Courtesy: IPL Twitter
విధ్వంసకర ఆటతీరుకు పెట్టింది పేరు కీరన్ పొలార్డ్. 10వేలకు పైగా పరుగులు.. 300కు పైగా వికెట్లు తీసి టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యున్నత ఆల్ఆరౌండర్‌గా పేరు పొందాడు. కానీ ఎందుకనో పొలార్డ్‌లో ఆ విధ్వంసం కొన్నాళ్లుగా కనబడడం లేదు. అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి ప్రైవేట్ లీగ్స్ వరకు పొలార్డ్ ఈ మధ్యన పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు.
దీంతో ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ జట్టుకు భారంగా మారనున్నాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత సీజన్‌లోనూ పొలార్డ్ పెద్దగా రాణించింది ఏం లేదు. 14 మ్యాచ్‌లాడిన పొలార్డ్ 245 పరుగులు.. బౌలింగ్‌లో కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ గెలిచిన ప్రతీసారి పొలార్డ్ జట్టులో ఉండడంతో మెగావేలానికి ముందే అతన్ని రిటైన్ చేసుకున్నారు. కానీ ఒక రాణించని ఆటగాడిని రిటైన్ చేసుకోవడం ఏంటని విమర్శలు కూడా వచ్చాయి.
తాజాగా ఐపీఎల్ 2022లోనూ పొలార్డ్ తొలి మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కాగా శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ తేలిపోయాడు. పొలార్డ్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో హెట్‌మైర్ విశ్వరూపం ప్రదర్శించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు సహా మొత్తం 26 పరుగులు పిండుకున్నాడు. ఈ దెబ్బతో పొలార్డ్ తన 4 ఓవర్ల కోటాలో 46 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయగలిగాడు.
ఇక బ్యాటింగ్‌లో పొలార్డ్ మెరవకపోతే.. రోహిత్ అతన్ని జట్టు నుంచి పక్కకు తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా ముంబై అభిమానులు కూడా పొలార్డ్ ఆటతీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. పొలార్డ్‌ను ఎందుకు రిటైన్ చేసుకున్నారో అర్థం కావడం లేదు.. అతని స్థానంలో వేరే వాళ్లకు అవకాశం ఇవ్వండి.. మునుపటి పొలార్డ్‌ను మేము చూడలేకపోతున్నాం.. అతని పని అయిపోయింది అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: Russell-Sam Billings: 'రసెల్‌తో బ్యాటింగ్ అంటే నాకు ప్రాణ సంకటం'
IPL 2022: సీఎస్‌కేకు దెబ్బ మీద దెబ్బ.. స్టార్ బౌలర్ ఆసుపత్రి పాలు, మరొకరిది అదే పరిస్థితి
Comments
Please login to add a commentAdd a comment