RCB Vs PBKS: వారెవ్వా అనూజ్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యుత్త‌మ క్యాచ్‌! వీడియో వైర‌ల్ | IPL 2024 RCB Vs PBKS: Anuj Rawat Dismissed Sam Curran With Stunning Catch, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

IPL 2024 RCB Vs PBKS: వారెవ్వా అనూజ్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యుత్త‌మ క్యాచ్‌! వీడియో వైర‌ల్

Published Mon, Mar 25 2024 10:24 PM | Last Updated on Tue, Mar 26 2024 12:36 PM

Anuj Rawats Jumping Catch, Sam Curran shock - Sakshi

PC: One cricket

ఐపీఎల్‌-2024లో భాగంగా బెంగ‌ళూరు వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ వికెట్ కీప‌ర్ అనూజ్ రావత్ సంచ‌ల‌న క్యాచ్‌ను అందుకున్నాడు. అనూజ్ అద్బుత‌మైన క్యాచ్‌లో పంజాబ్ బ్యాట‌ర్ సామ్ కుర్రాన్ పెవిలియ‌న్ పంపాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 18 ఓవ‌ర్ వేసిన య‌శ్ దయాల్ ఐదో బంతిని సామ్ కుర్రాన్‌కు బౌన్స‌ర్‌గా సంధించాడు.

ఈ క్ర‌మంలో కుర్రాన్ హుక్ షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు. అయితే బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీప‌ర్ పై నుంచి వెళ్లింది. ఈ క్ర‌మంలో అనూజ్ రావత్ అద్బుతంగా జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు.

ఇది చూసిన అంద‌రూ ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ఆఖ‌రి బ్యాట‌ర్ సామ్ కుర్రాన్ సైతం నేను ఔటా అన్న‌ట్లు రియాక్ష‌న్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో రావ‌త్ ఏకంగా నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement