IPL 2022: Virat Kohli Gets Bowled in Nets Before Game Against Mumbai Indians - Sakshi
Sakshi News home page

IPL 2022: కోహ్లి.. ఇంత కోపం పనికిరాదు!

Published Sat, Apr 9 2022 5:27 PM | Last Updated on Sat, Apr 9 2022 6:34 PM

IPL 2022: Kohli Bowled-in Nets Game Vs MI Almost Breaks Wicket Anger - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ముంబై ఇండియన్స్‌.. టోర్నీలో బోణీ కొట్టాలని భావిస్తుంటే.. ఆర్‌సీబీ గత మ్యాచ్‌ ఫలితాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది. మరి ఇరు జట్లలో ఎవరు పైచేయి సాధిస్తారనేది వేచి చూద్దాం. విషయంలోకి వెళితే.. ఈ సీజన్‌లో కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న కోహ్లి తనస్థాయి ఆటతీరును ఇంతవరకు ప్రదర్శించలేదు. మూడు మ్యాచ్‌లు కలిపి 58 పరుగులు మాత్రమే సాధించాడు.

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే శనివారం ఉదయం నెట్‌సెషన్‌లో ప్రాక్టీస్‌ చేశాడు. అయితే స్పిన్నర్‌ వేసిన బంతిని కోహ్లి ఆడడంలో విఫలమయ్యాడు. లేట్‌కట్‌గా వచ్చిన బంతి నేరుగా మిడిల్‌ స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో కోపం పట్టలేకపోయిన కోహ్లి.. తన బ్యాట్‌తో వికెట్లును కొడుదామనుకున్నాడు.. కానీ చివరి నిమిషంలో ఆగిపోయిన కోహ్లి.. కింద ఉన్న బంతిని బౌలర్‌కు కోపంతో విసిరేశాడు. ఆ తర్వాత బ్యాట్‌ను పక్కకు తోసి వికెట్లను సరిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: Jimmy Neesham: ఆ ఆటగాడికి బౌలింగ్‌ చేస్తే రిటైర్మెంట్‌ ఇవ్వాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement