
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్‌సీబీ ఓపెనర్ అనూజ్ రావత్‌కు కొంచెంలో ప్రమాదం తప్పింది. విషయంలోకి వెళితే.. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సమయంలో డుప్లెసిస్, అనూజ్‌రావత్ నిలకడగా ఆడుతున్నారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ కీరన్ పొలార్డ్ వేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని అనూజ్ రావత్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న డుప్లెసిస్ సింగిల్‌కు కాల్ ఇయ్యడంతో అనూజ్ పరిగెత్తాడు.
ఇంతలో ముంబై ఫీల్డర్ పొలార్డ్‌కు త్రో వేశాడు. దానిని అందుకునే క్రమంలో పొలార్డ్ అనూజ్ రావత్ పరిగెత్తుతున్న వైపు వచ్చాడు. దీంతో ఇద్దరు ఒకరినొకరు బలంగా ఢీకొట్టుకోవడంతో అనూజ్ కిందపడ్డాడు. అయితే హెల్మెట్ గ్రౌండ్‌కు బలంగా గుద్దుకున్నప్పటికి.. రావత్ కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత పొలార్డ్ అతని వద్దకు వచ్చి బాగానే ఉందిగా అని అడిగాడు.. దానికి రావత్.. ఐయామ్ ఫైన్ అంటూ సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఈ వీడియో చూసిన అభిమానులు.. ''పెద్ద గండం తప్పింది.. దేవుని దయవల్ల ఏం కాలేదు.. అంతా బాగానే ఉంది'' అంటూ కామెంట్ చేశారు.
చదవండి: Surya Kumar Yadav: అంతా కట్టగట్టుకొని విఫలమయ్యారు.. ఒక్కడు మాత్రం
Abhishek Sharma: కోట్లు పెట్టి కొన్నందుకు ఎట్టకేలకు మెరిశాడు..
#AnujRawat pic.twitter.com/WG8OAsCYYw
— Raj (@Raj93465898) April 9, 2022