officers told
-
20 వేల ఎకరాలకు కంది విత్తనాల పంపిణీ
పెదనిండ్రకొలను (నిడమర్రు) : జిల్లావ్యాప్తంగా 20 వేల ఎకరాల విస్తీర్ణానికి çసరిపడా కంది విత్తనాలు ఉచితంగా రైతులకు పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వై.సాయిలక్షీశ్వరి అన్నారు. ఆదివారం పెదనిండ్రకొలనులో కంది పంట క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. గ్రామంలో వ్యవసాయశాఖ, ఆత్మ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 100 ఎకరాల చేపల చెరువు గట్లపై సాగు చేసిన కంది పంట దిగుబడిని రైతులకు ప్రదర్శించారు. జిల్లాలో చేపల చెరువుల విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో చెరువు గట్లపై కంది సాగు చేయాలని ఆత్మ చైర్మ¯ŒS పసల గంగరామచంద్రం సూచించారు. చెరువు గట్టుపై కంది పంట యాజమాన్య పద్ధతులను అధికారులు వివరించారు. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, సర్పంచ్ వంగా సీతాకుమారి, తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మ¯ŒS పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
11 నుంచి ‘మన గుడి’
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : హిందూ ధర్మ ప్రచార పరిషత్, దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 8వ విడత మన గుడి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్. దుర్గాప్రసాద్, ధర్మ ప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు ఎంవీఎస్.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు తెలిపారు. సమావేశంలో టీఎస్.రవికుమార్, కెవీ.నరసింహాచార్యులు, ఎస్ఎస్.చక్రధర్, జీవీ.నాగేశ్వరరావు, సీహెచ్. సత్యనారాయణరాజు పాల్గొన్నారు. -
పశ్చిమ డెల్టాకు 4 వేల క్యూసెక్కులు
కొవ్వూరు : జిల్లాలోని పశ్చిమ డెల్టా కాలువకు సాగునీటి అవసరాల నిమిత్తం 4 వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గోదావరికి 29,074 క్యూసెక్కుల ఇ¯ŒSఫ్లో వస్తుంది. దీనిలో ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 8,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిగిలిన 20,774 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. -
రెడ్డి బార్‌పై ఎస్టీఎఫ్ అధికారుల దాడులు
ప్రొద్దుటూరు క్రై ం: స్థానిక శివాలయం వీ«ధిలోని రెడ్డి బార్ అండ్ రెస్టారెంట్‌పై మంగళవారం ఎస్టీఎఫ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎకై ్సజ్ అధికారులు తెలిపిన వివరాల మేరకు రెడ్డి బార్ అండ్ రెస్టారెంట్లో నీళ్లు కలిపిన మద్యం విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో విజయవాడ నుంచి వచ్చిన ఎస్టీఎఫ్ సీఐ కష్ణమూర్తి, ఎస్ఐ లక్ష్మినారాయణలు స్థానిక ఎకై ్సజ్ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. బార్‌లోని హనీబీ బ్రాండ్‌కు చెందిన 180 మద్యం సీసాలను ప్రాథమికంగా పరీక్షలు చేయడంతో నీళ్లు కలిపినట్లు నిర్ధారణ అయిందని సీఐ ఫణీంద్ర తెలిపారు. దీంతో మూడు కేసుల్లోని 67 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీసాలోని రెండు ఔన్స్‌ల మద్యాన్ని తీసి వాటి స్థానంలో నీళ్లను నింపినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు రెడ్డి బార్ అండ్ రెస్టారెంట్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను పరీక్షల నిమిత్తం కర్నూలు ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు సీఐ వివరించారు. ఎకై ్సజ్ స్టేషన్ వద్ద పోలీసు బందోబస్తు గతంలో ఇదే బార్‌పై ఎస్టీఎఫ్ అధికారులు దాడులు చేసినప్పుడు పెద్ద గొడవ చోటు చేసుకుంది. కొందరు అధికారులపై దాడి చేసి, వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఈ సంఘటన దష్టిలో ఉంచుకుని ఎకై ్సజ్ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా త్రీ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్టేషన్ వద్దకు చేరుకొని కేసు నమోదు ప్రక్రియ పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు. -
విద్యుత్ బిల్లులు సరిచేస్తాం
జంగారెడ్డిగూడెం: పోలవరం ప్రాజెక్ట్ పునరావాస కాలనీ వాసులకు అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లులు సరిచేస్తామని ఏపీ ఈపీడీసీఎల్ ఏడీఈ కె.గోపాలకష్ణ తెలిపారు. ఈనెల 17న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పునరావాసంలో విద్యుదావేశం’ శీర్షికన కథనానికి ఈపీడీసీఎల్ అధికారులు స్పందించారు. స్థానిక పేరంపేట రోడ్డులో రామయ్యపేట, పైడిపాక పునరావాస కాలనీలో గురువారం ఏడీఈ కె.గోపాలకృష్ణ, లక్కవరం ఏఈ కె.వెంకటేశ్వరరావు, అకౌంట్స్ అధికారి కె.ఉమామహేశ్వరరావు, ఎల్ఐ పి.గణేష్‌బాబు, లైన్‌మన్ వి.జాన్ పర్యటించారు. కాలనీలో అయా ఇళ్లకు తీసిన విద్యుత్ బిల్లులను పరిశీలించారు. ప్రతి ఇంటా తిరిగి విద్యుత్ మీటర్లలో నమోదైన రీడింగ్‌ను పరిశీలించారు. అనంతరం ఏడీఈ మాట్లాడుతూ ఈ రెండు కాలనీలకు సంబంధించి ఏప్రిల్ నెలలో మీటర్లకు ప్రభుత్వం నుంచి నగదు చెల్లించారని, అయితే కాలనీవాసులు తమ ఆధార్‌కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలు దశల వారీగా ఇవ్వడంతో మీటర్లు ఆన్లైన్ కాలేదన్నారు. అయినా కాలనీవాసులు విద్యుత్ వినియోగిస్తున్నారని చెప్పారు. ఇటీవల 60 కనెక్షన్లు ఆన్లైన్ కాగా వాటి విద్యుత్ రీడింగ్ తీశామన్నారు. నాలుగైదు నెలలకు ఒకే ప్లాట్‌గా రీడింగ్ తీయడం వల్ల శ్లాబు రేటు ఎక్కువగా పడిందని చెప్పారు. అధికంగా వచ్చిన బిల్లులు పరిశీలించి రీడింగ్ మొత్తాన్ని ఏ నెలకు ఆనెల సరిచేసి మరలా కొత్త బిల్లులు జారీ చేస్తామని, దీని వల్ల వినియోగదారులకు రూ.500 నుంచి రూ.1,500 వరకు బిల్లు తగ్గే అవకాశం ఉందన్నారు. రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కాలనీవాసులకు ఏడీఈ హామీ ఇచ్చారు.