అంతా కట్టగట్టుకొని విఫలమయ్యారు.. ఒక్కడు మాత్రం | IPL 2022: Fans Praise Surya Kumar Terrific Innings 38-Balls-68-Runs Vs RCB | Sakshi
Sakshi News home page

Surya Kumar Yadav: అంతా కట్టగట్టుకొని విఫలమయ్యారు.. ఒక్కడు మాత్రం

Published Sat, Apr 9 2022 10:10 PM | Last Updated on Sat, Apr 9 2022 10:31 PM

IPL 2022: Fans Praise Surya Kumar Terrific Innings 38-Balls-68-Runs Vs RCB - Sakshi

Courtesy: IPL Twitter

ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తన విలువేంటో మరోసారి చూపించాడు. ఐపీఎల్‌ 2022లో భాగంగా ఆర్‌సీబీతో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో 68 పరుగులు నాటౌట్‌తో సూర్య తన ఐపీఎల్‌ కెరీర్‌లో బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు . తన సహచరులంతా కట్టగట్టుకొని విఫలమైతే.. తాను మాత్రం అద్బుత పోరాట పటిమతో ఆకట్టుకున్నాడు.


ఆర్‌సీబీ బౌలర్లు విజృంభిస్తున్న వేళ ముంబై బ్యాట్స్‌మన్‌ ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు క్యూ కడితే.. సూర్య మాత్రం యథేచ్చగా బ్యాట్‌ ఝులిపించాడు. 79 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో ఉనాద్కట్‌తో కలిసి ఏడో వికెట్‌కు 72 పరుగులు జోడించాడు. ఇందులో ఉనాద్కట్‌ చేసింది కేవలం 13 పరుగులు మాత్రమే. సూర్యకుమార్‌ ఎంత బాగా ఆడాడనేది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. సూర్య ఆడిన సూపర్‌ ఇన్నింగ్స్‌కు ముంబై బౌలర్లు ఫలితం ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఇంకా బోణీ కొట్టలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన ముంబై ఆర్‌సీబీతో మ్యాచ్‌లోనైనా గెలిచి ఖాతా తెరవాలని చూస్తోంది. 

చదవండి: Glenn Maxwell: 'అక్కడ ఉంది ఎవరు?.. అట్లనే ఉంటది; పాపం తిలక్‌ వర్మ'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement