![Womens Day Special Sunny Leone Says 50 Percent Off On Starstruck Products - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/8/sunnyleone_2.jpg.webp?itok=dz69mfJc)
ప్రముఖ నటి సన్నీ లియోన్ ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు వ్యాపార రంగంపై కూడా దృష్టిసారించారు. స్టార్ స్టక్ పేరిట సన్నీ సౌందర్య ఉత్పత్తుల కంపెనీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సన్నీ స్టార్ స్టక్ ప్రొడక్ట్స్ గురించి ప్రచారం చేస్తుంటారు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టార్ స్టక్ ప్రొడక్ట్స్‌పై సన్నీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియోను పోస్ట్ చేశారు. ముందుగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సన్నీ.. ఈ అద్భుతమైన రోజున తన స్టార్ స్టక్ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు తెలిపారు. స్టాక్ అందుబాటులో ఉన్నంత వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. మీ గ్లామర్ కోసం త్వరపడండి అంటూ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం సన్నీ బాలీవుడ్‌తో పాటు పలు దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన భర్త, పిల్లలతో సమయం గడపడానికి ఇష్టపడుతుంటారు. ఫ్యామిలీ విశేషాలను కూడా సన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారనే సంగతి తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment