PC:IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(77) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
దృవ్ జురల్ అద్భుత ఇన్నింగ్స్
ఇక యశస్వి జైశ్వాల్‌తో పాటు దృవ్ జురల్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరిలో క్రీజులోకి వచ్చిన దృవ్ జురల్ సీఎస్‌కే బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 15 బంతులు మాత్రమే ఎదుర్కొన్న దృవ్ జురల్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లోనే కాకుండా టోర్నీ ఆసాంతం దృవ్ జురల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఈ మెగా ఈవెంట్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన దృవ్ జురల్ 130 పరుగులు సాధించాడు. ఇక రాజస్తాన్‌కు అదిరిపోయే ఫినిషింగ్ ఇస్తున్న దృవ్ జురల్ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జురల్ రాజస్తాన్‌కు దొరికిన అణిముత్యం అని కొనియాడుతున్నారు.
ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు రాజస్తాన్ రాయల్స్ ధ్రువ్ జురెల్‌ను కొనుగోలు చేసింది. కానీ ఆసీజన్‌లో మాత్రం అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఈ ఏడాది సీజన్‌లో తనకు వచ్చిన మాత్రం అతడు సద్వినియోగం చేసుకున్నాడు.
చదవండి: IPL 2023: తొలి మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు.. ఎవరీ ధ్రువ్ జురెల్? వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment