Operation Collina
-
కొల్లేరు ప్రక్షాళనకు విరామం
ఏలూరు : కొల్లేరు సరస్సు ప్రక్షాళనకు తాతాల్కికంగా బ్రేక్ పడింది. నిడమర్రులో 125 ఎకరాల్లో ఆక్రమణలను సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో గత నెలలో తొలగించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే ఆపరేషన్ కొల్లేరు పేరిట మిగిలిన సరస్సు పరిధిలోని చేపల చెరువుల్ని ధ్వంసం చేసేందుకు కొల్లేరు అభయూరణ్యం అధికారులు కార్యాచరణ రూపొందించారు. అయితే, నిధుల లేమి, మరోపక్క పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై సుప్రీం కోర్టు నుంచి మార్గదర్శకాలు అందకపోవడంతో కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమానికి ఆ శాఖ అధికారులు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. పరిహారం చెల్లింపే అడ్డంకి జిరాయితీ భూముల్లో చేపల చెరువులను తొలగించి, ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవాలంటే వాటి యజమానులకు నష్టపరి హారం చెల్లించాల్సి ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం నోరు మెదపటం లేదు. మరోవైపు కొల్లేరులో చేపల చెరువులను ధ్వంసం చేస్తే సాగుదారులు నష్టపోతారని, ఈ విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని గత నెల 10న ఏలూరులో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. భూముల వారీగా సర్వే నంబర్ల వివరాలతో వాస్తవ పరిస్థితులను గుర్తించేందుకు సర్వే చేయూలని మంత్రి ఆదేశించారు. అయితే, ప్రక్షాళన విషయమై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కొల్లేరులో ఆక్రమణల వైపు యంత్రాంగం కన్నెత్తి చూడటం లేదు. మత్స్యశాఖ సహకారమేదీ ఆపరేషన్ కొల్లేరు పేరిట 2006లో జిల్లాలో పెద్దఎత్తున చేపల చెరువుల గట్లను ధ్వంసం చేశారు. ఆ తరువాత దానిని పట్టించుకోవడం మానేశారు. దీంతో పాత చెరువులను అక్రమ సాగుదారులు పునరుద్ధరించారు. పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలోని 7 మండలాల్లో 6వేల ఎకరాలను చెరువులుగా మార్చేసినట్టు అంచనా. ఇందులో ప్రభుత్వం భూ ములు 1,300 ఎకరాలు, జిరాయితీ భూ ములు 4,700 ఎకరాలు ఉన్నట్టు జిల్లా వన్యప్రాణి విభాగం అధికారులు గుర్తించారు. చెరువులు తవ్వడానికి మత్స్యశాఖ నుంచి సాగుదారులు అనుమతులు తీసుకున్నారు. అనుమతి తీసుకున్నది ఒకచోట కాగా, చెరువులు తవ్వింది మరోచోట కావడంతో అనుమతులు ఉన్న చెరువులు ఏవి అనేది స్పష్టం కావడం లేదు. ఈ విషయంలో అటవీ శాఖకు సహాయం అందించాల్సిన మత్య్సశాఖ మొహం చాటేయడం అనుమానాలకు తావిస్తోంది. నిధుల ఊసెత్తని ప్రభుత్వం కొల్లేరు వ్యవహారంపై సుప్రీం కోర్టులో 200కు పైగా కేసులు నడుస్తున్నారుు. ఈ నేపథ్యం లోనే కొల్లేరులోని 6వేల ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ కోసం ఆక్రమణలు తొలగించాలన్నా, వాటిని విదేశీ, స్వదేశీ పక్షులకు విడిది కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నా పెద్దఎత్తున నిధులు అవసరం ఉంది. చెరువుల ధ్వంసానికి నిధులివ్వాలని జిల్లా అధికారులు నివేదిక సమర్పించినా ప్రభుత్వం దానిపై ఇంకా దృష్టి సారించలేదు. -
మళ్లీ మొదలైంది ఆపరేషన్ కొల్లేరు
నిడమర్రు : ఆక్రమణల చెరలో చిక్కు కున్న కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమం మళ్లీ మొదలైంది. ‘ఆపరేషన్ కొల్లేరు’ కార్యక్రమానికి అధికార యంత్రాంగం చడీచప్పుడు లేకుండా శ్రీకారం చుట్టింది. నిడమర్రులోని వెంకటాపురం ప్రాంతంలో కొల్లేరు అభయారణ్యం పరిధిలో అక్రమంగా తవ్విన చేపల చెరువుల గట్లను ధ్వంసం చేసే పనులను అటవీ శాఖ అధికారులు శనివారం ప్రారంభించారు. పొక్లెయిన్ సాయంతో చెరువు గట్లకు గండ్లు కొడుతున్నారు. అధికారుల చర్య నిడమర్రు మండలంలోని కొల్లేరు ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. చేపల చెరువుల రైతులు హడావుడిగా పట్టుబడులు పట్టేందుకు ఉపక్రమిస్తున్నారు. ఇదిలావుండగా, శనివారం ఒక్కరోజే 70 ఎకరాల్లో విస్తరించి వున్న మూడు చెరువులకు నాలుగు వైపులా గండ్లు కొట్టారు. అటవీ శాఖ అధికారులు టీజే బెనర్జీ, టి.నాగమణేశ్వరి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుండగా, సుమారు 30మంది బేస్ క్యాంప్ సిబ్బంది సహకరిస్తున్నారు. ఉన్నతస్థాయి నిర్ణయం మేరకే.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 2006 సంవత్సరంలో ప్రభుత్వం రెండు నెలలపాటు ‘ఆపరేషన్ కొల్లేరు’ పేరిట చెరువులను ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టింది. తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక అదే కార్యక్రమాన్ని చాపకింద నీరులా చేపట్టడం కొల్లేరు ప్రాంతంలో చర్చనీయూంశమైంది. ఇదిలావుండగా, చెరువుల్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని వారుుదా వేయూలని పలువురు రైతులు అధికారులను కోరుతున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించవద్దని అధికారులు వారికి నచ్చచెబుతున్నారు. మాటవినని రైతులపై కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నిడమర్రులోని వెంకటాపురంలో 130 ఎకరాల్లో అక్రమంగా తవ్విన చెరువులను మాత్రమే ధ్వంసం చేస్తామని అధికారులు పైకి చెబుతున్నా.. తెరవెనుక మాత్రం కొల్లేరును పూర్తిగా ప్రక్షాళను చేసే వరకూ దశల వారీగా ఈ కార్యక్రమం జరుగుతుం దని తెలుస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఐదో కాంటూర్ పరిధిలో గల అన్ని చేపల చెరువుల్ని ధ్వంసం చేయూలని పర్యావరణవేత్తలు కోరుతుండగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యంత్రాంగం సైతం ఆ దిశగా అడుగులు వేస్తోంది. తీవ్రంగా నష్టపోతున్న లీజుదారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అటవీ శాఖ అధికారులు చేపల చెరువుల గట్లకు గండ్లు పెడుతుండటంతో చెరువుల్ని లీజుకు తీసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడుల్లో 20 శాతం కూడా రాని పరిస్థితి నెలకొంది. చెరువుల్లో చేప పిల్లలు వేసి రెండుమూడు నెలలు మాత్రమే అరుు్యంది. ఈ దృష్ట్యా వాటిలోని చేపలు పూర్తిగా ఎదగదలేదు. దీనివల్ల పిల్ల చేపలను అమ్ముకునే పరిస్థితి కూడా లేదని లీజుదారులు వాపోతున్నారు. ఒకవేళ వాటిని అప్పటికప్పుడు పట్టించి అమ్ముకుందామన్నా సరిపడినంత స్థాయిలో మత్స్యకారులు అందుబాటులో లేరు. దీంతో చేపల పట్టుబడులు పట్టే అవకాశం లేక టన్నులకొద్దీ చేపలు చనిపోతున్నాయి. వీటిని స్థానికులు పట్టుకెళుతున్నారు.