చర్మం జిడ్డుగా లేకుండా ఉండడానికి ఏంచేయాలి? కంటి కింద నల్ల వలయాలను ఎలా తప్పించాలి? ఎండ నుంచి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి? చర్మం మెరవాలంటే ఏం చేయాలి? చర్మసంరక్షణ నుంచి సౌందర్యం వరకు సందేహాల సముద్రంలో ఈదులాడుతున్న యువతరానికి నిన్నా మొన్నటి వరకు ‘కె–బ్యూటీ’ లేదా కొరియన్ బ్యూటీ చుక్కానిగా కనిపించింది.
అయితే ఇప్పుడు యూత్ దృష్టి జె–బ్యూటీ(జపనీస్ బ్యూటీ)పై మళ్లింది. ఇది జపాన్ బ్యూటీ బ్రాండ్‌ల మార్కెటింగ్ మాయాజాలమా? సహజమైన పరిణామమా? అనే చర్చను పక్కనపెడితే ‘జె–బ్యూటీ’లోని సహజత్వాన్ని, వాబీ–సాబీ తత్వాన్ని యువతరం బాగా ఇష్టపడుతోంది... మృదువైన చర్మం కోసం కలలు కనే యువతరానికి చిరపరిచితమైన ట్రెండ్ కె–బ్యూటీ( కొరియన్–బ్యూటీ) బ్యూటీ ఇండస్ట్రీపై భారీ ప్రభావాన్ని చూపించింది. మైండ్ – బాగ్లింగ్ ప్రొడక్ట్స్, మల్టీ–స్టెప్ రొటీన్స్‌తో ‘కె–బ్యూటీ’ గ్లోబల్ సెన్సేషన్‌గా నిలిచింది. యువ ప్రపంచాన్ని అమితంగా ఆకట్టుకుంది.
తాజా విషయానికి వస్తే ‘జె–బ్యూటీ’ లేదా జపనీస్ బ్యూటీ యువతరం ఫేవరెట్‌గా మారింది. ‘పవర్‌ఫుల్ సిస్టర్ ఆఫ్ కె–బ్యూటీ’ గా పేరు తెచ్చుకున్న ‘జె–బ్యూటీ’ కె–బ్యూటీని అధిగమించేలా దూసుకుపోతోంది. ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్సర్‌లతో కలిసి జపనీస్ బ్యూటీ బ్రాండ్‌లు కలిసి పనిచేయడం కూడా మన దేశంలో ‘జె–బ్యూటీ’ పాపులారిటీకి కారణం అయింది.
‘జె–బ్యూటీ’కి ఎందుకు ఇంత పాపులారిటీ వచ్చింది... అనే విషయానికి వస్తే... నిపుణుల మాటల్లో చెప్పాలంటే...‘జె–బ్యూటీ’లోని ప్రధాన ఆకర్షణ సింప్లిసిటీ, ఎఫెక్టివ్‌నెస్. ‘ప్రివెన్షన్ రాదర్ దేన్ కరెక్షన్ ’ తత్వంతో కూడిన ఈ విధానం హ్యాపీగా, హెల్తీగా ఉండేలా చర్మ సంరక్షణతో΄ాటు పర్యావరణ ఒత్తిళ్ల నుంచి రక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది, గ్రీన్ టీ, రైస్ బ్రాన్, సీవీడ్‌లాంటి ΄ ఇన్‌గ్రేడియెంట్స్ ‘జె–బ్యూటీ’లో భాగం అయ్యాయి.
‘ఘుమఘుమలతో కూడిన ఖరీదైన వంటకాల కంటే సాదాసీదా పప్పన్నం ఎంచుకోవడం లాంటిదే జె–బ్యూటీ. దీనిపై జపనీస్ తత్వం వాబీ–సాబీ ప్రభావం ఉంది. ఇంపర్‌ఫెక్షన్, సింస్లిపిటీ నుంచి అందాన్ని దర్శించడమే వాబీ –సాబీ తత్వం. జె–బ్యూటీ ప్రాథమికంగా రెండు విషయాలపై దృష్టి పెడుతుంది. వర్తమానంలో చర్మ సౌందర్యం. రెండోది భవిష్యత్తులో చర్మ సమస్యలు రాకుండా నివారించడం’ అంటుంది ముంబైకి చెందిన డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ డాక్టర్ శిఖా షా.
జపనీస్ కల్చర్ అండ్ లైఫ్‌స్టైల్‌పై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరగడం కూడా మన దేశంలో ‘జె–బ్యూటీ’పై ఆసక్తి కలిగించే కారణాలలో ఒకటి. ‘ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం కోసం 11–12 స్టెప్ స్కిన్‌కేర్ రొటిన్ అవసరం అనే అ΄ోహను జె– బ్యూటీ బ్రేక్ చేసింది’ అంటుంది డాక్టర్ మోనికా బాంబ్రూ.
‘కె–బ్యూటీ’తో పోల్చితే ‘జె–బ్యూటీ’ని ప్రత్యేకంగా ఉంచుతున్నదేమిటి? అనే విషయానికి వస్తే... చర్మసంరక్షణ విషయంలో రెండిటికీ పేరు ఉన్నప్పటికీ వాటి విధానాలు, తత్వం వేరు. ‘కె–బ్యూటీ’ అనేది ఇన్నోవేషన్, ఎక్స్‌పెరిమెంటేషన్‌పై దృష్టి పెడుతుంది. మల్టీ–స్టెప్ రొటిన్స్, ట్రెండ్–డ్రైవన్ ఫార్ములేషన్స్ ఉంటాయి. ఇక ‘జె–బ్యూటీ’ అనేది సింప్లిసిటీ, మినిమలిజం, సహజపదార్థాలపై దృష్టి పెడుతుంది.
‘జె–బ్యూటీకి తిరుగులేదు’ అని అంటుంది ముంబైకి చెందిన అద్విక శ్రీవాస్తవ. ‘జె–బ్యూటీ’పై కొండంత ఇష్టంలోనూ ఆచితూచి ఆలోచించేవారు లేకపోలేదు. ఇందుకు ఉదాహరణ బెంగళూరుకు చెందిన చైత్ర. ‘కె–బ్యూటీతో పోల్చితే జె–బ్యూటీ ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలా అని వేలంవెర్రిగా జె–బ్యూటీ ప్రొడక్ట్స్ కొనాలనుకోవడం లేదు. జె–బ్యూటీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను’ అంటుంది చైత్ర.
క్లీన్ బ్యూటీ ట్రెండ్
గతంలో పోల్చితే జపనీస్ బ్యూటీ కంపెనీలపై యువత ఆసక్తి పెరిగింది. దీనికి అనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు మారుతున్నాయి...అంటుంది గ్లోబల్ డేటా ర రిపోర్ట్ ‘కె–బ్యూటీ అనేది ట్రెండీ ఇన్‌గ్రేడియెంట్స్, ఆకర్షణీయమైన ప్యాకింగ్, క్విక్ రిజల్ట్‌కు ప్రాధాన్యత ఇస్తుంటే జె–బ్యూటీ ఇందుకు భిన్నంగా సహజమైన పదార్థాలతో శాశ్వత ప్రభావంపై దృష్టి పెడుతుంది’ అంటున్నాడు ‘గ్లోబల్ డేటా’ కన్జ్యూమర్ అనలిస్ట్ మణి భూషణ్ శుక్లా. ‘సహజ’ ‘సేంద్రియ’ ‘అలెర్జీరహిత’ మాటలతో ‘జె–బ్యూటీ’ ‘క్లీన్ బ్యూటీ’ ట్రెండ్‌గా పేరు తెచ్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment