కేకేఆర్ (PC: IPL)
ఐపీఎల్-2023 తుది అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే పదేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న జట్లు ప్లే ఆఫ్ రేసులో నిలిచేందుకు చేరేందుకు పోటీపడుతున్నాయి. మొన్నటిదాకా పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ సైతం పంజాబ్ కింగ్స్‌పై సోమవారం నాటి విజయంతో తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. పట్టికలో ఐదో స్థానానికి దూసుకొచ్చింది. మరి మిగతా జట్ల పరిస్థితి ఏంటి? రేసులో ముందంజలో ఉన్న జట్లు ఏవి? తదితర విషయాలు తెలుసుకుందాం!
గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్-2023లో డిపెండింగ్ చాంపియన్ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో గెలుపొంది 16 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే 18 పాయింట్లు అవసరమైన నేపథ్యంలో మిగిలి ఉన్న మూడు మ్యాచ్‌లలో ఒక్కటి గెలుపొందినా గుజరాత్ నేరుగా ప్లే ఆఫ్స్ చేరుకునే ఛాన్స్ ఉంటుంది. గుజరాత్ జోరు చూస్తుంటే అన్నింటికంటే ముందే ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
మిగిలిన మ్యాచ్‌లు ఎవరితో అంటే:
మే 12: ముంబై ఇండియన్స్
మే 15: సన్‌రైజర్స్ హైదరాబాద్
మే 21: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
చెన్నై సూపర్ కింగ్స్
మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని సీఎస్‌కే ఇప్పటి వరకు ఆడిన పదకొండు మ్యాచ్‌లకు గానూ.. 6 గెలిచింది. తద్వారా 12 పాయింట్లు సాధించిన చెన్నై.. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన నేపథ్యంలో మరో పాయింట్ ఖాతాలో వేసుకుంది. దీంతో మొత్తంగా 13 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఈ సీజన్‌లో సీఎస్‌కేకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వీటిలో రెండింటిలో గెలిస్తే.. నాలుగు పాయింట్లు సాధిస్తుంది. అప్పుడు మొత్తంగా 17 పాయింట్లు ఖాతాలో చేరతాయి. ఇక ఈ మ్యాచ్‌లలో గనుక భారీ రన్‌రేటు సాధిస్తే.. ఒకవేళ మిగిలిన ఆ ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా ధోని సేన ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకునే వీలుంటుంది.
సీఎస్‌కేకు మిగిలి ఉన్న మ్యాచ్‌లు:
మే 10: ఢిల్లీ క్యాపిటల్స్‌తో
మే 14: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో
మే 20: ఢిల్లీ క్యాపిటల్స్‌తో
లక్నో సూపర్ జెయింట్స్
లక్నో ప్రస్తుతం పదకొండింటికి ఐదు విజయాలతో 11 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలుపొందడం సహా రన్‌రేటు అంశంపై లక్నో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.
అయితే, గాయం కారణంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అతడి గైర్హాజరీలో కృనాల్ పాండ్యా సారథ్యంలో సీఎస్‌కేతో మ్యాచ్ రద్దు కాగా.. గుజరాత్ టైటాన్స్ చేతిలో 56 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇక మిగిలిన మ్యాచ్‌లలో ఎలా రాణిస్తుందన్న అంశం మీదే లక్నో అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
మిగిలిన మ్యాచ్‌లు:
మే13: సన్‌రైజర్స్ హైదరాబాద్
మే 16: ముంబై ఇండియన్స్
మే 20: కోల్‌కతా నైట్ రైడర్స్
రాజస్తాన్ రాయల్స్
గతేడాది రన్నరప్ రాజస్తాన్ ఐపీఎల్-2023 ఆరంభంలో వరుసగా నాలుగు విజయాలు సాధించింది. అయితే, గత ఆరు మ్యాచ్‌లలో అనూహ్యంగా ఐదింట ఓటమిపాలైంది. ముఖ్యంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి బంతికి నోబాల్ ట్విస్టుతో పరాజయాన్ని మూటగట్టుకోవడం ప్రభావం చూపింది.
ఇప్పటి దాకా 11 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్ ఖాతాలో 10 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి సంజూ సేన ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లు భారీ తేడాతో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన దుస్థితి.
మిగిలిన మ్యాచ్‌లు:
మే 11: కేకేఆర్
మే 14: ఆర్సీబీ
మే 19: పంజాబ్ కింగ్స్
కోల్‌కతా నైట్ రైడర్స్
పంజాబ్ కింగ్స్‌తో తాజా విజయంతో 10 పాయింట్లతో రేసులో తానున్నానంటూ ముందుకు వచ్చింది కేకేఆర్. పంజాబ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. అయితే, కేకేఆర్‌కు అసలైన సవాలు ముందుంది. రాజస్తాన్, చెన్నై, లక్నోలతో మిగిలిన మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తమ కంటే మెరుగ్గా కనిపిస్తున్న ఈ జట్లపై గెలవడం సహా ఇతర జట్ల ఫలితాలు తేలేదాకా ఎదురు చూడాల్సి ఉంటుంది.
మిగిలిన మ్యాచ్‌లు:
మే 11: రాజస్తాన్ రాయల్స్
మే 14: చెన్నై సూపర్ కింగ్స్
మే 20: లక్నో సూపర్ జెయింట్స్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
పంజాబ్‌పై కేకేఆర్ విజయంతో పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికి పడిపోయింది ఆర్సీబీ. మూడో స్థానంతో ముగించి ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలన్న వాళ్ల ఆశలపై ఢిల్లీ క్యాపిటల్స్ నీళ్లు చల్లింది. రన్‌రేటు కూడా భారీగా పడిపోయింది.
ఇక ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పది పాయింట్లతో ఉన్న ఆర్సీబీ.. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో భారీ తేడాతో గెలిస్తే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకోగలదు.
మిగిలిన మ్యాచ్‌లు:
మే 9: ముంబై ఇండియన్స్‌తో
మే 14: రాజస్తాన్ రాయల్స్‌తో
మే 18: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో
మే 21: గుజరాత్ టైటాన్స్‌తో
పంజాబ్ కింగ్స్
కేకేఆర్ చేతిలో ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచినా 16 పాయింట్లతో మాత్రమే ఫినిష్ చేయగలదు. ఒకవేళ ప్లే ఆఫ్ చేరాలంటే.. భారీ తేడాతో గెలుపొంది రన్‌రేటును మెరుగుపరచుకోవడం సహా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
మిలిగిన మ్యాచ్‌లు:
మే 13: ఢిల్లీ క్యాపిటల్స్
మే 17: ఢిల్లీ క్యాపిటల్స్
మే 19: రాజస్తాన్ రాయల్స్
ముంబై ఇండియన్స్
కేకేఆర్ విజయం కారణంగా ముంబై ఇండియన్స్ ఆరో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచ్‌లలో 5 గెలిచిన ముంబై.. 10 పాయింట్లతో ఉంది.
ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఈసారి ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లలో గెలవడంతో పాటు భారీ రన్‌రేటు నమోదు చేయాల్సి ఉంటుంది.
మిలిగిన మ్యాచ్‌లు:
మే 9: ఆర్సీబీ
మే 12: గుజరాత్ టైటాన్స్
మే 16: లక్నో సూపర్ జెయింట్స్
మే 21: సన్‌రైజర్స్ హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్
జైపూర్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై ఆఖరి బంతికి నోబాల్ ట్విస్టుతో గెలుపొందిన సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. ఇక ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లకు గానూ నాలుగింట గెలిచిన హైదరాబాద్ జట్టు అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోలేదు.
మిలిగిన నాలుగు మ్యాచ్‌లలో భారీ తేడాతో గెలిచినా కూడా రైజర్స్ ఖాతాలో 16 పాయింట్లే ఉంటాయి. ఈ నేపథ్యంలో రైజర్స్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాల ఆధారంగా తేలనుంది.
మిగిలిన మ్యాచ్‌లు:
మే 13: లక్నో సూపర్ జెయింట్స్
మే 15: గుజరాత్ టైటాన్స్
మే 18: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
మే 21: ముంబై ఇండియన్స్
ఢిల్లీ క్యాపిటల్స్
సన్‌రైజర్స్‌తో పోటీ పడుతూ పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతున్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఆడిన పది మ్యాచ్‌లలో నాలుగు గెలిచిన ఢిల్లీ రన్‌రేటు కారణంగా రైజర్స్ కంటే వెనుకబడి ఉంది. ఒకవేళ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో గెలవడం సహా ఇతర జట్ల ఫలితాలు తేలేవరకు వేచి చూడాల్సి ఉంటుంది వార్నర్ బృందం.
మిలిగిన మ్యాచ్‌లు:
మే 10: చెన్నై సూపర్ కింగ్స్
మే 13: పంజాబ్ కింగ్స్
మే 17: పంజాబ్ కింగ్స్
మే 20: చెన్నై సూపర్ కింగ్స్
Comments
Please login to add a commentAdd a comment