సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అల్లు అ�...
పశ్చిమ గోదావరి: ఉండి మండలం యండగండి గ్�...
గుంటూరు/YSR జిల్లా, సాక్షి: వైఎస్సార్స�...
విశాఖపట్నం, సాక్షి: పశ్చిమ మధ్య బంగాళ�...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్�...
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తదనంత...
సాక్షి, ప్రకాశం: ఏపీలో మరోసారి భూ ప్రక...
పూణే: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్ర�...
ఆఫ్రికా దేశం ఉగాండాలో వింత వ్యాధి అక�...
అట్టావా: వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబో�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ము�...
‘‘కష్టం నాన్నా.. నాకు ఇవేం అర్థం కావడం...
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ముఖ్యమంత�...
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి పాలనలో కక...
Published Sat, Apr 9 2022 7:05 PM | Last Updated on Sun, Apr 10 2022 7:18 AM
IPL 2022: ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ లైవ్ అప్డేట్స్
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 152 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అనూజ్ రావత్ 66 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కోహ్లి 48 పరుగులతో రాణించాడు. ఆర్సీబీ ఇది హ్యాట్రిక్ విజయం కాగా.. ముంబైకి వరుసగా నాలుగో పరాజయం కావడం విశేషం.
సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఆర్సీబీ ఓపెనర్ అనూజ్ రావత్(66) అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. కోహ్లి 45, కార్తీక్ ఒక పరుగుతో ఆడుతున్నారు.
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 111 పరుగులు చేసింది. అనూజ్ రావత్ 52, కోహ్లి 38 పరుగులతో ఆడుతున్నారు. ఆర్సీబీ విజయానికి 30 బంతుల్లో 41 పరుగులు కావాలి
ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ 16 పరుగులు చేసి ఉనాద్కట్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది, రావత్ 37, కోహ్లి 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. అనూజ్ రావత్ 27, డుప్లెసిస్ 13 పరుగులతో ఆడుతున్నారు.
సహచరులు విఫలమైన వేళ ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 68 నాటౌట్, 5 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్బుత పోరాటం కనబరిచాడు. దీంతో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 26, ఇషాన్ కిషన్ 26 పరుగులు చేయగా.. ఆఖర్లో ఉనాద్కట్ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్, హసరంగా చెరో రెండు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశాడు.
కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్‌ను సూర్యకుమార్ తన ఇన్నింగ్స్‌తో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం 17 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. సూర్యకుమార్ 35, జైదేవ్ ఉనాద్కట్ 5 పరుగులతో ఆడుతున్నారు.
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. హసరంగా బౌలింగ్‌లో పొలార్డ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అంతకముందు తిలక్ వర్మను మ్యాక్స్‌వెల్ రూపంలో దురదృష్టం వెంటాడింది. లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయిన తిలక్ వర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఆర్సీబీతో మ్యాచ్‌లో 'జూనియర్ ఏబీ' డెవాల్డ్ బ్రెవిస్ ఆకట్టుకోలేకపోయాడు. 8 పరుగులు మాత్రమే చేసి హసరంగా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ 26 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. ఇషాన్ 23, డెవాల్డ్ బ్రెవిస్ 6 పరుగులతో ఆడుతున్నారు.
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 16, ఇషాన్ కిషన్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఐపీఎల్ 2022లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య ఆసక్తికర పోరుకు తెరలేచింది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇంకా బోణీ కొట్టలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన ముంబై ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని కోరుకుంటుంది. మరోవైపు ఆర్సీబీ మాత్రం మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచి జోష్‌లో ఉంది.
ఇక ఇరుజట్లు మధ్య రికార్డులు పరిశీలిస్తే.. 29 మ్యాచ్‌ల్లో ముంబై 17 మ్యాచ్‌ల్లో గెలవగా, ఆర్సీబీ 12 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఇరు జట్లు తలపడిన గత 5 సందర్భాల్లో ఆర్సీబీ 3 మ్యాచ్‌లో గెలుపొందగా, ముంబై రెండింటిలో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment