
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా శనివారం(ఏప్రిల్ 9)న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ యువ ఆటగాడు అనుజ్ రావత్ అదరగొట్టాడు. 47 బంతుల్లో 66 పరుగులు సాధించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా రావత్‌ను ఆర్సీబీ రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన అనుజ్ రావత్ దేశీవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరుపున ఆడుతున్నాడు.
ఎవరీ అనుజ్ రావత్?
ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో ఓ రైతు కుటంబంలో అనుజ్ రావత్ జన్మించాడు. కాగా చిన్నతనం నుంచే రావత్‌కు క్రికెట్ అంటే మక్కువ. అయితే రామ్‌నగర్‌లో క్రికెట్ అకాడమీలు లేకపోవడంతో అతడి తండ్రి ఢిల్లీకు పంపాడు. ఇక అక్టోబరు 2017లో అనుజ్ రావత్ ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి రావత్ దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు.
అతడు తన మొదటి రెండు రంజీ మ్యాచ్‌లలో అర్ధ సెంచరీలు సాధించాడు. అదే విధంగా 2018 రంజీ సీజన్‌లో మధ్యప్రదేశ్‌పై రావత్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇక ఇటీవలి జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, జయ్ హజారే ట్రోఫీలోను రావత్ అదరగొట్టాడు. ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అనూజ్ రావత్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.
చదవండి: IPL 2022: సమస్య బయటపెట్టిన మాజీ క్రికెటర్.. ముంబై ఓటములకు బ్రేక్ పడేనా!