
మళ్లీ మొదలైంది ఆపరేషన్ కొల్లేరు
నిడమర్రు : ఆక్రమణల చెరలో చిక్కు కున్న కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమం మళ్లీ మొదలైంది. ‘ఆపరేషన్ కొల్లేరు’ కార్యక్రమానికి అధికార యంత్రాంగం చడీచప్పుడు లేకుండా శ్రీకారం చుట్టింది. నిడమర్రులోని వెంకటాపురం ప్రాంతంలో కొల్లేరు అభయారణ్యం పరిధిలో అక్రమంగా తవ్విన చేపల చెరువుల గట్లను ధ్వంసం చేసే పనులను అటవీ శాఖ అధికారులు శనివారం ప్రారంభించారు. పొక్లెయిన్ సాయంతో చెరువు గట్లకు గండ్లు కొడుతున్నారు. అధికారుల చర్య నిడమర్రు మండలంలోని కొల్లేరు ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. చేపల చెరువుల రైతులు హడావుడిగా పట్టుబడులు పట్టేందుకు ఉపక్రమిస్తున్నారు. ఇదిలావుండగా, శనివారం ఒక్కరోజే 70 ఎకరాల్లో విస్తరించి వున్న మూడు చెరువులకు నాలుగు వైపులా గండ్లు కొట్టారు. అటవీ శాఖ అధికారులు టీజే బెనర్జీ, టి.నాగమణేశ్వరి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుండగా, సుమారు 30మంది బేస్ క్యాంప్ సిబ్బంది సహకరిస్తున్నారు.
ఉన్నతస్థాయి నిర్ణయం మేరకే..
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 2006 సంవత్సరంలో ప్రభుత్వం రెండు నెలలపాటు ‘ఆపరేషన్ కొల్లేరు’ పేరిట చెరువులను ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టింది. తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక అదే కార్యక్రమాన్ని చాపకింద నీరులా చేపట్టడం కొల్లేరు ప్రాంతంలో చర్చనీయూంశమైంది. ఇదిలావుండగా, చెరువుల్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని వారుుదా వేయూలని పలువురు రైతులు అధికారులను కోరుతున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించవద్దని అధికారులు వారికి నచ్చచెబుతున్నారు. మాటవినని రైతులపై కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నిడమర్రులోని వెంకటాపురంలో 130 ఎకరాల్లో అక్రమంగా తవ్విన చెరువులను మాత్రమే ధ్వంసం చేస్తామని అధికారులు పైకి చెబుతున్నా.. తెరవెనుక మాత్రం కొల్లేరును పూర్తిగా ప్రక్షాళను చేసే వరకూ దశల వారీగా ఈ కార్యక్రమం జరుగుతుం దని తెలుస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఐదో కాంటూర్ పరిధిలో గల అన్ని చేపల చెరువుల్ని ధ్వంసం చేయూలని పర్యావరణవేత్తలు కోరుతుండగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యంత్రాంగం సైతం ఆ దిశగా అడుగులు వేస్తోంది.
తీవ్రంగా నష్టపోతున్న లీజుదారులు
ముందస్తు సమాచారం ఇవ్వకుండా అటవీ శాఖ అధికారులు చేపల చెరువుల గట్లకు గండ్లు పెడుతుండటంతో చెరువుల్ని లీజుకు తీసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడుల్లో 20 శాతం కూడా రాని పరిస్థితి నెలకొంది. చెరువుల్లో చేప పిల్లలు వేసి రెండుమూడు నెలలు మాత్రమే అరుు్యంది. ఈ దృష్ట్యా వాటిలోని చేపలు పూర్తిగా ఎదగదలేదు. దీనివల్ల పిల్ల చేపలను అమ్ముకునే పరిస్థితి కూడా లేదని లీజుదారులు వాపోతున్నారు. ఒకవేళ వాటిని అప్పటికప్పుడు పట్టించి అమ్ముకుందామన్నా సరిపడినంత స్థాయిలో మత్స్యకారులు అందుబాటులో లేరు. దీంతో చేపల పట్టుబడులు పట్టే అవకాశం లేక టన్నులకొద్దీ చేపలు చనిపోతున్నాయి. వీటిని స్థానికులు పట్టుకెళుతున్నారు.