20 వేల ఎకరాలకు కంది విత్తనాల పంపిణీ
20 వేల ఎకరాలకు కంది విత్తనాల పంపిణీ
Published Mon, Jan 9 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM
పెదనిండ్రకొలను (నిడమర్రు) : జిల్లావ్యాప్తంగా 20 వేల ఎకరాల విస్తీర్ణానికి çసరిపడా కంది విత్తనాలు ఉచితంగా రైతులకు పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వై.సాయిలక్షీశ్వరి అన్నారు. ఆదివారం పెదనిండ్రకొలనులో కంది పంట క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. గ్రామంలో వ్యవసాయశాఖ, ఆత్మ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 100 ఎకరాల చేపల చెరువు గట్లపై సాగు చేసిన కంది పంట దిగుబడిని రైతులకు ప్రదర్శించారు. జిల్లాలో చేపల చెరువుల విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో చెరువు గట్లపై కంది సాగు చేయాలని ఆత్మ చైర్మ¯ŒS పసల గంగరామచంద్రం సూచించారు. చెరువు గట్టుపై కంది పంట యాజమాన్య పద్ధతులను అధికారులు వివరించారు. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, సర్పంచ్ వంగా సీతాకుమారి, తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మ¯ŒS పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement