ఆరోగ్యవంతమైన మేని కాంతే అసలైన అందం. అందుకే చాలామంది మేకప్ ఇచ్చే మెరుపు కంటే .. సహజంగా వచ్చే గ్లోకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. చిత్రంలోని ఫేస్ రోలర్.. అలాంటి సౌందర్య సంరక్షణతో పాటు కండరాల నొప్పులనూ తగ్గిస్తుంది.
బుగ్గలు, మెడ, నుదురు, కళ్లు, ముక్కు ఇలా ముఖంలోని అన్ని భాగాలను మసాజ్ చేసుకోవడంతో పాటు నిగారింపునూ పొందొచ్చు. అలాగే మెడ చుట్టు పేరుకుకున్న కొవ్వు తగ్గించి.. ముఖాన్ని V షేప్‌లోకి మార్చుకోవచ్చు.ఈ టూల్ ఇంట్లో ఉంటే.. బ్యూటీ సెలూన్‌కి వెళ్లాల్సిన పనిలేదు. అంతేకాదు దీన్ని జిమ్‌కీ వెంట తీసుకెళ్లి.. మసాజ్ చేసుకోవచ్చు.
టీవీ చూస్తున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వినియోగించుకోవచ్చు. అవసరాన్ని బట్టి, ట్రీట్‌మెంట్‌ని బట్టి.. ఈ టూల్ చక్కగా యూజ్ అవుతుందని ఈ చిత్రాలను చూస్తే తెలిసిపోతుంది. వీల్స్, కొనలు, వంపులు ఇలా ఈ టూల్ అన్ని కోణాలతో .. చిత్రంలో చూపించిన విధంగా యూజ్ చేసుకోవచ్చు. ధర సుమారు 16 డాలర్లు. అంటే 1,330 రూపాయలు.
Comments
Please login to add a commentAdd a comment