
సీఎస్‌కే- ఆర్సీబీ ఫలితంపై సర్వత్రా ఆసక్తి
ఈ నేపథ్యంలో.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లక్నో వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్ చేరడం సాధ్యంకాదు. కాబట్టి ప్రధానంగా పోటీలో ఉన్నది సీఎస్‌కే- ఆర్సీబీ మాత్రమే అని చెప్పవచ్చు.
ఈ రెండు జట్లలోనూ చెన్నై(14 పాయింట్లు, రన్‌రేటు 0.528) ఆర్సీబీ(12 పాయింట్లు 0.387) కంటే ఓ మెట్టు పైనే ఉంది. అయినప్పటికీ ఆర్సీబీ సీఎస్‌కేను దాటి ప్లే ఆఫ్స్ చేరాలంటే..? సాధ్యమయ్యే రెండు సమీకరణలు ఇలా!
అలా చెన్నైపై గెలిచినా సాధ్యం కాదు
1. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు తక్కువ కాకుండా స్కోరు చేయాలి. అంతేకాదు 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాలి. అంతకంటే ఒక్క పరుగు తక్కువ తేడాతో చెన్నైని ఓడించినా ఫలితం ఉండదు. నెట్ రన్‌రేటు ఆధారంగా చెన్నై ప్లే ఆఫ్స్ చేరితే.. ఆర్సీబీ మాత్రం ఇంటిబాట పడుతుంది.
2. ఒకవేళ ఆర్సీబీ గనుక సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చి.. చెన్నై విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని.. 11 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ పూర్తి చేయాలి.
చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment